Steve Smith

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఊహించని నిర్ణయం

Submitted by lakshman on Wed, 04/04/2018 - 21:27

బాల్ టాంపరింగ్ వివాదంపై ఏడాది పాటు నిషేధం ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. తనపై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) విధించిన నిషేధ నిర్ణయంపై సవాల్ చేయబోనని స్టీవ్ స్మిత్ ప్రకటించాడు. క్రికెట్ ఆస్ట్రేలియా విధించిన నిషేధాన్ని ఎదుర్కొంటానని తెలిపారు. కెప్టెన్‌గా ఈ వివాదంలో పూర్తి బాధ్యత తీసుకుంటానని ఇంతకుముందే చెప్పాను. ఆ మాటకు కట్టుబాడి ఉన్నాను. నేను ఇంకా చెప్పాల్సింది ఏమీ లేదు. నాపై విధించిన ఆంక్షలను సవాల్‌ చేయడం లేదు. గట్టి సందేశం ఇచ్చే ఉద్దేశంతో క్రికెట్‌ ఆస్ట్రేలియా ఈ చర్యలు తీసుకుంది. వాటిని నేను ఆమోదిస్తున్నాను అని ట్వీట్ చేశాడు.

మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ కన్నీరుమున్నీరు

Submitted by arun on Thu, 03/29/2018 - 16:16

క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను సైతం మానసికంగా కృంగదీసింది. కేప్ టౌన్ టెస్టులో చోటు చేసుకొన్న పరిణామాలకు తన నాయకత్వలోపమే కారణమని సిడ్నీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. ఈ తప్పుకు తానే కారణమని, తన కారణంగా తమజట్టు భారీమూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఈ పొరపాటు తనను జీవితకాలం వెంటాడుతూనే ఉంటుందని స్మిత్ విలపిస్తూ చెప్పాడు. ఓ దశలో స్టీవ్ స్మిత్ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు.

స్మిత్‌, వార్నర్‌పై ఏడాది నిషేధం

Submitted by arun on Wed, 03/28/2018 - 14:59

బాల్‌ టాంపరింగ్‌ వివాదంలో చిక్కుకున్న స్మిత్‌, డేవిడ్‌ వార్నర్‌, బాన్‌క్రాఫ్ట్‌పై క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) వేటు వేసింది. ఈ వ్యవహారంలో సీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో వారిపై కఠినచర్యలే తీసుకుంది. స్మిత్‌, వార్నర్‌పై ఏడాది నిషేధం, బాన్‌క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధాన్ని విధించింది. ఇప్పటికే స్మిత్‌, వార్నర్‌లకు ఐపీఎల్‌ రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంచైజీలు  కెప్టెన్సీ బాధ్యతల నుంచి తొలిగిస్తూ షాక్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఆ పాపం.. ఇంకా వెంటాడుతూనే ఉంది!

Submitted by arun on Wed, 03/28/2018 - 12:55

చేసిన పాపం వెంటాడక మానదంటారు. జీవితం ఎంత బాగున్నా కూడా.. ఆ పాపపు ఫలితాన్ని అనుభవించక తప్పదని కూడా పెద్దలు చెబుతుంటారు. ఈ విషయం.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ట్రెవర్ చాపెల్ విషయంలో అక్షర సత్యం అయ్యింది. బాల్ టాంపరింగ్ వివాదంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు స్మిత్, వార్నర్, క్రాఫ్ట్ లపై వేటు పడిన నేపథ్యంలో.. టాంపరింగ్ ను ప్రపంచానికి పరిచయం చేసిన గ్రెగ్ చాపెల్ సోదరుడు ట్రెవర్ చాపెల్ స్పందించాడు.

బాల్ టాంప‌రింగ్ అంటే ..? టాంప‌రింగ్ లో ముగ్గురు క్రికెట‌ర్లు

Submitted by lakshman on Wed, 03/28/2018 - 11:39

స్టీవ్ స్మిత్ నాయకత్వంలోని ఆస్ట్రేలియా జట్టు ఆసీస్‌ సంస్కృతిని దెబ్బతీసిందని మాజీ కెప్టెన్ స్టీవ్ వా ఆవేదన వ్యక్తం చేశాడు. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.  

వార్నర్, స్మిత్ ఔట్

Submitted by arun on Sun, 03/25/2018 - 17:32

ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్మిత్ భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఉద్దేశపూర్వకంగానే ఈ ఘటనకు పాల్పడినట్టు తెలియడంతో ఆసీస్ ఆటగాళ్లపై  క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. జెంటిల్ మెన్ గేమ్ పరువు ప్రతిష్టలను కాలరాసారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆలస్యంగా మేల్కొన్న ఆస్ట్రేలియా ప్రభుత్వం కఠినమైన చర్యలకు ఉపక్రమించింది. ఈ వివాదంలో ప్రమేయమున్న ఆటగాళ్లపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించింది. 

ట్యాంపరింగ్‌: ‍​కెప్టెన్సీ నుంచి తప్పుకున్న స్మిత్‌

Submitted by arun on Sun, 03/25/2018 - 16:26

బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదంలో ఆసీస్ ఆటగాళ్లపై ఆస్ట్రేలియా ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఉద్దేశపూర్వకంగా ఈ ఘటనకు పాల్పడిన ఆటగాళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ క్రికెట్ ఆస్ట్రేలియాను ఆదేశించింది. దీంతో కెప్టెన్  స్మిత్ తో పాటు వైఎస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ పై వేటు వేస్తున్నట్టు ప్రకటించింది. ఈ వ్యవహారంలో పూర్తి స్దాయి విచారణ జరిపిన తరువాత ఇతర ఆటగాళ్లపై వేటు వేసే అంశాన్ని పరిశీలించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది. ఇక ఐపిఎల్ లో రాజస్దాన్ రాయల్స్ కు నేతృత్వం వహిస్తున్న స్మిత్ ను కెప్టెన్సీ నుంచి తొలగించాలని యాజమాన్యం నిర్ణయించింది.