marraige

నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: రాహుల్ గాంధీ

Submitted by arun on Tue, 08/14/2018 - 12:16

కొద్దిసేపటి క్రితం రాహుల్ గాంధీ.. హోటల్ హరిత ప్లాజాలో మీడియా సంపాదకులతో సమావేశమ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై రాహుల్ ఎడిటర్లతో మాట్లాడారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు. 2019 ఎన్నికల తర్వాత మోడీ చాప్టర్ ముగుస్తుందని వ్యాఖ్యానించిన రాహల్..లోక్‌సభలో తన కౌగిలింత ప్రధానికి నచ్చలేదని అన్నారు. ఇక  జమిలి ఎన్నికలు సమాఖ్య స్పూర్తికి విరుద్ధమన్నారు...కాంగ్రెస్ అధినేత. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు కాంగ్రెస్‌ పార్టీ కట్టుబడి ఉందని రాహుల్ స్పష్టం చేశారు. మీడియాపైనా, జర్నలిస్టులపైనా దాడులు జరుగుతున్నాయన్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఏ రకమైన హిందూత్వను నమ్మనని  అన్నారు.

భర్తకు కూతురితో పెళ్లి చేసిన భార్య

Submitted by arun on Thu, 07/05/2018 - 12:47

వావివరసలు మరిచిన ఓ తండ్రి కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న కూతిరినే పెళ్లాడాడు. అంతేకాకుండా ఆమెను గర్భవతిని కూడా చేశాడు. అయితే తనకు అల్లా ఆదేశించడం వల్లే ఇలా చేశానని ఇందులో తన తప్పేమి లేదని గర్వంగా చెబుతున్నాడు. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లాలో చోటుచేసుకుంది.

రచ్చకెక్కిన ఎంపీ శశికళ పుష్ప రెండో పెళ్లి...

Submitted by arun on Wed, 03/21/2018 - 11:13

వివాదాస్పద ఎంపీ శశికళ పుష్పపెళ్లి వివాదం రచ్చకెక్కింది. ఆమె పెళ్లి చేసుకోనున్న రామస్వామిపై మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ, దినకరన్ వర్గీయురాలు శశికళ పుష్ప రెండో వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రొఫెసర్ రామస్వామిని ఆమె పెళ్లాడబోతున్నారు. ఈనెల 26వ తేదీన వీరి వివాహం ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ జరగబోతోంది. ఈ నేపథ్యంలో రామస్వామిపై అతని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2014లో రామస్వామితో తనకు వివాహం జరిగిందని మీడియాతో మాట్లాడుతూ ఆమె తెలిపింది. పెళ్లి ఫొటోను, తన బిడ్డతో కలసి రామస్వామితో ఉన్న ఫొటోను ఈ సందర్భంగా ఆమె మీడియాకు చూపించింది.