Casting Couch

క్యాస్టింగ్‌ కౌచ్‌పై రేణుక సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Tue, 04/24/2018 - 16:40

గత కొంతకాలంగా టాలీవుడ్‌ను కుదిపేస్తోన్న క్యాస్టింగ్‌ కౌచ్‌ వివాదంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తనదైన శైలిలో స్పందించారు. క్యాస్టింగ్‌ కౌచ్‌ ఒక్క సినీ పరిశ్రమకే పరిమితం కాలేదని ప్రతిచోటా ఉందన్నారు. బాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన  రేణుకా చౌదరి చట్టసభల నుంచి అన్ని ప్రాంతాల్లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉందన్నారు. అత్యాచారాల విషయంలో ప్రభుత్వాలు కూడా డ్రామాలు ఆడుతున్నాయని వ్యాఖ్యానించారు. చట్టాలు ఎన్ని చేసినా మనుషుల ప్రవర్తనలో మార్పు రావడం లేదు.

డైరెక్టరా.. బ్రోకరా..శ్రీ ఎపిసోడ్‌లో వర్మ ప్లానేంటి?

Submitted by arun on Thu, 04/19/2018 - 13:41

టాలీవుడ్‌లో క్యాస్టింగ్‌ కౌచ్‌ వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. థ్రిల్లర్‌ సీరియల్‌కి ఏమాత్రం తగ్గకుండా కథ ఆసక్తికరంగా నడుస్తోంది. రోజుకో కొత్త పాత్ర ఎంటరవుతుంటే లేటెస్ట్‌గా పొలిటికల్‌ డ్రామా కూడా జతకలిసింది. ఇప్పుడు తాజాగా ఓ బ్రోకర్‌ కూడా వచ్చిచేరాడు. అతనెవరో కాదు ప్రముఖ డైరెక్టర్ రాంగోపాల్‌వర్మ. 

శ్రీరెడ్డికి రాంగోపాల్ వర్మ రూ.5 కోట్ల ఆఫర్ ఎందుకు ఇచ్చారు..?

Submitted by arun on Thu, 04/19/2018 - 10:09

HMTV దగ్గరున్న శ్రీరెడ్డి ఆడియో టేప్ గురించి డైరెక్టర్ వర్మ ఏమంటున్నారు...? అసలు పవన్‌ కల్యాణ్‌ను టార్గెట్ చేయమని శ్రీరెడ్డికి వర్మ ఎందుకు సలహా ఇచ్చారు..? ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కుటుంబంతో శ్రీరెడ్డికి ఉన్న వివాదంలో డీల్ సెటిల్ చేయడానికి ఆర్జీవీ ప్రయత్నించాడా..? రాంగోపాల్ వర్మ వెర్షన్ ఏంటి..?  

జీవితారాజ‌శేఖ‌ర్.. రెడీగా ఉండు: శ్రీరెడ్డి సంచ‌ల‌న పోస్టింగ్‌

Submitted by arun on Wed, 04/18/2018 - 15:44

కాస్టింగ్‌ కౌచ్‌కు వ్యతిరేకంగా గళమెత్తి ఏకకాలంలో ప్రశంసలు, విమర్శలుఎదుర్కొంటున్న నటి శ్రీరెడ్డి..‘ఈ జీవితం ఇక చాలు! ఫస్ట్‌టైమ్‌ ఒంటరినయ్యాను.. అందరికీ ధన్యవాదాలు’ అంటూ వైరాగ్య వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత మొబైల్‌ స్విచాఫ్‌ చేయడంతో ఒక్కసారిగా కలకలంరేగింది. అయితే, కొద్ది గంటల తర్వాత తిరిగి సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమయ్యారామె. తనపై వస్తున్న అన్ని విమర్శలకు బదులిస్తానని అన్నారు. `ఈ జీవితానికి ఇక చాలు` అంటూ కొద్దిసేపు క్రితం త‌న ఫేస్‌బుక్ ఖాతాలో పోస్టింగ్ చేసిన శ్రీరెడ్డి తాజాగా మ‌రో సంచ‌లన పోస్టింగ్ చేసింది. త‌న పోరాటం ఆపేది లేద‌ని, ఇక‌పై లీగ‌ల్‌గా పోరాటం చేస్తాన‌ని వెల్ల‌డించారు.

నా బ్ర‌తుకును బ‌స్టాండ్ చేశారు

Submitted by lakshman on Sun, 04/08/2018 - 23:05

గత కొద్దిరోజులుగా సినీ ఇండస్ట్రీలోని ‘కాస్టింగ్ కౌచ్’... ఘాటుగా సంచలనమైన లీకులు ఇస్తూ సోషల్ మీడియా, టీవీ డిబెట్స్‌‌లలో నానా హంగామా చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా హైదరాబాద్‌లోని ఫిల్మ్‌చాంబర్ దగ్గర హల్ చల్ చేసింది. చాంబర్‌ ఆవరణలో అర్ధనగ్నంగా నిరసన చేసింది.

నేడే చూడండి..రెడ్డిగారి గానా భ‌జానా

Submitted by lakshman on Sat, 04/07/2018 - 12:12

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న న‌టి శ్రీరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలుగు వారిని వాడుకుని వదిలేస్తున్నారని.. ఛాన్సులు ఇవ్వడం లేదంటూ విరుచుకుపడుతోంది. ఇంటర్వ్యూలు, డిబేట్లలో పాల్గొంటూ టాలీవుడ్‌ని హడలెత్తిస్తోంది. 
అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌ లైవ్‌లో కొందర్ని టార్గెట్ చేస్తూ వ‌స్తున్నారు. 

న్యాయం కోసం ఫిలింనగర్‌లో నగ్నంగా నిలబడ‌తా

Submitted by lakshman on Thu, 04/05/2018 - 01:51

దర్శకుడు శేఖర్ కమ్ములతో వివాదం ఓ వైపు కొనసాగుతుండగానే టాలీవుడ్ నటి శ్రీరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. అవకాశాల పేరుతో అమ్మాయిలను మోసం చేస్తున్న సినీ, టెలివిజన్ ప్రముఖుల గుట్టు విప్పింది. తనను శారీరకంగా, మానసికంగా వేధించారంటూ ప్రముఖ టెలివిజన్ ఛానెల్‌ లైవ్‌లో కొందరిపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
  టాలీవుడ్‌లో జరుగుతున్న అన్యాయాలకు సంబంధించిన ఆధారాలు నావద్ద ఉన్నాయి. అందుకే నేను వాటిని లీక్ చేస్తున్నాను. మీడియా సాక్ష్యంగా నేను అన్ని విషయాలు బయటపెడుతా. నా వద్ద కొన్నింటికి ఆధారాలు ఉన్నాయి. కొన్నింటికి ఆధారాలు లేవు.

ప్రముఖ దర్శకుడి పేరు బయటపెట్టి బాంబు పేల్చిన శ్రీరెడ్డి

Submitted by arun on Mon, 04/02/2018 - 12:57

టాలీవుడ్ లో హీరోయిన్లకు ఎదురవుతున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ, సినీ ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరుగెత్తేలా చేస్తోంది హీరోయిన్ శ్రీరెడ్డి. తాజాగా ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ములపై ఆమె తీవ్ర ఆరోపణలు చేసింది. ఫేస్ బుక్ ద్వారా ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి.