Sye Raa Narasimha Reddy

మెగా సందడి షురూ...విడుదలైన చిరంజీవి ‘సైరా నరసింహా రెడ్డి’ టీజర్‌

Submitted by arun on Tue, 08/21/2018 - 11:52

మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'సైరా' చిత్రం టీజర్ విడుదలైంది. నెట్టింట దూసుకెళుతున్న ఈ టీజర్ ఇప్పుడు దుమ్ము రేపుతోంది. మెగాస్టార్ బర్త్ డేకు ఒక్కరోజు ముందుగా అంటే నేటి(మంగళవారం) ఉదయం 11:30గంటలకు టీజర్‌ను వదిలింది చిత్రబృందం.అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ ఈ సినిమాను ఓ మెట్టు ఎక్కించిందనే చెప్పాలి. విజువల్ వండర్‌లా టీజర్ కనిపిస్తోంది. టీజరే ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కోటపై నిలబడిన చిరు చాలా గంభీరంగా అద్భుతమైన పోరాటపటిమతో కనిపించారు. మొత్తానికి టీజర్ చూస్తుంటే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనిపిస్తోంది.

సైరాకి షాక్‌.. సెట్స్‌ కూల్చివేత

Submitted by arun on Wed, 08/01/2018 - 10:13

మెగాస్టార్‌ చిరంజీవి కథానాయకుడిగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’  చిత్రానికి హైదరాబాద్‌ రెవెన్యూ అధికారులు షాకిచ్చారు. రామ్ చ‌రణ్ హీరోగా తెర‌కెక్కిన రంగ‌స్థ‌లం సినిమా కోసం శేరిలింగంప‌ల్లి రెవిన్యూ ప‌రిధిలో వేసిన సెట్స్‌లోనే సైరా మూవీ షూటింగ్ జ‌రుపుతున్నారు. అయితే ఇది ప్ర‌భుత్వ భూమి కావ‌డంతో చిత్ర నిర్మాత‌లు ఎలాంటి అనుమ‌తి తీసుకోకుండా య‌దేచ్చ‌గా షూటింగ్ జ‌రుపుతున్న క్ర‌మంలో రెవిన్యూ అధికారులు సైరాలో క‌థానాయ‌కుడి ఇంటి సెట్‌ని కూల్చేశారు. గ‌తంలో ప‌లు మార్లు ఆ స్థలాన్ని ఖాళీ చేయ‌మ‌ని నోటీసులు పంపిన ఫ‌లితం లేక‌పోవ‌డంతో ఇలా చేయాల్సి వ‌చ్చిందని అధికారులు అంటున్నారు.

చిరుపై అమితాబ్ తెలుగు ట్వీట్.. చూశారా?

Submitted by arun on Thu, 03/29/2018 - 11:22

నట శిఖరం అమితాబ్ బచ్చన్.. హైదరాబాద్ చేరుకున్నారు. చిరంజీవి తాజా సినిమా సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్రలో నటించబోతున్న బిగ్ బీ.. తన పార్ట్ షూటింగ్ కు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా.. అమితాబ్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “సూపర్ స్టార్ చిరంజీవి.. అదే ఫ్రేమ్ లో ఓ గౌరవం ఉండాలి”.. అంటూ చిరుపై తన అభిమానాన్ని చాటుకున్నారు.