corruption

రైతు బంధు పథకం..రెవిన్యూ ఉద్యోగులకు వరం...బతికి ఉన్న రైతు చనిపోయినట్లు నమోదు

Submitted by arun on Mon, 07/02/2018 - 15:13

రైతు బంధు పథకంలో అవినీతి రెవిన్యూ ఉద్యోగులు రాబందులుగా మారారు. లంచాలు ఇవ్వని రైతులపై కక్ష సాధిస్తున్నారు. బతికున్న రైతు చనిపోయినట్లుగా రికార్డుల్లో రాసి రైతు బంధు చెక్కు అందకుండా చేశారు. ఖమ్మం జిల్లా పినపాక మండల కార్యాలయం అవినీతి బాగోతంపై స్పెషల్ స్టోరీ. 

రైతులకు పెట్టుబడి సాయంగా తెలంగాణ ప్రభుత్వం  రైతు బంధు పథకం ప్రవేశపెట్టింది. రైతు బంధు పథకాన్ని  అవినీతి రెవిన్యూ ఉద్యోగులు తూట్లు పొడుస్తున్నారు. రైతులకు లంచాలు డిమాండ్ చేస్తున్నారు, ఇవ్వకపోతే రికార్డులు తారుమారు చేసి రైతులను వేధిస్తున్నారు. 

తాట తీస్తాం : లంచం అడిగితే ఈ నెంబర్ కు ఫోన్ చేయండి

Submitted by arun on Mon, 06/25/2018 - 11:58

అవినీతిపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు లంచం అడిగితే వెంటనే 1064 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) డిప్యూటీ డైరెక్టర్ మధుసూదన్‌రెడ్డి ప్రజలకు సూచించారు. లంచం అడిగే ఉద్యోగుల సమాచారం ఇచ్చిన వ్యక్తులు, సంస్థల వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. లంచం అడగటం, ఇవ్వటం, తీసుకోవటం నేరంగా వెల్లడించారు. 1064 టోల్ ఫ్రీ నెంబర్ అని.. ప్రజల్లో అవగాహన కోసం విస్త్రృతంగా ప్రచారం చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రత్యేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నట్లు తెలిపారు. లంచం ఇవ్వకుండా.. కంప్లయింట్ చేసినప్పుడు న్యాయం జరుగుతుందన్నారు.

తెలంగాణలో మామూళ్ల పోలీసులకు మంగళం

Submitted by arun on Fri, 06/08/2018 - 13:32

తెలంగాణాలో నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్న పోలీసులపై డీజీపీ కొరడా ఝులిపించారు. ఏకంగా స్పెషల్ పోలీసు టీమ్ వ్యవస్థను రద్దు చేశారు. వివిధ జిల్లాలో 391 మంది పోలీసు అవినీతిపారులు ఉన్నారనే లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  పోలీసు శాఖలో తీవ్ర చర్చకు దారి తీసింది.  

“మమ్మల్ని బతకనివ్వండి.. మీరూ బతకండి”

Submitted by hmtvdt on Mon, 04/30/2018 - 11:36

కాస్టింగ్ కౌచ్ గొడవల నుంచి మొదలు పెట్టి.. పవన్ కల్యాణ్ పై శ్రీరెడ్డి తిట్ల వరకూ.. ఈ మధ్య సినిమా రంగం బాగా డిస్టబ్ అయ్యింది. కొన్ని వేదికలపై యువ హీరోలు.. ఆ విషయాలను నిర్భయంగా ప్రస్తావిస్తూ.. తమ అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారు. నిన్న జరిగిన నా పేరు సూర్య ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్..

దేశాన్ని కుదిపేస్తున్న రెండు అత్యాచార ఘటనలు

Submitted by arun on Sat, 04/14/2018 - 10:39

బేటీ బచావో...బేటి పడావో అంటూ  పాలకులు చాలా గొప్ప నినాదాలిచ్చారు బాలికలను రక్షించడానికి. కానీ దీనికిప్పుడు రివర్స్‌గా జరుగుతున్న పరిణామాలు. బేటి బచావో..బేటి డరావో అన్నట్టుగా, ఆడపిల్లలకు రక్షణలేకుండాపోయింది. జమ్మూకాశ్మీర్‌ కతువాలోని ఓ గుడిలో, కొందరు కిరాతకులు, ఎనిమిదేళ్ల బాలికపై సామాహిక అత్యాచారానికి ఒడిగట్టారు. అటు యూపీలో ఓ ఎమ్మెల్యే అతని అనుచరణ గణం యువతిని రేప్‌ చేయడమే కాదు, తండ్రినీ పొట్టనపెట్టుకున్నారు. దోషులను బోనెక్కించాల్సిందిపోయి, వారిని రక్షించాలని పాలకులు, కంకణం కట్టుకోవడమే అంతకుమించిన విషాదం. కులం మతం రంగు పులుమూతూ, అత్యాచారబాధితులకు మరింత శోకం మిగులుస్తున్నారు.

లోకేష్ బాబు స్పందించారు.. అలా చేయనన్నారు

Submitted by arun on Fri, 03/16/2018 - 14:34

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు, మంత్రి లోకేష్ పై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణలపై.. ఇప్పుడు హాట్ హాట్ చర్చ నడుస్తోంది. ఈ విషయంపై.. లోకేష్ ఎలా స్పందిస్తారో చూడాలని అంతా అనుకున్న మాట కూడా వాస్తవం. అయితే.. లోకేష్ ఓ విషయంపై స్పందించారు కానీ.. పవన్ ఆరోపణలపై నేరుగా ఎలాంటి జవాబు ఇవ్వలేదు.

పర్సంటేజీల భారతం

Submitted by lakshman on Mon, 09/18/2017 - 17:29

మామూలు మనుషులు జీవితకాలం కష్టపడినా సాధ్యం కాని సంపాదన.. కేవలం ఐదేళ్లలోనే కొంత మందికి సాధ్యం అవుతోంది. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులను వాళ్లు పోగేసుకుం టున్నారు. కేవలం ఐదు సంవత్సరాలు గడిస్తేనే వాళ్ల ఆస్తులు 500 శాతం కూడా పెరిగిపోతున్నాయి. ఇందు కోసం వాళ్ల దగ్గర ఉన్న మంత్రదండం ఏంటా అని చూస్తే... రాజకీయం! అవును.. ప్రజాప్రతినిధులుగా అందులో నూ ఎంపీలు లేదా ఎమ్మెల్యేలుగా ఐదేళ్లు పనిచేసిన వారు పోగేసుకుంటున్న ఆస్తులు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. అప్పటివరకు ఏ వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా అంతంతమాత్రంగానే ఉండేవాళ్లు కూడా ఆ తర్వాత ఒక్కసారిగా కుబేరులు అయిపోతున్నారు.