sabarimala

శబరిమల వివాదంపై స్పందించిన మంచు మనోజ్‌

Submitted by arun on Wed, 10/31/2018 - 15:43

శబరిమల ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళల ప్రవేశానికి అనుమతిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వటంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయంపై నటుడు మంచు మనోజ్‌ స్పందించారు. ఓ అభిమాని సేవ్‌ శబరిమల క్యాంపెయిన్‌పై ఇప్పటికైనా నోరు విప్పండి అంటూ మనోజ్‌ ను ట్యాగ్‌చేస్తూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌పై స్పందించాడు మనోజ్‌.. ‘మనం పేదలకు నీరు, ఆహారం, చదువు లాంటి కనీస అవసరాల తీర్చడంపై ముందుగా బాధపడాలి. మనకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆయన, తన సమస్యలను తానే పరిష్కరించుకోగలడని కూడా నమ్మాలి. మానవత్వం కోసం పోరాడండి’ అంటూ కామెంట్ చేశాడు మనోజ్‌. మనోజ్ ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది.

శబరిమలలో హైటెన్షన్‌

Submitted by arun on Wed, 10/17/2018 - 10:35

ఇన్నేళ్లుగా భక్తుల నినాదాలతో.. స్వామివారి కీర్తనలతో ప్రతిధ్వనించిన శబరిమల ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకూ ఎప్పుడూ లేని విధంగా..శబరిమల మొత్తం ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.అధ్యాత్మికత కనిపించే చోట.. ఇప్పుడు అందుకు భిన్నంగా శాంతిభద్రతలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు నెలకొన్నాయి.  శతాబ్దాల తరబడి ఉన్న ఆచార వ్యవహారాలు.. నమ్మకాలను పక్కన పెట్టి.. శబరిమల ఆలయంలోకి మహిళల్ని అనుమతిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుతో  ఇప్పుడు అందరి దృష్టశబరిమలపై పడింది.

Tags

అష్టదిగ్బంధంలో శబరిమల అయ్యప్ప ఆలయం

Submitted by arun on Tue, 08/21/2018 - 09:41

కేరళలోని సుప్రసిద్ధ దేవాలయం శబరిమల వరుణుడి అష్టదిగ్బంధంలో కొనసాగుతోంది. శబరికి చేరుకునే మార్గాలన్నింటినీ భారీ వర్షాలు కుదిపేశాయి. చాలాచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి. పంబా నది ఉద్ధృతంగా ప్రవహిస్తుండడంతో శబరిమలకు చేరే దారులన్ని మూసుకుపోయాయి. ఈ నెల 14న నిరుపతరి ప్రత్యేక పూజల సందర్భంగా గుడికి వెళ్లే దారిలేక ప్రధాన అర్చకుడు అయ్యప్ప సన్నిధిలో ఉన్న అర్చకుడితో ఫోన్‌లో మాట్లాడి నిరుపతరి తంతును ముగించేశారు. శబరిమలను చేరేందుకు ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూడు మార్గాలూ జల దిగ్బంధంలో ఉన్నాయి.

అయ్యప్ప ఆగ్రహించాడా...అందుకే కేరళను...

Submitted by arun on Mon, 08/20/2018 - 08:43

శబరిమలై అయ్యప్పకు ఆగ్రహం వచ్చిందా..? హరి హరుల సుపుత్రుడికి కోపం వచ్చిందా..? అందుకే కేరళను జలప్రళయం ముంచెత్తిందా..? వందేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా మలయాలీ సీమను అల్లకల్లోలం చేసిన వరదలకు కారణం మణికంఠుడి శాపమా..? 

శబరి కొండల్లో కొలువైన అయ్యప్పస్వామి కోరి వచ్చిన వారికి కొంగు బంగారం. క్షీరసాగర మధనం తర్వాత మోహినీ అవతారంలో వచ్చిన విష్ణువును శివుడు మోహించడం ద్వారా అయ్యప్ప అవతరించాడని పురాణగాధలు చెబుతున్నాయి. మహిశాసురుని వధించేందుకు అవతరించిన అయ్యప్ప జ్యోతిస్వరూపంలో భక్తులకు అభయమిస్తాడు. 

కేరళపై ప్రకృతి కన్నెర్ర, మునిగిన శబరిమల ఆలయం

Submitted by arun on Sat, 08/18/2018 - 10:05

ఆగస్టు 8వ తేదీ నుంచి వర్షాలు దంచి కొడుతుండటంతో కేరల జలవిలయంలో చిక్కుకుంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయ్ సహాయక బృందాలు. 2వేల 94 క్యాంపులు ఏర్పాటు చేసి మూడున్నర లక్షల మందిని సహాయక శిబిరాలకు తరలించారు. పతనంతిట్ట, అలప్పూజ, ఎర్నాకులం, త్రిశూర్‌, కొచ్చి జిల్లాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. శుక్రవారం ఒక్క రోజే వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 82వేల మందిని సహాయక బృందాలు రక్షించాయ్.మరోవైపు పంపానది ఉధృతంగా ప్రవహించడం, వివిధ డామ్‌ల నుంచి గేట్లు ఎత్తివేడంతో అయ్యప్పస్వామి ఆలయ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో టెంపుల్‌ని మూసివేశారు.

శబరిమలలో అపశ్రుతి

Submitted by arun on Fri, 03/30/2018 - 11:42

శబరిమలలో అపశ్రుతి చోటు చేసుకుంది.  అయప్పస్వామి జన్మదినోత్సవం సందర్భంగా ఏనుగులతో ఊరేగింపు నిర్వహిస్తుండగా ఉన్నట్టుండి ఓ ఏనుగు పరుగులు పెట్టింది. దీంతో  భక్తులు, పోలీసులు తలో వైపు పరుగులు పెట్టారు. ఏనుగును నియంత్రించేందుకు మావటీలు ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు. దీంతో  తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో  భక్తులతో పాటు పలువురు  పోలీసులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు భక్తుల పరిస్ధితి విషమంగా ఉన్నట్టు సమాచారం.