rajamouli

రాజ‌మౌళి చిత్రంలో చ‌రణ్‌, ఎన్టీఆర్ పాత్ర‌లివే..!

Submitted by arun on Fri, 06/01/2018 - 15:14

తెలుగు ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఇప్పటి వరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి.  అయితే జక్కన్న ఎక్కవగా ఎన్టీఆర్ తో చిత్రాలు తీశారు.  దర్శకుడిగా తన కెరీర్ మొదలు పెట్టిందే ఎన్టీఆర్ తో అని  చెప్పొచ్చు. ‘స్టూడెంట్ నెం.1’ ఎన్టీఆర్, రాజమౌళికి మొదటి చిత్రం.  ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చాయి. ఇక రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తన రెండవ చిత్రం ‘మగధీర’మరో అద్భుతమైన విజయం సాధించారు. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ మల్టీ స్టారర్ రూపొందనుంది.  ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

చరణ్, తారక్ పాలిట విలన్ గా రాజశేఖర్?

Submitted by arun on Wed, 03/28/2018 - 14:36

దర్శక ధీరుడు.. జక్కన్న రాజమౌళి తర్వాత సినిమాపై క్లారిటీ వచ్చింది కానీ.. పూర్తి వివరాలు మాత్రం ఒక్కోటిగా బయటికి వస్తూ హైప్ పెంచేస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అన్నాదమ్ములుగా నటిస్తున్నారని.. బాక్సింగ్ ప్లేయర్లుగా కనిపించనున్నారని గుసగుసలు ఇప్పటికే వినిపిస్తుండగా.. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ బయటికొచ్చింది.

న‌లుగురు హీరోల‌తో జ‌క్క‌న్న సినిమా..?

Submitted by lakshman on Sat, 02/03/2018 - 13:03

డైర‌క్ట‌ర్ రాజ‌మౌళి కొత్త సినిమాపై అనేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. బాహుబ‌లి సినిమా విడుద‌లై 10నెల‌లు అవుతున్నా కొత్త సినిమా ఊసెత్త‌లేదు. అయితే రాజ‌మౌళి డైర‌క్ష‌న్ లో డీవీవీ దానయ్య నిర్మాత గా మల్టీస్టారర్ సినిమా తెరెక్కుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అందుకు ఊతం ఇచ్చేలా రాజ‌మౌళి, ఎన్టీఆర్ , రాంచ‌ర‌ణ దిగిన ఫోటో ఒక‌టి నెట్టింట్లో హాట్ గాపిగ్గా మారింది. దీనికి తోడు ఈ మ‌ల్టిస్టార‌ర్ లో ర‌వితేజ విల‌న్ యాక్ట్ చేస్తార‌ని టాక్ . ఇప్పుడు వీటికి తోడుగా అల్లు అర్జున్ కూడా ఇందులో కీలకమైన ఒక క్యామియో చేస్తాడనే టాక్ ఊపందుకుంది. 
 

రాజ‌మౌళికి పోటీగా కొర‌టాల శివ‌

Submitted by arun on Thu, 01/11/2018 - 16:00

కొరటాల శివ కూడా త్రివిక్రమ్ లానే సింగిల్ ఎజెండాతో పనిచేస్తున్నాడు. కొడితే ఏనుగు కుంభస్థలమే కొట్టాలనుకునే ,తను, ఇప్పుడా పనిలోనే ఉన్నాడు రాజమౌలికే పోటీగా తయారయ్యేలా ఉన్నాడు. వందల కోట్ల వసూళ్ల కి కేరాఫ్ అడ్రస్ అయిన, తనకు, ఒకే ఒక మిషన్ తో ముందుకుపోతున్నాడు. కాకపోతే, అదే జరిగే పనేనా అనే అనుమానాలు పెరిగాయ్ ఓ స్థాయి మూవీల వరకు ఓకే కాని, రాజమౌళిలా నెక్ట్స్ లెవల్ కి వెళ్లే సత్తా ఉందా అనే ప్రశ్నలే వస్తున్నాయ్. 

రాజమౌళికి పోటీ ఇవ్వబోయిన త్రివిక్రమ్..అజ్ఞాతవాసి నిరాశపరచడంతో డీలా పడ్డ త్రివిక్రమ్

Submitted by arun on Thu, 01/11/2018 - 15:41

త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటేనే సక్సెస్ మినిమమ్ గ్యారెంటీ. ప్రాసలు, పంచ్ లతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేసే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఇంతవరకు ఫ్లాప్ రాలేదు సక్సెస్ తప్ప మరొకటి తెలియదన్నారు కాని ఇప్పుడు అది అత్యేశా అని తేలింది...అగ్నాతవాసి కి పంచ్ పడటంతో తొలి ఫ్లాప్ ని ఫేస్ చేసినట్టైంది.

