International

అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

Submitted by arun on Fri, 09/07/2018 - 10:49

అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి లోని ఓ బ్యాంక్‌లో గుర్తుతెలియని  వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు జరిపిన ఫైరింగ్ లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన వారిని దగ్గర్లోనిఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు గుంటూరు జిల్లా  తెనాలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. 

పదేళ్లలో మునిగిపోనున్న బ్యాంకాక్

Submitted by admin on Tue, 09/04/2018 - 12:44

బ్యాంకాక్ గురించి అక్కడి అందమైన బీచ్‌ల గురించి వినని వారు ఉండరు.ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వివిధ దేశాల నుండి అక్కడకు పర్యటనకు వస్తారు.ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకాక్ లో ఎక్కువ మంది తమ జీవనాన్ని సాగించేది పర్యాటకం మీదనే.అటువంటి బ్యాంకాక్ కేవలం పదంటే పదేళ్లలో 40 శాతం వరకు సముద్రగర్భంలో కలిసిపోతుందని దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని తేల్చి చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

పాక్ ప్రధానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 20:55

పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా గడవవకముందే అమెరికా అధ్యక్షుడి నోటా షాకింగ్ మాట విన్నారు ఇమ్రాన్ ఖాన్. పాక్‌కు సహాయంగా ఇవ్వాల్సిన 500 మిలియన్‌ డాలర్ల నిధులకు ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ షాక్‌ నుంచి 

డోనాల్డ్ ట్రంప్ కు మళ్ళీ చిర్రెత్తుకొచ్చింది.

Submitted by nanireddy on Sat, 09/01/2018 - 08:21

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మళ్ళి చిర్రెత్తుకొచ్చింది. అమెరికా పట్ల WTO (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్)అనైతికంగా వ్యవహరిస్తోందని.. WTO తన రూల్స్‌ను మార్చకపోతే ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్‌ వరుసగా ప్రకటిస్తున్న రక్షణాత్మక విధానాలు వాణిజ్య పోరుకు తెరతీస్తున్న నేపథ్యంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి WTO కృషి చేస్తోంది.. ప్రస్తుతం  అమెరికా సహాయ నిరాకరణతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. WTOలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఒక న్యాయమూర్తిని మళ్ళీ  నియమించడంతో వివాదం ముదిరింది. దీంతో  WTO వాణిజ్య వివాదాల పరిష్కార సామర్ధ్యాన్ని కోల్పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

కొత్త రికార్డులు సృష్టిస్తున్న డిజిల్

Submitted by admin on Wed, 08/29/2018 - 12:39

మార్కెట్ ఇచ్చిన రెక్కలోచ్చే డీజిల్ ధరలకు,
చుక్కల్లో వెళుతుండే అసలు చమురు ధరలు,
పెట్రోల్ కూడా ఆల్ టైమ్ రికార్డుకు ఇక దొరలు,
సామాన్యుడిపైనే భారం పెంచే ఈ అసాధారణ ధరలు

“నైక్” బ్రాండ్ ఖరీదైన ఆటగాడు: పని కంటే ఇదే మేలు

Submitted by admin on Tue, 08/28/2018 - 13:17

మలేషియాలోని “నైక్” బ్రాండ్  కర్మాగార కార్మికులందరి సంవత్సర సంపాదన కలిపినా కూడా, ప్రముఖ ఆటగాడు అయిన “మిఖైల్ జోర్డాన్” కు “నైక్  సంస్థ” నుండి వచ్చే సంవత్సర సంపాదనే ఎక్కువట.అంటే కార్మికులంతా కష్టపడి సంవత్సరం పాటు శ్రమిస్తే దాని ద్వారా వచ్చే సంపాదన చాలా తక్కువ అనిమాట.ఇదొక్కటే కాదు చాలా సంస్థలు తమ కార్మికులకంటే బ్రాండ్ అబాంసిడర్లకే ఎక్కువ ఖర్చు చేస్తుంటాయి.ఈ లెక్కన చూసుకుంటే కష్టపడి పనిచేయడం కంటే ఆటలు ఆడుకోవడం మేలు అనిపిస్తుంది కదా..!

