Sri Reddy

ఒకవేళ నేను చనిపోతే పోరాటంలో చనిపోయానని అనుకుంటే చాలు: పవన్‌

Submitted by arun on Fri, 04/20/2018 - 11:12

రాంగోపాల్ వర్మ, శ్రీరెడ్డి వివాదంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్పందించారు. తన తల్లిని తిట్టడంపై ట్విట్టర్‌లో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పేర్లు రాయకుండా శ్రీరెడ్డి గురించి, రాంగోపాల్ వర్మ గురించి పవన్ విమర్శలు గుప్పించారు. ఏ కొడుకు వినకూడని తప్పుడు పదంతో నా తల్లిని తిట్టించారని పవన్ అన్నారు. నా తల్లి ఓ దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన మహిళ అన్న పవన్‌ కల్యాణ్‌...మా అమ్మకు భర్త, పిల్లలు తప్ప ఇంకో ప్రపంచం తెలియదని చెప్పారు. ఎవరికి ఉపకారం తప్ప... అపకారం చేయని మనస్తత్వం ఆమెదని కొనియాడారు. అలాంటి మంచి వ్యక్తిని అందరూ కలిసి నడిరోడ్డులో తిట్టించడం బాధాకరమని పవన్‌ వ్యాఖ్యానించారు.

దగ్గుబాటి ఫ్యామిలీని సంప్రదించకుండానే ఆఫర్‌ ఎలా ఇచ్చాడు?

Submitted by arun on Thu, 04/19/2018 - 16:49

పూటకో పురాణం చెబుతూ టాలీవుడ్‌ను కుదిపేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం ఊహించని మలుపు తిరిగింది. ఏదో రకంగా ఇండస్ట్రీని కెలుకుతూ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో తెరపైకి ఎక్కే దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ... తెరచాటున చాలా వ్యవహారమే చేసినట్టు లీకైన ఆడియో టేప్‌ కలకలం సృష్టిస్తోంది. ఇంతకీ వివాదం ఎక్కడ మొదలైంది? ఎందుకు మొదలైంది? వర్మ పవన్‌కల్యాణ్‌నే ఎందుకు టార్గెట్ చేసుకున్నాడు? వర్మ చేస్తున్నదంతా వసూళ్ల కోసమేనా? 

టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న శ్రీరెడ్డి వ్యవహారం...వర్మ ఎంట్రీతో డబుల్ అయిన రచ్చ

Submitted by arun on Thu, 04/19/2018 - 16:26

శ్రీరెడ్డికి టాలీవుడ్‌కు మధ్య జరుగుతున్న పోరులో ఇప్పుడు రాంగోపాల్ వర్మ ఎంటరయ్యారు. ఆర్జీవీ రాకతో ఇండస్ట్రీలో ఒక్కసారిగా భూకంపం వచ్చినంత పనైంది. ఈ ఇష్యూలో వర్మ ఎందుకు వేలు పెట్టారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారింది. శ్రీరెడ్డి నిరసనతో మొదలైన చర్చ ఇప్పుడు వర్మ జోక్యంతో పెద్ద రచ్చకే తెరలేపింది.

శ్రీరెడ్డిపై కేసు పెట్టిన శివబాలాజీ

Submitted by arun on Thu, 04/19/2018 - 15:16

శ్రీరెడ్డిపై రాయదుర్గం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. నటుడు శివబాలాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. గత ఆదివారం తాను న్యూస్ ఛానెల్  చూస్తున్న సమయంలో శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్‌ను తీవ్రంగా దూషించిందని.. పవర్ స్టార్ ఫ్యాన్ అయిన తనను ఆ విషయం తీవ్రంగా కలిచివేసిందంటూ.. శివబాలాజీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది పవన్ కల్యాణ్  ఇమేజ్‌ను డ్యామేజ్‌ చేసే ఉద్దేశ్యంతోటే శ్రీరెడ్డి అలా మాట్లాడిదంటూ శివబాలాజీ తన ఫిర్యాదులో ఆరోపించారు. 

డైరెక్టరా.. బ్రోకరా..శ్రీ ఎపిసోడ్‌లో వర్మ ప్లానేంటి?

Submitted by arun on Thu, 04/19/2018 - 13:41

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త పాత్ర ఎంటరవుతుంటే లేటెస్ట్‌గా పొలిటికల్‌ డ్రామా కూడా జతకలిసింది. ఇప్పుడు తాజాగా ఓ బ్రోకర్‌ కూడా వచ్చిచేరాడు. అతనెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. 

