Bus Accident

కొండగట్టు బస్సు ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి

Submitted by arun on Tue, 09/11/2018 - 12:38

కొండగట్టులో బస్సు ప్రమాదం విషయం తెలియడంతో సీఎం కేసీఆర్ వెంటనే, జిల్లా అధికారులకు ఫోన్ చేసి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సీఎం ఆదేశాలతో  జిల్లా ఎస్పీ, కలెక్టర్ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పరిశీలిస్తున్నారు.   
 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా

Submitted by arun on Sat, 08/11/2018 - 11:49

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం దగ్గర ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. భద్రాచలం నుంచి విజయవాడ వెళుతుండగా సారపాక వంతెన  సమీపంలో అదుపు తప్పి పక్కనున్న 40 అడుగుల లోతు పొలాల్లోకి వెళ్లి  బోల్తా పడింది. ప్రమాదానికి గురైన బస్సులొ 40 మంది ప్రయాణీకులున్నట్టు గుర్తించారు. రోడ్డుపైనున్న గుంతలను తప్పించే క్రమంలో బస్సు అదుపు తప్పినట్టు డ్రైవర్ తెలియజేశాడు. బస్సు బోల్తా పడిన పక్కనే వాగు భారీగా ప్రవహిస్తూ ఉండటంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే చుట్టుపక్కల వారు గ్రామస్తుల సహకారంతోనే ప్రయాణీకులను పైకి తెచ్చారు.

తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం

Submitted by arun on Sun, 03/25/2018 - 11:24

చిత్తూరు జిల్లా పేరూరు మండలం పాతకాల్వ వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తమిళనాడు సేలం నుంచి తిరుపతి వస్తున్న తమిళనాడు ఆర్టీసీ బస్సు రేణిగుంట చంద్రగిరి మార్గంలో అదుపుతప్పి  20 అడుగుల లోతు గొయ్యిలో పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరు మృతిచెందారు. మరో పదిమందికి గాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం తిరుపతి ఆస్పత్రికి తరలించారు. బస్సును క్రేన్ సహాయంతో పైకి తీసేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్లో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.