బాబు గోగినేనిని బ‌ద్నాం చేస్తున్న రాజ‌మౌళి

Submitted by arun on Thu, 01/04/2018 - 14:31

బాబు గోగినేని అతని పేరు వింటే కొంతమంది మాయగాళ్ళు తడుపుకుంటున్నారు. దొంగ‌స్వామీలు, దొంగ‌డాక్ట‌ర్ల సంగ‌తి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొద్దిరోజుల క్రితం జ్యోతిష్యం పేరుతో అమ‌యాక ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న ఓ పండితుడి బండారం లైవ్ షోలో బ‌ట్ట‌బ‌య‌లు చేశారు. ఇక  ప్రాణ చికిత్స పేరుతో ఫోన్ కాల్ తో రోగం నయం చేస్తాం అన్న వాళ్ళని కూడా లైవ్ లోనే చుక్కలు చూపించిన బాబు గోగినేని ఇప్పుడు డైర‌క్ట‌ర్ జ‌క్క‌న్న తీరును ఎండ‌గ‌డుతున్నారు. తాను నాస్తికుడిని అని చెప్పుకుంటున్న రాజ‌మౌళి ఈజీగా చొక్కాలు మార్చి గుడికి వెళుతుంటారు.

ప‌ద‌హారేళ్ల ప్రాయంలో 'స్టూడెంట్ నెం.1'

Submitted by nanireddy on Wed, 09/27/2017 - 10:34

'బాహుబ‌లి' సిరీస్‌తో తెలుగు సినిమాని అంత‌ర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి. అలాంటి ద‌ర్శ‌క‌మౌళి రూపొందించిన తొలి చిత్రమే 'స్టూడెంట్ నెం.1'. క‌థానాయ‌కుడిగా యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌కి రెండో సినిమా అయిన ఈ 'స్టూడెంట్ నెం.1'.. అత‌నికి తొలి విజ‌యాన్నిచ్చింది. అంతేకాకుండా.. 'అన్న‌మ‌య్య' త‌రువాత స‌రైన హిట్ లేని సంగీత ద‌ర్శ‌కుడు ఎం.ఎం.కీర‌వాణికి మ‌ళ్లీ క్రేజ్‌ని తీసుకువ‌చ్చింది కూడా ఈ సినిమానే.

మ‌హేష్‌, రాజ‌మౌళి సినిమా ఎప్పుడంటే..

Submitted by nanireddy on Sun, 09/24/2017 - 14:10

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌మౌళి రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొంద‌నున్న‌ట్లు గ‌తంలో వార్త‌లు వినిపించాయి. 'బాహుబ‌లి2' త‌రువాత ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని అప్ప‌ట్లో క‌థ‌నాలు కూడా వ‌చ్చాయి. అయితే ఇప్పుడు ఈ వార్త నిజ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. 2018 చివ‌ర‌లో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో చేసే చిత్రం ప్రారంభ‌మ‌వుతుంద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చాడు మ‌హేష్‌.

ఈ ప్రేమ చాలా సంతృప్తినిచ్చింది - ఎన్టీఆర్‌

Submitted by nanireddy on Fri, 09/22/2017 - 21:16

'' 'జై లవ‌కుశ‌'పై చూపిస్తున్న ఈ ప్రేమ చాలా సంతృప్తినిచ్చింది. ఒక న‌టుడిగా ఇంత‌కంటే బెట‌ర్‌గా ఇంకేమీ అడ‌గ‌ను. ప్ర‌తి ఒక్క‌రికి 'జైల‌వ‌కుశ' చిత్ర బృందం నుంచి ధ‌న్య‌వాదాలు'' అంటూ ట్వీట్ చేశారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌. జై, ల‌వ‌కుమార్‌, కుశ అనే మూడు పాత్ర‌ల్లో ఎన్టీఆర్ న‌టించిన తాజా చిత్రం 'జైల‌వ‌కుశ' నిన్న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.

ఎన్టీఆర్‌కి రాజ‌మౌళి ప్ర‌శంస‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 14:02

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభిన‌యం చేసిన తొలి చిత్రం 'జై ల‌వ కుశ‌'. జై, ల‌వ‌కుమార్‌, కుశ అనే మూడు పాత్రల్లో తార‌క్ న‌టించిన ఈ సినిమా ఇవాళ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా చూసిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి.. ఎన్టీఆర్‌ని ప్ర‌శంస‌ల్లో ముంచెత్తారు. 'తార‌క్‌.. నా హృద‌యం చాలా గ‌ర్వంతో ఉప్పొంగుతోంది. మాట‌లు స‌రిపోవ‌డం లేదు. జై జై' అంటూ ట్వీట్ చేశారు.