Posani Krishna Murali

టీఆర్ఎస్ పార్టీకే నా ఓటు: పోసాని కృష్ణమురళి

Submitted by arun on Sat, 11/03/2018 - 13:43

ప్రత్యేక రాష్ర్టం కలలు సాకారం కావాలంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి ఆకాంక్షించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్.. ఇవాళ ఉదయం పోసాని కృష్ణ మురళి ఇంటికి వెళ్లి మద్దతు కోరారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో తక్కువ వ్యవధిలోనే సీఎం కేసీఆర్ అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. సీఎం కేసీఆర్ ఉత్తమమైన పాలన అందిస్తున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆంధ్రులు చంద్రబాబును నమ్మొద్దన్నారు. బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని వ్యాఖ్యానించారు.

పోసానిని హైదరాబాద్‌లో తిరుగనివ్వం... టీడీపీ అల్టిమేటం

Submitted by arun on Mon, 06/11/2018 - 17:56

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై అర్థంలేని ఆరోపణలు చేస్తూ, మెంటల్ కృష్ణలా మాట్లాడుతున్నారంటూ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై గ్రేటర్ హైదరాబాద్ టీడీపీ అధ్యక్షుడు ఎంఎన్ శ్రీనివాస్ మండిపడ్డారు. పోసానిని హైదరాబాదులో తిరగనివ్వబోమంటూ వార్నింగ్ ఇచ్చారు. బీజేపీ, వైసీపీ ఏజెంట్ లా మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే ఏదైనా పార్టీలో చేరి మాట్లాడాలని ఎంఎన్‌ శ్రీనివాస్‌ చెప్పారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుపై పోసాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రెస్ మీట్ ను అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు హుటాహుటిన వచ్చారు.

చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

Submitted by arun on Mon, 06/11/2018 - 16:37

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై మరోసారి సినీ నటుడు పోసాని కృష్ణమురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి సీఎం అయ్యారన్న పోసాని....  23మంది వైసీపీ ఎమ్మెల్యేలను సిగ్గులేకుండా కొనుగోలు చేశారని మండిపడ్డారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు తెలుగుదేశం జెండా కప్పడం అభివృద్ధిలో భాగమా అంటూ ప్రశ్నించారు. ప్రత్యేకహోదా వద్దన్న చంద్రబాబు ఇప్పుడు ప్రధాని మోదీని విమర్శించటం ఏంటని నిలదీశారు. ప్రతిపక్ష నేత జగన్ అవినీతి వ్యవహారం కోర్టులే చూసుకుంటాయని, చంద్రబాబు తన అవినీతిపై నార్కోఎనాలసిస్ టెస్ట్‌కు సిద్ధమా అంటూ మరోసారి పోసాని ప్రశ్నించారు.

అందుకే పాదయాత్రలో పాల్గొన్నా: పోసాని

Submitted by arun on Sat, 05/26/2018 - 14:59

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అనంతరం పోసాని మాట్లాడుతూ..‘జగన్‌లోని ధృడ సంకల్పం నన్ను ఆకర్షించింది. అందుకే ఆయనకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నాను.  అన్ని వర్గాల సమస్యలు పరిష్కరించే నాయకుడు వైఎస్‌ జగన్‌. ఆయనలో సంకల్పం చూసి ఆశ్చర్యం వేసింది.

వైఎస్ జగన్‌ను కలిసిన పోసాని కృష్ణమురళి

Submitted by arun on Sat, 05/26/2018 - 10:45

ప్రముఖ సినీదర్శకుడు, విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ... ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా  పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జగన్ తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాసేపు ఇరువురి కలిసి మాట్లాడుకున్నారు. అయితే పార్టీలో చేరేందుకే పోసాని జగన్‌ను కలిసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.  

అమ్మాయిల న‌డుముని కొల‌వ‌డంలో లోకేష్ దిట్ట‌

Submitted by lakshman on Thu, 03/22/2018 - 11:29

ఏపీ అధికార పక్షం టీడీపీ పీకల్లోతు కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. హోదా కోసం పోరాడుతున్నామన్న విశ్వాసం కలిగించలేక.. ప్రత్యర్థుల ఆరోపణలను తట్టుకోలేక విలవిల్లాడిపోతోంది. ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో.. టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలు కూడా మొదటికే మోసం తెచ్చేలా మారాయి. మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ తెలుగు సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు.. ఇండస్ట్రీలోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్లాయి. దీంతో చలన చిత్ర ప్రముఖులు సైతం టీడీపీని గట్టిగానే పారేస్తున్నారు.
అప్పుడు లాఠీలతో కొట్టించి..:

బాబుకు పోసాని ఛాలెంజ్!

Submitted by arun on Wed, 03/21/2018 - 12:26

ప్రత్యేక హోదాపై స్పందించకుండా తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఏసీ రూముల్లో కులుకుతున్నారంటూ టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలపై తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సినీ పరిశ్రమను అగౌరవపరిచేలా ఆయన మాట తీరు బాగోలేదని.. వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలంటున్నారు చిత్ర ప్రముఖులు. తెలుగు రాష్ట్రాలకు ఏ సమస్య వచ్చినా చిత్ర పరిశ్రమ సాయానికి ముందు నిలిచిందని.. అలాంటిది కొందరు రాజకీయ నాయకులు పరిశ్రమను టార్గెట్ చేయడం మంచిది కాదన్నారు నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ. ప్రత్యేక హోదాపై ఇప్పటికే కొందరు పోరాడుతున్నారని.. ఇప్పుడు కూడా అందరం కలిసికట్టుగా ముందుకెళ్తామని చెప్పారు.