d srinivas

నేను కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదు : డీఎస్‌

Submitted by arun on Sat, 10/27/2018 - 12:33

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తో బేటీపై స్పందించారు రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్. తాను కాంగ్రెస్‌ పార్టీలో చేరలేదని చెప్పారు. పలువురు నాయకులను సహజంగానే కలుస్తుంటానని అందులో భాగంగానే రాహుల్‌ గాంధీని కలిశానని డి.శ్రీనివాస్‌ తెలిపారు. మరోవైపు టీఆర్ఎస్‌ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్సీ రాములునాయక్, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఉదయం రాహుల్ గాంధీని కలిసిన ఇరువురు నేతలు ఆయన సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇద్దరు టీఆర్ఎస్ నేతల చేరికతో తెలంగాణలో కాంగ్రెస్ బలం మరింత పెరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అన్నారు.

సొంత గూటికి డీఎస్...ఈనెల 11న...

Submitted by arun on Wed, 09/05/2018 - 11:24

బహిరంగ లేఖతో  టీఆర్ఎస్ అధిష్టానానికి సవాల్ విసిరిన రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో  మంతనాలు జరుపుతున్నట్టు ఊహగానాలు వినిపిస్తున్నాయి.  ప్రస్తుతం మానససరోవర్ యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ ..  ఈ నెల 11న తిరిగి రానున్నారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు సమాచారం.  ఇదే సమయంలో టీఆర్ఎస్‌లో తనకు అవమానం జరిగిందని భావిస్తున్న డీఎస్ ... తెలంగాణ అసెంబ్లీ రద్దు చేసిన తరువాత ప్రెస్‌ మీట్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.  డీఎస్‌ రాకను సీనియర్లతో పాటు జిల్లా నేతలు కూడా స్వాగతిస్తున్నట్టు సమాచారం. 
 

డీఎస్‌పై నిప్పులు చెరిగిన బాజిరెడ్డి...డీఎస్‌ సిగ్గు లేకుండా...

Submitted by arun on Tue, 09/04/2018 - 14:02

రాజ్యసభ సభ్యుడు డీ శ్రీనివాస్‌పై  ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్ర స్ధాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ కాంగ్రెస్ నాయకులతో బేరసారాలు జరిపారంటూ ఆరోపించారు. పార్టీకి డీఎస్ చీడపురుగుగా మారడం వల్లే జిల్లా నేతలంతా బహిష్కరించాలంటూ డిమాండ్ చేశామన్నారు. రాజ్యసభ సభ్యత్వాన్ని కాపాడుకునేందుకే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుతున్నారంటూ విమర్శించారు. 

కేసీఆర్ కు డీఎస్ ఘాటు లేఖ

Submitted by arun on Tue, 09/04/2018 - 13:18

టీఆర్ఎస్ ఎంపీ డీ శ్రీనివాస్‌...పార్టీ అధిష్ఠానికి బహిరంగ లేఖ రాశారు. తాను పార్టీలో ఉండటం ఇష్టం లేకపోతే....పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు. తాను పార్టీని వదిలితే...కవిత చేసిన ఆరోపణలు నిజమవుతాయని చెప్పారు. తనంతట తానుగా పార్టీకి రాజీనామా చేయనని....దయచేసి సస్పెండ్ చేయాలని లేఖలో పేర్కొన్నారు.

టీఆర్‌ఎస్‌కు గుడ్‌ బై చెప్పనున్న డీఎస్

Submitted by arun on Tue, 09/04/2018 - 09:13

రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ కారు దిగడం ఖాయమైపోయింది. అధికార పార్టీకి గుడ్‌బై చేప్పేయనున్నారు. నిజామాబాద్‌లో తన ప్రధాన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో ప్రత్యేక సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెలుసుకున్న డీఎస్ ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీని వీడాలంటూ మెజార్టీ కార్యకర్తలు చెప్పడంతో వారి అభీష్టం మేరకు నడుచుకుంటానని డీఎస్ ప్రకటించారు. మరి డీఎస్ కారు దిగితే  నెక్ట్స్ హస్తం గూటికి చేరతారా..? కమలం దళంలో చేరతారా..? 

