pakistan

బాలికపై అత్యాచారం: కూతురితో కలిసి యాంకర్‌..

Submitted by arun on Thu, 01/11/2018 - 16:46

ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని లైవ్‌లో వార్తలు చదివిన ఘటన పాకిస్థాన్‌లోని సామా టీవీ స్టూడియోలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ బాలికపై దుండగులు అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని వీధుల్లో పడేశారు. అందుకు ఓ తల్లిగా నిరసన తెలుపుతూ న్యూన్ రీడర్ కిరణ్ నాజ్ లైవ్‌లో వార్తలు చదువుతూ బాలిక కిడ్నాప్ గురించి వివరించింది.

అదే పాక్ అదే అబద్దం

Submitted by arun on Fri, 01/05/2018 - 15:37

ఉగ్రవాద దేశమన్న కారణంగా ప్రపంచమంతా ఏకాకిని చేసినా పాకిస్థాన్ పాపపు బుద్ధి మారటం లేదు. తమ చెరలో బందీగా ఉన్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ తో అవాకులూ, చవాకులు మాట్లాడించి మరో వీడియోను విడుదల చేసింది. కులభూషణ్ తో భారత్ ను తిట్టించింది. అబద్ధాల పాకిస్థాన్ మరో పాపానికి ఒడిగట్టింది.. తమ కస్టడీలో ఉంచుకున్న భారత మాజీ నేవీ అధికారి కులభూషణ్ చేత ఇష్టాను సారం మాట్లాడిస్తోంది.. భారత్ ను తిట్టిస్తోంది. చేయని నేరాన్ని చేశానని ఒప్పిస్తోంది. రాసిచ్చిన స్క్రిప్టును చదివించి.. దానిని షూట్ చేసి ఆ అధికారి అభిప్రాయంగా చూపిస్తోంది.

ట్రంప్ దెబ్బ ఇలా ఉంటుంది

Submitted by arun on Wed, 01/03/2018 - 17:03

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ, పక్కనే ఉన్న భారత్‌కు, ప్రపంచ దేశాలకు ప్రమాదకారిగా మారిన పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చాడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇన్నాళ్లూ తమకు అండగా ఉండేందుకు పాక్‌కు ఆర్థికసాయం చేస్తున్నప్పటికీ.. పాక్‌ మాత్రం పచ్చి అబద్ధాలతో మోసం చేస్తూవస్తోందని తన అధికారిక ట్విట్టర్‌ పేజీలో చెంపచెళ్లుమనిపించే కామెంట్స్ చేశాడు ట్రంప్. ఇన్నాళ్లుగా అందిస్తున్న సాయం ఇకపై ఉండదని చెప్పేశారు. 

పాకిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ..

Submitted by arun on Tue, 01/02/2018 - 11:30

వదరుబోతు పాకిస్థాన్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.. 15 ఏళ్లుగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరుకు ఆ సొమ్మును వినియోగించాలని తాము పంపిస్తే పాకిస్థాన్ అబద్ధాలాడుతూ ఆ సొమ్మును దుర్వినియోగంచేసిందని డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.. 

జాదవ్‌ కుటుంబాన్ని మానసికంగా హింసించిన పాక్.. జాదవ్‌ భార్య బొట్టు, మంగళసూత్రం తీయించిన పాక్ అధికారులు

Submitted by arun on Wed, 12/27/2017 - 10:31

పాక్ వక్రబుద్దిని మార్చుకోవడం లేదు. కుల్‌భూషణ్ జాదవ్‌ను ఎక్కడో అరెస్ట్ చేసి పాకిస్తాన్‌లో అరెస్ట్ చేసినట్లు నాటకానికి తెరతీసింది. నాటకాలను అక్కడితో ఆపలేదు. జాదవ్‌ను జైలులో అనేక రకాలుగా చిత్రహింసలకు గురి చేసింది. మరణశిక్ష విధించిన పాక్ ఐక్యరాజ్యసమితి ఒత్తిడితో మరణశిక్షను వాయిదా వేసింది. తాజాగా జాదవ్‌ను చూసేందుకు అనుమతించిన పాకిస్తాన్‌ ఇస్లామాబాద్‌ వెళ్లిన తర్వాత తల్లి, భార్యను కలిసే అవకాశం లేకుండా అద్దాలతో అడ్డుగోడ కట్టింది. జాదవ్‌ ఉన్న రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. ఫోన్‌ ఎత్తి మాట్లాడే అవకాశం లేకుండా దుర్మార్గం వ్యవహరించింది.

పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్థిని చాటుకుంది

Submitted by arun on Mon, 12/25/2017 - 18:22

పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్థిని చాటుకుంది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ పై తన నీచ సంస్కృతిని చాటుకుంది. దేశద్రోహం, గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైళ్లో మగ్గుతున్న జాదవ్‌ను చూసేందుకు మాత్రమే అనుమతిచ్చిన పాక్‌ సర్కార్‌ ఆత్మీయుల మధ్య అడ్డుగోడలు ఏంటని పలువురు మండిపడుతున్నారు.

