Allagadda

రసవత్తరంగా ఆళ్లగడ్డ రాజకీయాలు

Submitted by arun on Thu, 04/26/2018 - 11:28

అమరావతికి చేరిన ఆళ్లగడ్డ పంచాయితీకి మంత్రి అఖిలప్రియ వరుసగా రెండో రోజూ డుమ్మా కొట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు అపాయింట్‌మెంట్ ఇచ్చినా తనకు సమాచారం లేదంటూ ఎస్కేప్ అయ్యారు. అయితే మరో నేత ఏవీ సుబ్బారెడ్డి మాత్రం బాబు ఆదేశం మేరకు అమరావతి వచ్చారు. ఆళ్లగడ్డ వ్యవహారాన్ని సెటిల్ చేయాలన్న పట్టుదలతో ఉన్న చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఇద్దరు నేతలతో భేటీ కానున్నారు.

మంత్రి అఖిలప్రియతో మనస్పర్థలు వాస్తవమే: సుబ్బారెడ్డి

Submitted by arun on Fri, 04/13/2018 - 11:23

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియతో మనస్పర్ధలు వాస్తవమేనని కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఇకపై ఆళ్లగడ్డలో కాలు పెట్టవద్దని సీఎం చంద్రబాబు తనను హెచ్చరించినట్టుగా వచ్చిన వార్తలపై ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు. ఈ ఉదయం విజయవాడలో తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆయన, చంద్రబాబు తనకు చెప్పినట్టుగా ప్రసారమైన వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. మంత్రి అఖిలప్రియకు, తనకు మధ్య విభేదాలు ఉన్నమాట నిజమేనని, అయితే, అవి చిన్నచిన్నవే తప్ప పెద్దవి కాదని అన్నారు.

ఆళ్లగడ్డ టీడీపీలో ముదిరిన విభేదాలు..

Submitted by arun on Fri, 03/30/2018 - 12:00

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో నివురు గప్పిన నిప్పులా ఉన్న టీడీపీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. మంత్రి అఖిలప్రియ, ఆమె తండ్రి భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఏవీ సుబ్బారెడ్డి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. ఇద్దరూ  బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. సుబ్బారెడ్డి నిర్వహించే కార్యక్రమానికి వెళ్లొద్దని అఖిలప్రియ పార్టీ కార్యకర్తలు, నేతలకు సూచించడం విభేదాలకు ఆజ్యం పోసింది. దీంతో ఆళ్ళగడ్డ టీడీపీలో ఏం జరుగుతోందోననే ఉత్కంఠ నెలకొంది.