ball tampering

మీడియా సమావేశంలో స్టీవ్ స్మిత్ కన్నీరుమున్నీరు

Submitted by arun on Thu, 03/29/2018 - 16:16

క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన బాల్ టాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్ ను సైతం మానసికంగా కృంగదీసింది. కేప్ టౌన్ టెస్టులో చోటు చేసుకొన్న పరిణామాలకు తన నాయకత్వలోపమే కారణమని సిడ్నీలో జరిగిన మీడియా సమావేశంలో చెప్పాడు. ఈ తప్పుకు తానే కారణమని, తన కారణంగా తమజట్టు భారీమూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఈ పొరపాటు తనను జీవితకాలం వెంటాడుతూనే ఉంటుందని స్మిత్ విలపిస్తూ చెప్పాడు. ఓ దశలో స్టీవ్ స్మిత్ భావోద్వేగాలను అదుపు చేసుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు.

బాల్ టాంప‌రింగ్ : మాస్ట‌ర్ మైండ్ వైస్ కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ దే

Submitted by lakshman on Wed, 03/28/2018 - 12:52

ఆస్ట్రేలియా క్రికెటర్ల బాల్ టాంప‌రింగ్ వివాదం ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. కేప్‌టౌన్ వేదికగా ఆతిథ్య దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా ఓపెనర్ కామెరూన్ బాన్‌క్రాప్ట్ బాల్ టాంపరింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంగతి తెలిసిందే.  ఇందులో అస‌లు దోషులు ఎవ‌రో తెలుసుకునేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా  బృందంలోని క్రికెట్‌ ఆస్ట్రేలియా హెడ్‌ ఆఫ్‌ ఇంటెగ్రిటీ లైన్‌ రాయ్, హై ఫెర్ఫార్మెన్స్‌ మేనేజర్‌ పాట్‌ హోవార్డ్‌లు  కేప్ టౌన్ వేదిక గా విచార‌ణ చేప‌ట్టారు.   

బాల్ ట్యాంపరింగ్ లో అడ్డంగా బుక్కైన ఆసీస్‌

Submitted by arun on Sun, 03/25/2018 - 11:50

దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మూడో టెస్టులో బాల్‌ ట్యాంపరింగ్‌ వివాదం రాజుకుంది. ఈ వివాదానికి ఆసీస్‌ ఓపెనర్‌ బాన్‌క్రాఫ్ట్‌ కారకుడయ్యాడు. మూడో రోజు ఆటలో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ కొనసాగుతుండగా తన ప్యాంటు జేబులో నుంచి పసుపు రంగు వస్తువుతో బంతిపై రుద్దడం వివాదానికి తెరలేపింది.