box office collections

చిరు సినిమాను దాటేస్తున్న రంగస్థలం క‌లెక్షన్స్

Submitted by arun on Sat, 04/14/2018 - 14:36

ఊహించినట్టుగానే ‘రంగస్థలం’ బాక్సాఫీసును షేక్ చేస్తోంది. వసూళ్ల సునామీతో దూసుకెళ్తోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాక అమెరికా, ఆస్ట్రేలియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తోంది. సుకుమార్ తీర్చిదిద్దిన ఈ కళాఖండానికి ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఎన్నడూ చూడని రామ్ చరణ్‌ను చిట్టిబాబులో చూశామంటూ అభిమానులు పొంగిపోతున్నారు. 1980ల నాటి గ్రామీణ రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అలాగే బాక్సాఫీసు వద్ద కాసుల పంట పండిస్తోంది. 

దుమ్మురేపుతున్న ‘రంగస్థలం’ వసూళ్లు!

Submitted by arun on Sat, 03/31/2018 - 10:43

సమ్మర్ రేస్‌లో దమ్ము చూపేందుకు విడుద‌లైన‌ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న‌ట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో సమంతతో కలిసి జతకట్టిన రామ్ చరణ్.. ఈ మూవీలో తన నట విశ్వరూపం చూపాడని మెగాఫ్యాన్స్‌నుండి వినిపిస్తున్నమాట. అత్యంత భారీ అంచనాలతో సుమారు 1700 థియేటర్స్‌లో శుక్రవారం నాడు భారీగా విడుదలైంది ‘రంగస్థలం’. పల్లెటూరి నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమా బాగుందని టాక్‌ రావడం, రాంచరణ్‌, సమంతతోపాటు ప్రధాన తారాగణం యాక్టింగ్‌ బాగుండటం ఈ సినిమాకు కలిసివచ్చినట్టు కనిపిస్తోంది.