జిల్లా కాంగ్రెస్ లో డీఎస్ గుబులు ...డీఎస్ కోసం ఆ ఇద్దరు నేతలు ఒక్కటయ్యారు

Submitted by arun on Thu, 07/19/2018 - 13:58

ఓడలు బళ్లవుతాయి బళ్లు ఓడలవుతాయి రాజకీయాల్లో పరిచయం అక్కర లేని ఆ కాంగ్రెస్ నేత ఇప్పుడు ఏ పార్టీలో ఉండాలో తెలీక అయోమయంలో ఉన్నారు. పిలిచి కండువా కప్పిన పార్టీ పొమ్మనలేక పొగపెడుతోంది. వెనక్కు పోదామంటే పాత పార్టీ నేతలు  అడ్డుపుల్ల లేస్తున్నారు రెండు పార్టీల్లోనూ వ్యతిరేకత మూటకట్టుకున్న ఆ నేతపై కమలం కన్నేస్తుందా? ఇందూరు రాజకీయాలు ఎటు తిరుగుతాయి?

రెడీ 1..2..

Submitted by arun on Fri, 06/29/2018 - 12:35

నిన్న కూడా టీఆర్ఎప్ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్‌కు సీఎం కేసీఆర్ దర్శన భాగ్యం కలగలేదు. దీంతో కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. ఇదే అదనుగా డీఎస్‌ను హస్తం గూటికి చేర్చే యత్నాలు ఆరంభించింది. పరిస్థితి చూస్తుంటే డీఎస్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

నిజామాబాద్ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరుగుతోందా ?

Submitted by arun on Thu, 06/28/2018 - 11:53

నిజామాబాద్ రాజకీయాల్లో ఆధిపత్య పోరు తారా స్ధాయికి చేరిందా ? కారు పార్టీ కోరి తెచ్చుకున్న  సీనియర్ నేత డీఎస్‌కు పొమ్మనలేక పొగబెడుతోందా ?  అధిష్టానంపై అసంతృప్తితోనే డీఎస్ సొంత గూటికి చేరుకోవాలని భావిస్తున్నారా ? నిజామాబాద్ ఎంపీ సీటు కోసమే ఇదంతా జరుగుతోందా ? ఇందురులో హాట్‌హాట్‌గా సాగుతున్న పాలిటిక్స్‌లో డీఎస్‌ నెక్ట్స్‌ స్టెప్ ఏంటి ?       

కేసీఆర్ కోర్టులో డీఎస్ కేస్...కేసీఆర్‌ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి

Submitted by arun on Thu, 06/28/2018 - 10:38

టీఆర్ఎస్ ఎంపీ డీఎస్ వ్యవహారం సీఎం కేసీఆర్ కోర్టుకి చేరింది. డీఎస్‌ ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రిని కలవబోతున్నారు. తనపై వచ్చిన ఆరోపణలు, నిజామాబాద్ జిల్లా నేతలు చేసిన విమర్శలకు వివరణ ఇస్తారు. డీఎస్‌ వివరణ తర్వాత కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం  తీసుకుంటారనేది చర్చనీయాంశంగా మారింది. రాజ్యసభ సభ్యుడు డీఎస్‌పై నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఫిర్యాదు చేయడంతో ఒక్కసారిగా రాజకీయ వాతావరణం హీటెక్కింది. డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారన్నారనీ ఆయనపై చర్యలు తీసుకోవాలనీ కోరడంతో ఇప్పుడు అందరి దృష్టీ కేసీఆర్ వైపు మళ్ళింది.

ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుంది

Submitted by arun on Wed, 06/27/2018 - 14:18

నిజామాబాద్ ఎంపీ కవితకు ఓటమి భయం పట్టుకుందని.. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు.. డీఎస్ కుమారుడు ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. డీఎస్‌పై కవిత చేసిన ఆరోపణలు.. ఆమె రాజకీయ అపరిపక్వతను సూచిస్తోందని.. అన్నారు. ఆరోపణలు వింటేనే నవ్వొస్తొందని.. కుమారుడిపై కోపంతో.. తండ్రి పై చర్యలు తీసుకోవం హాస్యాస్పదం అన్నారు.  ‘టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత గత నాలుగేళ్లుగా జిల్లాలో కనబడటం లేదు. మా కుటుంబం జిల్లాలో యాక్టీవ్‌గా పనిచేయడం మొదలుపెట్టిన తర్వాతే కవిత వెలుగులోకి వచ్చారు. నాలుగేళ్లలో ప్రజలకు పనికొచ్చే ఒక్క పని కూడా ఆమె చేయలేదు.