ఎట్టకేలకు 22 నెలల తర్వాత కుల్‌భూషణ్‌ జాదవ్‌ భార్య, తల్లిని కలిశాడు. భారత్ నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ తల్లి, భార్య పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో జాదవ్‌ను కలిశారు. అరగంటసేపు భేటీ అయిన అతని భార్య, తల్లి కుల్‌భూషణ్‌‌ను చూడగానే ఉద్వేగానికి లోనయ్యారు. 

జాదవ్‌ను కలిసిన తల్లి, భార్య

Submitted by arun on Mon, 12/25/2017 - 15:12

పాకిస్థాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత మాజీ నేవీ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను ఎట్టకేలకు ఆయన తల్లి, భార్య కలుసుకున్నారు. ఈ ఉదయం ఇస్లామాబాద్‌ చేరుకున్న జాదవ్‌ కుటుంబసభ్యులు పాక్‌ విదేశీ వ్యవహారాల కార్యాలయంలో ఆయనను కలుసుకున్నారు. వారి వెంట భారత డిప్యూటీ హైకమిషనర్‌ జేపీ సింగ్‌ కూడా ఉన్నారు. మొదట ఇస్లామాబాద్‌లోని భారత దౌత్య కార్యాలయం చేరుకున్న జాదవ్‌ తల్లి, భార్య.. అక్కడి నుంచి పాక్‌ విదేశాంగ కార్యాలయంలో ఆయనను కలిశారు. దాదాపు 30 నిమిషాల పాటు వారుజాదవ్‌తో మాట్లాడారు. కాగా.. ఈ సాయంత్రమే వారు తిరిగి భారత్‌కు వెళ్లనున్నారు. దాదాపు 21 నెలల తర్వాత జాదవ్‌ తన కుటుంబసభ్యులను కలుసుకున్నారు.

‘కోహ్లీ.. నన్ను పెళ్లి చేసుకోవా’

Submitted by lakshman on Tue, 09/19/2017 - 17:45

లాహోర్: టీమిండియా ఆటగాళ్లలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ఎవరంటే విరాట్ కోహ్లీ అని టక్కున సమాధానమొస్తుంది. కోహ్లీకి ఇండియాతో పాటు పాకిస్తాన్‌లో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాకిస్తాన్ ఆటగాళ్లతో కోహ్లీకి సన్నిహిత సంబంధాలు ఉండటం కూడా కోహ్లీకి అక్కడ అభిమానులుండటానికి ఒక కారణం కావచ్చు. పాక్‌లో కోహ్లీ క్రేజ్ ఎంతలా ఉందంటే మగాళ్లు కూడా పెళ్లి అభ్యర్థన పంపేంత. ఇండిపెండెన్స్ ఎలెవన్ జట్టులో భారత ఆటగాళ్లెవరూ లేరు. ధోనీ, కోహ్లీ వంటి ఉన్నత శ్రేణి ఆటగాళ్లు జట్టులో సిరీస్‌లో ఆడకపోవడం అక్కడి ఫ్యాన్స్‌ను తీవ్రంగా బాధించింది. కొందరు మిస్ యూ ధోనీ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తుంటే..

ఉగ్రభూతం.. ఎప్పటికి అంతం?

Submitted by lakshman on Mon, 09/18/2017 - 17:16

ఉ..గ్ర..వా..దం... ఎనిమిదో దశకం నుంచే భారతదేశాన్ని వణికిస్తున్న అంశమిది. ప్రగతి బాటలో పయనిస్తున్న నవభారతంలో ఉన్నట్టుండి ఒక్క కుదుపు.. ఈ ఉగ్రవాదం. దీనిపేర్లు ఏవైనా కావచ్చు గానీ చూపిస్తున్న ప్రభావం మాత్రం తీవ్రంగానే ఉంటోంది. ఖలిస్తాన్ పేరుతో పంజాబ్ రాష్ట్రంలో మొదలైన ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి భారీ ఎత్తున ‘ఆపరేషన్ బ్లూ స్టార్’ నిర్వహించాల్సి వచ్చింది. దాంతో దేశంలో ఉగ్రవాదం దాదాపుగా ముగిసినట్లేనని అనుకుంటున్న తరుణంలో.. ఆ తర్వాత తొమ్మిదో దశకం ప్రారంభంలో మళ్లీ ఉగ్రవాదం ఆనవాళ్లు మన దేశంలో కనిపించాయి. అప్పటివరకు ఇక్కడ పెద్దగా కనిపించని ముస్లిం ఉగ్రవాదం ఒకేసారి పెద్దస్థాయిలో కనిపించింది.