pakistan

పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్

Submitted by arun on Fri, 04/13/2018 - 14:22

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు భారీ షాక్ తగిలింది. పనామా పేపర్స్ లీక్ కేసులో.. ప్రధాని పదవి నుంచి తప్పుకున్న నవాజ్ షరీఫ్‌.. ఇక భవిష్యత్తులో ఎలాంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా.. జీవితకాలం నిషేధం విధించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 62, వన్‌ ఎఫ్‌  ప్రకారం.. జీవితకాలం పాటూ నిషేధిస్తున్నట్లు అక్కడి సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో భాగంగా ఈ నిషేధం సరైనదేనని.. తీర్పు సందర్భంగా ఐదుగురు సభ్యుల సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. షరీఫ్‌తోపాటు పాకిస్థానీ తెహ్రీకె ఇన్సాఫ్ ప్రధాన కార్యదర్శి జహంగీర్ తరీన్‌పై కూడా జీవితకాల నిషేధం విధించారు.

డ్యాన్స్ చేయలేదని సింగర్‌ను కాల్చి చంపేశాడు!

Submitted by arun on Thu, 04/12/2018 - 13:03

ఓ వెడ్డింగ్ పార్టీలో డ్యాన్స్ చేయకుండా పాట పాడుతోందని సింగర్‌ని కాల్చిచంపారు ఓ వ్యక్తి. తీవ్ర కలకలం రేపిన ఈ ఘటన పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్‌లో జరిగింది. 24 ఏళ్ల సమినాసింధు అనే సింగర్.. పెళ్లి విందులో పాటలు పాడింది. ఐతే, ఆమె గర్భిణి కావడంతో కేవలం పాటలు మాత్రమే పాడింది. గర్భవతి అయిన గాయని సమీనా కూర్చొని పాటలు పాడుతుండగా తారిఖ్ అహ్మద్ జతోయ్ అనే వ్యక్తి ఆమెను డ్యాన్స్ చేస్తు పాడాలని కోరాడు. తారిఖ్ అహ్మద్ మాట వినలేదనే కోపంతో గాయని సమీనాను తారిఖ్ అహ్మద్ కాల్చి చంపాడు. తీవ్రంగా గాయపడిన సమీనాను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు ప్రకటించారు.

పాక్ లో దావూద్..టచ్ చేయ‌డం భార‌త్ వ‌ల్ల సాధ్యం కాదంట‌

Submitted by lakshman on Wed, 03/14/2018 - 01:25

అండర్ వరల్డ్ డాన్, భారత్ మోస్ట్ వాంటెడ్ దావుద్ ఇబ్రహీం గుట్టురట్టుయింది. అతను ఎక్కడ తలదాచుకున్నాడో తేలిపోయింది. అతని ఆప్తమిత్రుడు తక్లా ఇచ్చిన సమాచారం ప్రకారం అతను పాక్ లోనే తలదాచుకున్నట్లు మరోసారి రుజువైంది. వివరాల్లోకి వెళ్లినట్లయితే అండర్ వరల్డ్ డాన్ దావుద్ కోసం భారత్ పోలీసులు దశాబ్దాల పాటు వేట కొనసాగిస్తున్న విషయం తెలిసింది. ఈ క్రమంలో ఇటీవలే అతని ఆప్తమిత్రుడైన  ఫరూక్ తక్లాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతన్ని విచారించిన  సీబీఐ ..దావుద్ కు సంబంధించిన కీలక సమాచారాన్ని ఫరూక్ తక్లా నుంచి రాబట్టింది.

బానిసగా మార్చిన భర్త: 21 ఏళ్ల తర్వాత పాకిస్థాన్‌ నుంచి హైద్రాబాద్‌కు తిరిగొచ్చిన మహిళ

Submitted by arun on Fri, 03/02/2018 - 11:06

భారత విదేశాంగశాఖ చొరవతో 21ఏళ్ల తర్వాత ఓ మహిళా తల్లితండ్రుల చెంతకు చేరింది. ఒమన్ దేశస్దుడినంటూ నిఖా కుదుర్చుకున్న ఓ పాకిస్దాన్‌ దేశస్తుడు బానిసను చేసి చెరలో బందించాడు. ఎట్టకేలకు విషయం కుటుంబసభ్యులకు తెలియటంతో స్వదేశానికి రప్పించారు. ఇది హైదరాబాద్ పాతబస్తీ బండ్లగూడకు చెందిన మహమ్మదీ బేగం అనుభవించిన నరకం.

పాకిస్థాన్‌కు మరో పరాభవం

Submitted by arun on Sat, 02/24/2018 - 16:27

పాకిస్థాన్‌కు మరో పరాభవం ఎదురయింది. తమ దేశంలో పెరుగుతోన్న ఉగ్రవాదాన్ని అణచడంలో సరైన చర్యలు  తీసుకోని కారణంగా అంతర్జాతీయ సమాజం నుండి ఆంక్షలను ఎదుర్కోవలసి వస్తోంది. తాజాగా గ్లోబల్ మనీ లాండరింగ్ వాచ్ డాగ్..  ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్,  పాక్ ను గ్రే లిస్ట్ నేషన్ గా ప్రకటించనుండటంతో ఆ దేశంలో ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలయ్యే అవకాశం వుందని నిపుణులు భావిస్తున్నారు.

ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్న క్రికెటర్!

