International

కోట్లు ఉండి యాచించడం అంటే ఇదే..

Submitted by nanireddy on Sun, 11/04/2018 - 08:11

'కోట్లు ఉండి యాచించడం ఎందుకు' అనే మాట వినే ఉంటారు. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ మహిళ చైనాకు చెందింది. ఆమె వయసు 79 సంవత్సరాలు. ఒక్కగానొక్క కొడుకు.. అతను వ్యాపారాలు చేసి డబ్బు బాగానే సంపాదిస్తున్నాడు. ఆమె పేరిట ఓ విల్లా, కారు, ఎప్పుడు బ్యాంక్ అకౌంట్లు నగదు ఉండేవి.. కానీ ఆమె చేసే పని మాత్రం పలువురికి కోపం తెప్పిస్తోంది. ఆ వృద్ధురాలు అన్ని ఆస్తులు, డబ్బు ఉండి.. హాంగ్‌జూ రైల్వేస్టేషన్‌లో యాచిస్తుంది. ఆమె కొడుకు ఎన్నిసార్లు చెప్పినా వినకుండా యాచించడం చేస్తోంది. దాంతో అతను ప్రభుత్వాధికారులకు ఫిర్యాదు చేశాడు. వారు ఆమె పరిస్థితిని చూసి ఆశ్చర్యపోయారు.. దాంతో ఆమెకోసం కొన్ని పోస్టర్లు సిద్ధం చేశారు.

తాలిబన్ల గురువు సామ్యూల్ హక్ దారుణ హత్య

Submitted by nanireddy on Sat, 11/03/2018 - 09:18

ఫాదర్‌ ఆఫ్‌ తాలిబన్‌ గా భావించే, మత గురువు మౌలానా సామ్యూల్ హక్ (82) పాక్ లో దారుణ హత్యకు గురయ్యారు. పాకిస్థాన్‌లోని రావల్పిండిలో హక్ నివాసంలోనే శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు హక్‌ గొంతు కోసి హత్య హతమార్చారు. హక్ హత్యకు కొన్ని నిమిషాల ముందు అయన అనుచరులు బయటికి వెళ్లిపోయారు. దాంతో అదే అదనుగా భావించిన దుంగగులు అయనపై దాడికి తెగబడ్డారు. కత్తితో అత్యంత పాశవికంగా గొంతుకోసి చంపేశారు. తిరిగి వచ్చిన అంగరక్షకులు.. హక్ రక్తపు మడుగులో పడి ఉండటాన్ని గమనించారు. దాంతో హక్ కుమారుడు హమిదుల్ హక్ కు  సమాచారం అందించారు.

వారిని కాల్చేయండి.. డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..

Submitted by nanireddy on Sat, 11/03/2018 - 08:37

 అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా, మెక్సికో సరిహద్దు మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న వలసవాదులను ఉద్దేశించి భద్రతా సిబ్బందికి హెచ్చరికలు చేశారు.  కొంతకాలంగా మధ్య అమెరికాకు చెందిన వలసదారులు మెక్సికో మీదుగా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఈ క్రమంలో మెక్సికో దగ్గర సరిహద్దు దాటే సమయంలో భద్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వుతున్నారు. ఈ సంఘటనలపై సమీక్ష జరిపిన ట్రంప్ మెక్సికో సరిహద్దు దగ్గర ఉండే సైనికులపై రాళ్లు రువ్వితే కాల్పులు జరుపుతామని స్పష్టం చేశారు. అంతేకాకుండా వలసదారులు అక్రమంగా సరిహద్దు దాటే సమయంలో రాళ్లు విసిరతే..

జావాలో 189 మంది జల సమాధి

Submitted by arun on Tue, 10/30/2018 - 10:21

ఇండోనేషియాలో విమానం గల్లంతయ్యింది. లయన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 విమానం జకార్తా నుంచి పంగకల్‌ పిన్నాంగ్‌‌ కు బయలుదేరింది. టేకాఫ్ అయిన 13 నిమిషాలకే విమానం కనిపించకుండా పోయింది. రాడార్‌తో సంబంధాలు తెగిపోవడంతో విమానంలో సముద్రంలో కూలిపోయిందని  అధికారులు అనుమానించారు. విమానంలో 189 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, జెట్ విడిభాగాలు కనిపించడంతో  అందరూ మరణించారు ఉంటారని  అధికారులు ప్రకటించారు. 