శ్రీరెడ్డికి రాంగోపాల్ వర్మ రూ.5 కోట్ల ఆఫర్ ఎందుకు ఇచ్చారు..?

Submitted by arun on Thu, 04/19/2018 - 10:09

HMTV దగ్గరున్న శ్రీరెడ్డి ఆడియో టేప్ గురించి డైరెక్టర్ వర్మ ఏమంటున్నారు...? అసలు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని శ్రీరెడ్డికి వర్మ ఎందుకు సలహా ఇచ్చారు..? ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదంలో డీల్ సెటిల్ చేయడానికి ఆర్జీవీ ప్రయత్నించాడా..? రాంగోపాల్ వర్మ వెర్షన్ ఏంటి..?  

శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ వ్యవహారంలో కొత్త ట్విస్ట్..

Submitted by arun on Thu, 04/19/2018 - 10:03

శ్రీరెడ్డి.. పవన్ కల్యాణ్‌ను తీవ్ర పదజాలంలో తిట్టడానికి కారణమేంటి..? శ్రీరెడ్డి చేత పవన్‌ని అలా అనడానికి కారణమెవరు..? రాంగోపాల్ వర్మే శ్రీరెడ్డి చేత అలా మాట్లాడించారా..?  శ్రీరెడ్డి, పవన్ కల్యాణ్ వ్యవహారంలో అసలు నిజాలేంటి..?

జీవితారాజ‌శేఖ‌ర్.. రెడీగా ఉండు: శ్రీరెడ్డి సంచ‌ల‌న పోస్టింగ్‌

Submitted by arun on Wed, 04/18/2018 - 15:44

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు, విమర్శలుఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డి..‘ఈ జీవితం ఇక చాలు! ఫస్ట్‌టైమ్‌ ఒంటరినయ్యాను.. అందరికీ ధన్యవాదాలు’ అంటూ వైరాగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మొబైల్‌ స్విచాఫ్‌ చేయడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. అయితే, కొద్ది గంటల తర్వాత తిరిగి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యారామె. తనపై వస్తున్న అన్ని విమర్శలకు బదులిస్తానని అన్నారు. `ఈ జీవితానికి ఇక చాలు` అంటూ కొద్దిసేపు క్రితం త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టింగ్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మ‌రో సంచ‌లన పోస్టింగ్ చేసింది. త‌న పోరాటం ఆపేది లేద‌ని, ఇక‌పై లీగ‌ల్‌గా పోరాటం చేస్తాన‌ని వెల్ల‌డించారు.

శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టింది: నాగబాబు

Submitted by arun on Wed, 04/18/2018 - 12:03

సినీనటి శ్రీరెడ్డి పోరాట విషయం పక్కదారి పట్టిందని సినీనటుడు నాగబాబు అన్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొద్ది రోజులుగా శ్రీరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టిందని ఆయన అన్నారు. పేమెంట్స్‌, ఇతర విషయాల్లో సమస్యలు వస్తే పరిష్కరిస్తుందే తప్ప... సినిమాల్లో అందరికీ 'మా' అవకాశాలు ఇప్పించలేదని వివరించారు. 'మా' సభ్యత్వం కావాలంటే రూ. లక్ష చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. సీనియర్‌ నటులకు మాత్రమే గౌరవ సభ్యత్వం ఇస్తామని చెప్పుకొచ్చారు.

పవన్ ను విమర్శించిన శ్రీరెడ్డికి... మెగా హీరో ఘాటు సమాధానం

Submitted by arun on Tue, 04/17/2018 - 17:43

టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ కోసం పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి పవన్ కల్యాణ్ పై చేసిన వ్యాఖ్యలకు మెగా హీరో వరుణ్ తేజ్ స్పందించాడు. సోమవారం శ్రీ రెడ్డి ‘‘పవన్ కల్యాణ్.. నువ్వు ముగ్గుర్ని పెళ్లి చేసుకున్నావ్ అసలు అమ్మాయి జాతిమీద విలువుందా?. నువ్వు ప్రజా నాయకుడివి అయ్యుండి ఏం మాట్లాడుతున్నావ్. పోలీస్ స్టేషన్లకు వెళ్లాలి ఇదేనా నువ్ నాకిచ్చే సలహా. ‘పవన్ కల్యాణ్ అన్నా’ అన్నాం కదా అందుకు నా చెప్పు తీసుకుని నేను కొట్టుకుంటున్నాను. పవన్‌ను ఎవరూ.. ఏ అమ్మాయి కూడా అన్నా అని పిలవదు. అన్నా అన్నందుకు ఒక అమ్మాయిగా నన్ను నేను అవమానించుకున్నాను.