Submitted by arun on Mon, 02/19/2018 - 13:33

మాజీ క్రికెటర్‌, పాకిస్థాన్‌ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్‌ (పీటీఐ) పార్టీ చీఫ్‌ ఇమ్రాన్‌ ఖాన్‌ ముచ్చటగా మూడో సారి పెళ్లికొడుకయ్యారు. మత బోధనలు చేసే బుష్రా మనేకాను లాహోర్‌ లోని ఆమె సోదరుడి నివాసంలో కొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. గతంలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఇద్దరు భార్యలతో విడాకులు తీసుకున్నారు. 1995లో బ్రిటిష్‌కు చెందిన బిలియనీర్‌ కుమార్తె జెమీమా గోల్డ్‌స్మిత్‌ను వివాహం చేసుకున్నారు. తొమ్మిదేళ్లు వీళ్లు కలిసి ఉన్నారు. జెమీమాకు ఇద్దరు కుమారులు. తర్వాత 2015లో టీవీ యాంకర్‌ రెహామ్‌ ఖాన్‌ను వివాహం చేసుకున్నారు. వీరు కేవలం పది నెలలు మాత్రమే కలిసి ఉన్నారు.

ఐ ల‌వ్ పాకిస్థాన్

Submitted by lakshman on Wed, 02/14/2018 - 06:44

 కేంద్ర మాజీ మంత్రి మణి శంకర్ అయ్యర్ మ‌రోసారి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. గుజ‌రాత్ ఎన్నిక‌ల  ప్ర‌చార స‌మ‌యంలో పీఎం మోడీ  నీచ జాతికి చెందిన వ్యక్తి అంటూ కామెంట్స్ చేశారు. మణిశంకర్ అయ్యర్ చేసిన ఈ కామెంట్లతో ఒక్కసారిగా గుజరాత్‌ క్యాంపెనింగ్‌ తీరునే మార్చేశారు నరేంద్ర మోదీ. ఈ కామెంట్లతో గుజరాతీ సెంటిమెంట్‌ను రగిలించే ప్రయత్నం చేశారు. తాను అచ్చమైన గుజరాతీనని, అయ్యర్ కామెంట్లు రాష్ట్ర ప్రజలందరిపైనా చేసినవని, బీసీని అయినందుకే ఇలాంటి నీచ్ వ్యాఖ్యలు చేశారని కులం కార్డుతో కుమ్మేశారు.

పాక్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ వార్తలపై ద్రవిడ్‌ క్లారిటీ

Submitted by arun on Tue, 02/06/2018 - 12:26

తాను పాక్‌ ఆటగాళ్ల డ్రస్సింగ్‌ రూమ్‌కి వెళ్లినట్లు వస్తున్న వార్తలను అండర్‌-19 భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కొట్టి పారేశాడు. న్యూజిలాండ్‌లో అండర్‌-19 ప్రపంచకప్‌ గెలిచిన భారత జట్టు సోమవారం ముంబయి చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాహుల్‌ ద్రవిడ్‌, జట్టు సారథి పృథ్వీ షా మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భాగంగా ఒక విలేకరి టోర్నీలో భాగంగా పాకిస్థాన్‌తో సెమీఫైనల్‌ అనంతరం మీరు ఆ జట్టు డ్రస్సింగ్‌ రూమ్‌లోకి వెళ్లి ఆటగాళ్లు, టీమ్‌ మేనేజర్‌తో మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి. ఎందుకు వెళ్లారు?

భార్య‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న మంత్రి!

Submitted by arun on Sat, 02/03/2018 - 12:19

పాకిస్థాన్‌లో ఓ మంత్రి దారుణ చర్యకు పాల్పడ్డాడు. తన భార్యపై కాల్పులు జరిపి హత్య చేసి అనంతరం అదే తుపాకితో తనను తాను కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మీర్ హ‌జార్ ఖాన్ అనే ఆ మంత్రి సింధ్ ప్రావిన్స్‌లో ప్లానింగ్ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ శాఖ బాధ్య‌త‌లు చూస్తున్నారు. ఆయ‌న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన వ్య‌క్తి. ఇంట్లో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య గొడ‌వే ఈ దారుణానికి కార‌ణ‌మ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. గురువారం రాత్రి భార్య ఫ‌రిహా ర‌జాక్‌ను కాల్చి చంపిన మీర్ హ‌జార్ ఖాన్‌.. త‌ర్వాత ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

పాకిస్తాన్‌‌కు మరోసారి బుద్ధి చెప్పిన భారత్‌..ఏడుగురు పాక్‌ సైనికుల హతం

Submitted by arun on Mon, 01/15/2018 - 16:18

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోన్న పాకిస్తాన్‌కు ఇండియన్‌ ఆర్మీ మరోసారి బుద్ధిచెప్పింది. యూరీ సైనిక స్థావరంపై ఉగ్రదాడికి ప్రతీకారంగా గతంలో సర్జికల్‌ స్ట్రైక్స్‌ నిర్వహించి నియంత్రణ రేఖ వెంబడి పాక్‌ తీవ్రవాద స్థావరాలను ధ్వంసంచేసిన భారత సైన్యం మరోసారి తమ సత్తా ఏంటో పాక్‌ సైన్యానికి రుచి చూపించింది. రాజౌరి సెక్టార్‌లో పాక్‌ సైన్యం కాల్పుల్లో భారత జవాను మరణించడంతో ఇండియన్‌ ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏడుగురు పాక్ సైనికులు మరణించారు.