బయటపడ్డ అమెరికా వేసిన బాంబు

Submitted by nanireddy on Mon, 08/27/2018 - 15:33

ప్రపంచాన్ని వణికించిన యుద్దాలు రెండు.. మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధం.  మొదటి దానితో  పోల్చుకుంటే రెండో యుద్ధం సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.. ఆ  యుద్ధంలో లక్షలాది మంది ప్రాణాలు వదిలారు. అయితే అంత ఘోరం జరగడానికి ఓ కారణం ఉంది. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన ఫిరంగులు, బాంబుల వలెనే అంతమంది మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలమంది ప్రాణాలు తీసిన నాటి బాంబు ఒకటి బయటపడటంతో జనాలు మరోసారి ఆందోళన చెందారు. ఈ సంఘటన జర్మనిలో చోటుచేసుకుంది. జర్మనిలో ఓ బహుళ అంతస్థు నిర్మాణ పనుల జరుగుతున్న సమయంలో ఇది బయటపడింది. దీంతో వారు పురావస్తు అధికారులకు సమాచారం అందించారు.

ప్రధాని ఒక వ్యభిచారి : జర్నలిస్టు రెహమ్‌ఖాన్‌

Submitted by nanireddy on Mon, 08/27/2018 - 08:26

ఇటీవల పాకిస్థాన్‌ కు నూతన ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కు మొదటిసారి మాజీ  భార్య నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఆయనకొక వ్యభిచారి అని.. అతనో ద్విలింగ సంపర్కుడని మాజీ భార్య, బీబీసీ జర్నలిస్టు రెహమ్‌ఖాన్‌ ఆరోపించారు. ఇటీవల తన 'ఆత్మకథ'ను విడుదల చేసిన ఆమె.. అందులో ఇమ్రాన్‌కు సంబంధించిన పలు వివాదాస్పద అంశాలను ప్రస్తావించారు. 'ఇమ్రాన్‌ డ్రగ్స్‌కు బానిస, పైగా అతనొక పెద్ద అబద్ధాల కోరు' అని అందులో పేర్కొన్నారు. దీంతో ఆమెపై ఇమ్రాన్ ఖాన్ అభిమానులు మండిపడుతున్నారు. తక్షణమే ఆ మాటలను తొలగించాలని అభిప్రాయపడుతున్నారు. 

బయటపడిన 40 వేల ఏళ్లనాటి గుర్రం పిల్ల అవశేషం

Submitted by nanireddy on Fri, 08/24/2018 - 19:36

ఒకటి కాదు రెండు ఏకంగా 40 వేల ఏళ్లనాటి గుర్రం పిల్ల అవశేషం ఒకటి బయటపడింది. ఇది సైబీరియన్ మంచు శిఖర ప్రాంతంలో బయటపడింది. ‘మౌత్ ఆఫ్ హెల్’ పర్వత ప్రాంతంలో దీనిని రష్యన్ శాస్త్రవేత్తలు దీనిని గుర్తించారు. ఇది వందల ఏళ్ల కిందట  అంతరించిపోయిన లీనా జాతికిచెందిన గుర్రం పిల్లగా శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పట్లో ఈ జాతి గుర్రాలు కేవలం మంచు పర్వతాల్లో మాత్రమే నివసించేవిగా వారు తమ పరిశోధనలో తేల్చారు. 37 అంగుళాలు పొడవు ఉన్న ఈ గుర్రపు పిల్ల మరణించిన సమయంలో రెండు నెలల వయస్సు మాత్రమే ఉన్నట్లు తెలిపారు. 

కేరళ వర్షాలపై నాసా శాటిలైట్ వీడియో

Submitted by arun on Thu, 08/23/2018 - 12:53

నైరుతి రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగానే కేరళ అతలాకుతలమైందని నాసా తేల్చింది. ఈ మేరకు భారత దేశవ్యాప్తంగా వర్షపాతాన్ని లెక్కిస్తూ ఉపగ్రహాన్ని ఉపయోగించి తీసిన వీడియోను విడుదల చేసింది. భారత్‌లో ఇది వర్షాలకు అనుకూల సమయమన్న నాసా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో కేరళలో ఎడతెరపి లేకుండా వందల సెంటీమీటర్ల వర్షం కురిసిందని తెలిపింది.