YSRCP MLA

టీడీపీలోకి ఫిరాయిస్తే రూ. 40 కోట్లు

Submitted by arun on Wed, 07/04/2018 - 11:36

తాను తెలుగుదేశం పార్టీలో చేరితే రూ. 40 కోట్లు ఇస్తామని ఆశ పెడుతున్నారని చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎమ్మెల్యే, వైకాపా నేత డాక్టర్ ఎం సునీల్ కుమార్ సంచలన విమర్శలు చేశారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని రొంపిచెర్ల మండలం మోటుమల్లెల పంచాయతీ బండమీద చల్లావారిపల్లెలో మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. టీడీపీ వారికి ఎమ్మెల్యేల కొనుగోలుపై ఉన్న శ్రద్ధ రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమంపై లేదని ఆయన దుయ్యబట్టారు.

భార్య గురించి తప్పుడు సమాచారమిచ్చిన వైసీపీ ఎమ్మెల్యే!

Submitted by arun on Wed, 03/21/2018 - 15:56

వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఎన్నికల అఫిడవిట్‌లో భార్య గురించి తప్పుడు సమాచారం ఇచ్చినట్లు దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు.. పిటిషనర్ వాదనతో ఏకీభవించి పూర్తి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది.