Sri Reddy

శ్రీరెడ్డి ఇష్యూపై నాని భార్య స్పంద‌న‌!

Submitted by arun on Tue, 06/12/2018 - 13:20

సోషల్ మీడియా సాక్షింగా నేచురల్ స్టార్ నాని, నటి శ్రీరెడ్డికి పెద్ద వార్ నడుస్తుంది. తాజాగా బిగ్ బాస్ 2 హోస్ట్ గా వ్యవహరిస్తున్న నానిని టార్గెట్ చేస్తూ చేసిన వాఖ్యలకు నాని స్పందించి ఆమెకు లీగ‌ల్ నోటీసులు పంపించాడు.`స‌హ‌నానికి కూడా ఓ హ‌ద్దు ఉంటుంద`ని కామెంట్ చేస్తూ శ్రీరెడ్డిక పంపిన‌ లీగ‌ల్ నోటీసును త‌న ట్విట‌ర్ ఖాతాలో నాని పోస్ట్ చేశాడు. దానికి శ్రీరెడ్డి స్పందించి మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ దారుణంగా ట్విట్ చేసింది.  

ఫ్యాన్స్‌కి షాకిచ్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 06/09/2018 - 16:09

తన అభిమానులకు షాకిచ్చింది నటి శ్రీరెడ్డి. తెలుగు బిగ్‌బాస్ రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే బిగ్‌బాస్-2లో శ్రీరెడ్డి కూడా కంటిస్టెంట్‌గా ఎంపికైనట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. నాని వ్యాఖ్యాతగా జూన్ పదో తేదీ నుంచి ఈ షో ప్రారంభం కానుంది. 16మంది సెలబ్రిటీలు 100 రోజుల పాటు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటారు. ఈ నేపథ్యంలో క్యాస్టింగ్ కౌచ్‌పై గళం విప్పి.. ఇటీవలి కాలంలో సంచలన ప్రకటనలు చేస్తూ వార్తల్లో నిలిచిన సినీ నటి శ్రీరెడ్డి కూడా ఈ షోలో పాల్గొననున్నట్టుగా వార్తలొచ్చాయి. 

నాని కాపురంలో నిప్పులే!

Submitted by arun on Fri, 06/08/2018 - 13:11

కాస్టింగ్ కౌచ్ మొదలుకొని పవన్ కళ్యాణ్ వరకు పలు వివాదాలతో హాట్ టాపిక్ అవుతున్న శ్రీరెడ్డి... తరచూ నాని ప్రస్తావన తెస్తూ సంచలన పోస్టులు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నానిపై శ్రీరెడ్డి చేసిన మరో పోస్టు హాట్ టాపిక్ అయింది.

నానిని మరోసారి టార్గెట్ చేసిన శ్రీరెడ్డి..ఈసారి..

Submitted by arun on Wed, 06/06/2018 - 13:27

తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బిగ్ బాస్ రియాల్టీ షో సీజన్2కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. తొలి సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, ఈ సీజన్ లో నేచురల్ స్టార్ నాని అలరించబోతున్నాడు. ఇప్పటికే ఈ సీజన్ లో పార్టిసిపేట్ చేయబోయే వారి పేర్లు కొన్ని బయటకు వచ్చాయి.

నారా లోకేశ్‌పై శ్రీరెడ్డి కామెంట్స్‌‌

Submitted by arun on Tue, 06/05/2018 - 13:00

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి తనయుడు, కేబినెట్‌ మంత్రి నారా లోకేశ్‌ను ఉద్దేశించి సంచలన నటి శ్రీరెడ్డి వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో కాస్టింగ్‌ కౌచ్‌పై పోరాటాన్ని కొనసాగిస్తానంటోన్న ఆమె.. సీఎం తనయుడితోపాటు మెగా ఫ్యామిలీపైనా కామెంట్లు గుప్పించారు. ‘‘నారా లోకేశ్‌ గారిని ఎవరైనా ఏమైనా అంటే ఊరుకునేవాళ్లు ఎవరూ లేరు. కొత్త పార్టీ ఏం చేస్తుందో అది చెప్పుకోండి. అంతేగానీ లోకేశ్‌ను విమర్శిస్తే ఒప్పుకునేది లేదు. నా నోటికి పని చెప్పొద్దు..’’ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.

మెగా ఫ్యామిలీలో ఒకరు నాకు బాగా క్లోజ్‌: శ్రీరెడ్డి

Submitted by arun on Sat, 06/02/2018 - 14:36

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో శ్రీరెడ్డి సంచలనాలు రేపుతుంది. టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ పేరుతొ అమాయకమైన ఆడపిల్లల జీవితాలను బలిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. శ్రీరెడ్డి సోషల్ మీడియా వేదికగా తన సంచలన వ్యాఖ్యలు కొనసాగిస్తోంది. కాస్టింగ్‌ కౌచ్‌ పేరిట తెలుగు చిత్రసీమలో మహిళలను లైంగికంగా దోపిడి చేస్తున్నారంటూ గళమెత్తి నటి శ్రీరెడ్డి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరలేపింది. మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజని, తనకు ప్రజారాజ్యం పార్టీ అవకతవకలన్నీ తెలుసన్నట్లు తన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టింది. ‘మెగా ఫ్యామిలీలో ఒకతను నాకు బాగా క్లోజ్‌..

బిగ్‌బాస్‌ 2 లో శ్రీరెడ్డి!?

Submitted by arun on Thu, 05/31/2018 - 14:42

తెలుగు టెలివిజన్ చరిత్రలో బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ సీజన్ 2 ప్రసారానికి ముహూర్తం ఖరారైంది. గత ఏడాది ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 కార్యక్రమంలో.. ‘ఎందరో మహానుభావులు అందరికీ మీ ఎన్టీఆర్ పాదాభివందనాలు’ అంటూ బుల్లితెరపై ఎన్టీఆర్ ‘బిగ్ బాస్ సీజన్ 1’తో అదరగొట్టేశాడు. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని బిగ్ బాస్ సీజన్ 2‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. 'జూన్ 10..100 రోజులు.. 16 మంది సెలబ్రిటీలు అంటూ ఈసారి ఇంకాస్త మసాలా అంటూ విజిలేస్తూ సూపర్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చే నెల జూన్ 10 నుండి స్టార్ మా ఛానల్‌లో ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు..

హైపర్‌ ఆది.. నీ తాట తీస్తా

Submitted by arun on Mon, 05/28/2018 - 13:45

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అతి తక్కువ కాలంలోనే సూపర్ పాపులర్ అయిన కమెడియన్ హైపర్ ఆది. తన షోలలో ఆది వేసే పంచ్‌లు, సెటైర్లు ఓ రేంజిలో పేలుతుంటాయి. ముఖ్యంగా మహిళలను ఉద్దేశించి ఎక్కువగా పంచ్‌లు విసురుతుంటాడు. ఈ క్రమంలోనే ఆది ఇటీవల తన షోలో టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ సంచలనం శ్రీరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కొన్ని పంచ్‌లు విసిరారు. దీనిపై శ్రీరెడ్డి తీవ్రంగా స్పందించారు. ఆది మీద ఎదురు దాడికి దిగారు. ఘాటైన పదజాలంతో ఆమె ఆదిపై విరుచుకుపపడ్డారు. ఓ క్రమంలో తన కోపాన్ని ఆపుకోలేక నిన్ను బ్రతికనిచ్చేదాన్ని కాదు అంటూ వ్యాఖ్యానించారు.  ఆది వేసిన సెటైర్లపై ఫేస్‌బుక్‌ లైవ్‌లో ఆమె స్పందించారు.

విలన్‌ ఆఫ్‌ మై లైఫ్‌ : శ్రీరెడ్డి

Submitted by arun on Thu, 05/24/2018 - 12:44

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు అభిరామ్ తనకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి వాడుకున్నాడని ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి అతడితో దిగిన ఫోటోలతో సహా బయట పెట్టి ఇండస్ట్రీలో తుఫాను రేపింది. శ్రీరెడ్డి దెబ్బకు ఇండస్ట్రీ మొత్తం కదిలింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అభిరామ్ ఫోటోలు పోస్టు చేసిన శ్రీరెడ్డి సోషల్ మీడియాలో అలజడి రేపింది. విలన్ ఆఫ్ మై లైఫ్.... అంటూ ఆమె మరిన్ని ఫోటోలు లీక్ చేశారు.
 

ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర ఉద్రిక్తత

Submitted by arun on Fri, 04/20/2018 - 13:52

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్‌ పిలుపుతో పెద్దఎత్తున ఫిల్మ్‌ ఛాంబర్‌‌కి చేరుకున్న జనసేన కార్యకర్తలు, మెగా పవన్‌‌ అభిమానులు ఆందోళనకు దిగారు. పవన్‌‌కి మద్దతుగా ఫిల్మ్‌ ఛాంబర్‌‌ను ముట్టడించిన ఫ్యాన్స్‌‌ వర్మకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పవన్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటున్న అభిమానులు వర్మకి తగిన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.