sudigali sudheer

సుడిగాలి సుధీర్ ఆ అమ్మాయిని తల్చుకుంటూ ఏడ్చేశాడు!

Submitted by arun on Tue, 08/14/2018 - 16:16

బుల్లితెరపై యాంకర్ గా సుధీర్ కి మంచి క్రేజ్ వుంది. 'జబర్దస్త్' కార్యక్రమంలో 'సుడిగాలి సుధీర్' గా మంచి మార్కులు కొట్టేసిన సుధీర్, 'ఢీ' డాన్స్ షోలోను యాంకర్ గా సందడి చేస్తూ ఉంటాడు. టీవీ రంగానికి రాక మునుపు .. నటుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించడానికి ముందు సుధీర్ మ్యాజిక్ చేసేవాడు. ప్రొఫెషనల్ మెజీషియన్ గా ఆయన కొంతకాలం పాటు ప్రదర్శనలు ఇచ్చాడు.'జబర్దస్త్' షోతో బుల్లితెరపై అల్లరి చేసే సుడిగాలి సుధీర్ ఇటీవల ఓ టీవీషోలో పాల్గొన్నాడు. ఇందులో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు తన ప్రేమను గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యాడు. స్టేజ్ మీద ఏడ్చేసిన సుధీర్ ని మంచు లక్ష్మీ ఓదార్చే ప్రయత్నం చేసింది.

సుధీర్‌తో పెళ్లిపై స్పందించిన రష్మి

Submitted by arun on Tue, 03/20/2018 - 14:27

ఆన్ స్క్రీన్ పై కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయితే.. వారికి ఆఫ్ స్క్రీన్ లో కూడా లింకులు ఉన్నాయంటూ ప్రచారం జరగడం మామూలే. ఇప్పటివరకూ ఈ ట్రెండ్ సినిమాల్లో మాత్రమే కనిపించేది. దీన్ని కూడా ఇప్పుడు బుల్లితెర మీదకు తెచ్చేశారు ఓ జంట. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్.. పార్టిసిపెంట్ సుధీర్ బాబుల మధ్య ఏదేదో ఉందనే.. ఇంకేదో జరిగిపోతోందని అనే మాదిరిగా చాలానే హింట్స్ కనిపిస్తాయి.