సముద్రంలో కూలిన విమానం.. 188 మంది గల్లంతు

Submitted by arun on Mon, 10/29/2018 - 12:59

ఇండోనేషియాలో మరో విమానం కూలింది. జకార్తా నుంచి పంగకల్‌ పినాంగ్‌ బయలు దేరిన లయన్‌ ఎయిర్‌ బోయింగ్‌ విమానం... టేకాఫ్‌ అయిన 13 నిమిషాలకే ఏటీసీ నుంచి సంబధాలు తెగిపోయాయి. ఈ ఉదయం 6 గంటల 33 నిమిషాలకు సముద్రంలో కూలిపోయిందని గుర్తించిన ఇండోనేషియా ప్రభుత్వం... సెర్చ్‌‌ ఆపరేషన్‌ మొదలు పెట్టింది. ఇందులో మొత్తం 188 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వారంతా మరణించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 
 

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన

Submitted by arun on Fri, 10/26/2018 - 11:39

గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సంచలన ప్రకటన చేశారు. గూగుల్ సంస్థలో గడచిన రెండేళ్లలో లైంగిక వేధింపులకు పాల్పడిన 48 మంది ఉద్యోగులను తొలగించామని ఆ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుందర్ పిచాయ్ వెల్లడించారు. తమ సంస్థలో మహిళా ఉద్యోగులకు పూర్తి రక్షణ ఉందని పేర్కొన్న ఆయన.. వారి రక్షణకు గూగుల్ కట్టుబడి ఉందన్నారు. వేధింపులు ఎదుర్కొంటున్న వారు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేస్తే సంస్థ వారికి అండగా ఉంటుందని సుందర్ పిచాయ్ హామీ ఇచ్చారు. తాము తొలగించిన 48 మందిలో 13 మంది సీనియర్ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలిపారు. విధుల నుంచి తొలగింపునకు గురైన వారికి ఎటువంటి ఎగ్జిట్ ప్యాకేజీ ఉండదని పేర్కొన్నారు.

అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న పార్సిల్ బాంబులు

Submitted by arun on Thu, 10/25/2018 - 10:08

అగ్ర రాజ్యం అమెరికాను పార్సిల్ బాంబుల భయం వీడటం లేదు.  ప్రముఖులే లక్ష్యంగా ఆగంతకులు పార్సిల్ బాంబులను పంపుతున్నారు. తాజాగా  మరో రెండు పార్సిల్ బాంబులను సీక్రెట్ సర్వీస్‌ గుర్తించింది. యూఎస్ ప్రతినిధితో పాటు మరో ఐదుగురికి పంపిన పార్సిల్ బాంబులను గుర్తించింది. తాజా పరిణామాల నేపధ్యంలో ఎఫ్‌బీఐ ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది. పూర్తి స్ధాయి తనిఖీల తరువాతే ప్రముఖుల నివాసాల్లోకి వాహనాలు, ఇతర వస్తువులను అనుమతించాలని ఆదేశించింది. 

చైనాలో మరో ఇంజనీరింగ్‌ అద్భుతం

Submitted by arun on Mon, 10/22/2018 - 12:24

ఆకాశ హర్మ్యాలకు, వింత భవనాలకు పెట్టింది పేరు చైనా. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గాజు వంతెన నిర్మించి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచంలోనే సముద్రంపై అతి పొడవైన వంతెన నిర్మించి రికార్డు క్రియేట్ చేసింది. ఈ నెల 24 న ఈ వంతెన ప్రారంభం కానుంది.

మరో అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్దమైన చైనా

Submitted by nanireddy on Sun, 10/21/2018 - 09:18

చైనా మరో ఇంజనీరింగ్‌ అద్భుతాన్ని ఆవిష్కరించడానికి సిద్ధమైంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన సముద్ర వంతెన అక్టోబర్‌ 24న ప్రారంభించనున్నట్లు ఆ దేశ అధికారిక న్యూస్‌ ఏజెన్సీ జినుహా తెలిపింది. పెరల్‌ నది డెల్టాలోని హాంకాంగ్‌– జుహై– మకావు నగరాలను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్‌ ప్రారంభించనున్నారు. 55 కి.మీ. పొడవున్న ఈ వంతెన 22.9 కిలోమీటర్లు సముద్రంపై, 6.7 కిలో మీటర్లు సొరంగంలో ఉంది.

భారత కంపెనీలకు ట్రంప్ షాక్!

Submitted by nanireddy on Fri, 10/19/2018 - 15:23

హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు ట్రంప్‌ యంత్రాగం ప్రతిపాదనలు తీసుకు రానుంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోంల్యాండ్‌ సెక్యూరిటీ (డీహెచ్‌ఎస్‌) ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. 2019 ఆగస్టు నాటికి హెచ్‌ 1బీ వీసా విధానంలో మార్పులు తీసుకొచ్చేందుకు సరికొత్త ప్రతిపాదనలను యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ కసరత్తులు చేస్తోంది. దీని ప్రభావం యూఎస్‌లోని భారతీయ ఐటీ కంపెనీలు, చిన్న, మధ్యతరహా కంపెనీలపై పడనుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.