mp vijayasai reddy

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 07/19/2018 - 15:44

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని...ఆడ, మగ, నపుంసక కాని మరో జీవి అని వ్యాఖ్యానించారు. ఫోర్త్ జెండర్ అంటే ప్రకృతి కార్యంలో కూడా డ్యుయల్ రోల్ ప్లే చేసే వ్యక్తి అని, చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మార్చుతారని ఎంపీ విమర్శించారు. చంద్రబాబు ఓవైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని మండిపడ్డారు.

బుట్టా రేణుకపై అనర్హత వేటువేయాలి

Submitted by arun on Tue, 07/17/2018 - 17:06

టీడీపీలోకి ఫిరాయించిన ఎంపీ బుట్టా రేణుకను వైసీపీ డిప్యూటీ లీడర్‌గా అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడమేంటని వైసీపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చినా, టీడీపీ-బీజేపీ లాలూచీ ఇంకా కొనసాగుతుందని, కుమ్మక్కు  రాజకీయాలు కొనసాగుతున్నాయనడానికి ఇంతకంటే రుజువేంకావాలన్నారు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బుట్టా రేణుకపై అనర్హత వేటు వేయాలని కోరారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హామీలను అమలు చేయాలని ప్రధాని సమక్షంలోనే విజయసాయిరెడ్డి కోరారు.

టీడీపీ అంటే...తెలుగు దొంగల పార్టీ: విజయసాయిరెడ్డి

Submitted by arun on Wed, 05/23/2018 - 11:19

 టీడీపీపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. టీడీపీ ఎవరిపైన ధర్మపోరాటం చేస్తుందని ప్రశ్నించారు. చంద్రబాబు పోరాటం ప్రజల పైనా? అని నిలదీశారు. టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ...తెలుగు డ్రామాల పార్టీ అని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను మభ్యపెట్టడానికే ధర్మ పోరాటం చేపట్టారని ఆరోపించారు. గతంలో వైసీపీ అడిగితే ఏయూ ఇంజినీరింగ్‌ గ్రౌండ్‌ ఇవ్వలేదని...ఇప్పుడు టీడీపీకి ఎలా ఇచ్చారని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
 

చంద్రబాబును దారుణంగా కించపరిచిన విజయసాయిరెడ్డి..

Submitted by arun on Tue, 03/27/2018 - 15:33

ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరని అన్నారు. నేరస్తులందరికీ లీడర్ చంద్రబాబని, చార్లెస్ శోభరాజ్ ని మించిన వ్యక్తని అన్నారు. కొన్ని అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ కించపరిచారు. మంగళవారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి.. ‘ఒక తల్లీ, తండ్రికి పుట్టినవాడెవడూ చంద్రబాబులా మాట్లాడరు...’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లందరికీ లీడర్‌ చంద్రబాబు అని, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. అలాగే ఆర్థిక నేరగాడు విజయ్‌మాల్యాతో నన్ను పోల్చుతారా?