cm ramesh

బ్రేకింగ్‌: సీఎం రమేశ్ ఇంట్లో ఐటీ సోదాలు

Submitted by arun on Fri, 10/12/2018 - 09:38

ఏపీలో మరోసారి ఐటీ దాడుల కలకలం రేగింది.  సీఎం చంద్రబాబు కోటరిలోని అత్యంత కీలకమైన వ్యక్తిగా ఉన్న సీఎం రమేష్‌పై ఐటీ దాడులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లోని ఆయన సంస్ధలు, నివాసంతో పాటు సొంత గ్రామం కడప జిల్లా పోట్లదుర్తిలో ప్రత్యేక బృందాలు సోదాలు చేపట్టాయి. తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో కడప జిల్లాకు చేరుకున్న  ఐటీ అధికారులు నేరుగా సీఎం రమేష్ నివాసానికి చేరుకుని .. తనిఖీలు చేపట్టారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని సీఎం రమేష్ నివాసం, రిత్విక్ ప్రాజెక్టు ప్రయివేటు లిమిటెడ్ కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు . ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. 

టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు...సీఎం రమేశ్‌ వైసీపీతో టచ్‌లో ఉన్నారని...

Submitted by arun on Tue, 07/31/2018 - 10:36

కడప జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు రచ్చకెక్కడంతో పార్టీ అధ్యక్షుడికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయ్. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నేతలకు సర్ది చెబుతున్నా లెక్కలోకి తీసుకోవడం లేదు. నేతల మధ్య విభేదాలతో పార్టీ పరువు బజారున పడుతోంది. 

సీఎం రమేష్ ఉక్కు దీక్షలో జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Fri, 06/22/2018 - 15:39

కడప సీఎం రమేష్ ఉక్కు దీక్షలో.. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి దీక్షల వల్ల.. స్టీల్ ప్లాంటు రాను గాక రాదని కుండబద్దలు కొట్టారు. సీఎం రమేష్.. దీక్ష చేసినంత మాత్రాన ఉక్కు రాదు.. తుక్కు రాదు అన్నారు. ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో ఉండటం ఏపీ ప్రజల ఖర్మ అని చెప్పారు జేసీ దివాకర్ రెడ్డి.

సీఎం రమేష్‌పై ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Sat, 06/09/2018 - 17:09

రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్‌పై.. ప్రొద్దుటూరు టీడీపీ ఇంచార్జ్ వరదరాజులు రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ స్థాయి పంచాయితీకి ఎక్కువ.. మండలానికి తక్కువ అన్నారు. ఎన్నికల్లో గెలిచే సీన్ లేని సీఎం రమేష్‌కు.. గ్రూపు రాజకీయాలు అవసరమా అని ప్రశ్నించారు. జిల్లాలో టీడీపీ గెలిచే స్థానాలను కూడా.. సీఎం రమేష్ ఓడిపోయేలా చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దయవల్లే సీఎం రమేష్ ఎంపీ అయ్యారని చెప్పారు వరదరాజులు. వైసీపీ అధినేత జగన్‌తో సీఎం రమేష్ టచ్‌లో ఉన్నారని మరో బాంబ్ పేల్చారు.

అంబేద్కర్ జయంతిని వర్ధంతిగా మార్చేసిన : సి.ఎమ్. రమేష్

Submitted by arun on Sat, 04/14/2018 - 17:51

ఆయనో ఎంపీ.. పైగా పెద్దల సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు. కానీ ఆయనకు వర్ధంతికి, జయంతికి బొత్తిగా తేడా తెలియదు. అంబేద్కర్ జయంతి సందర్భంగా కడప నగరంలో రాజ్యాంగ నిర్మాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రాజ్యసభ సభ్యుడు సి.ఎమ్. రమేష్ అంబేద్కర్ జయంతిని కాస్తా వర్ధంతిగా మార్చేశారు.

విజయసాయికి సీఎం రమేష్‌ సవాల్

Submitted by arun on Tue, 03/27/2018 - 17:18

సీఎం చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నేరగాళ్లందరికీ చంద్రబాబు లీడర్‌ అని, చార్లెస్‌ శోభరాజ్‌ను మించిన గజదొంగ చంద్రబాబు అని ఆరోపించారు. ఆర్థిక నేరగాడు విజయ్‌ మాల్యాతో తనను పోల్చడాన్ని తప్పుబట్టిన విజయసాయి తాను ఇప్పటి వరకు ఏ ఒక్క బ్యాంకు నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అన్నారు. అయితే, విజయసాయి కామెంట్స్‌పై స్పందించిన టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ అదే స్థాయిలో కౌంటర్‌ ఇచ్చారు. విజయసాయి పార్లమెంట్‌లో మోడీ కాళ్లపై పడతారని, బయటకు వచ్చి సీఎం చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తారని ఆరోపించారు.

అరుణ్ జైట్లీ - సుజ‌నా చౌద‌రి భేటీలో నిజం లేదంట‌

Submitted by lakshman on Sat, 03/24/2018 - 16:13

కేంద్ర  ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్టీని ఏపీ ఎంపీ సుజ‌నా చౌద‌రి క‌ల‌వ‌లేదంటూ సీఎం ర‌మేష్ వివ‌రణిచ్చారు. జైట్లీ - సుజ‌నా క‌లిశార‌ని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని అన్నారు. 
దిగ‌జారుడు రాజ‌కీయానికి టీడీపీ ప్ర‌య‌త్నిస్తుందంటూ ప‌లువురు మండిప‌డుతున్నారు. ఓ వైపు ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటూ ఏపీలో ఒక‌లా, పార్ల‌మెంట్ లో ఒక‌లా వ్య‌వ‌హ‌రిస్తుంద‌నే ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఆ ఆరోప‌ణ‌లు నిజ‌మ‌నిపించేలా టీడీపీ - బీజేపీతో లాలూచి ప‌డిన‌ట్లు స‌మాచారం.