harrassment

ఆలయ చైర్మన్‌ రాసలీలలు!

Submitted by arun on Wed, 07/25/2018 - 10:58

కరీంనగర్‌ జిల్లా ఇల్లంతకుంట దేవస్ధానం ఛైర్మన్‌ సంజీవరెడ్డిపై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఉద్యోగం ఇప్పిస్తానంటూ నాలుగు సంవత్సరాలుగా తనను లోబరుచుకుని వేధిస్తున్నాడంటూ జమ్మికుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన 20 గుంటల భూమి తీసుకుని డబ్బు  చెల్లించకుండా తనను బెదిరిస్తున్నాడని ఆమె ఆరోపించింది. అయితే తాను ఛైర్మన్‌పై ఫిర్యాదు చేస్తే భార్య, భర్తల మధ్య విభేదాలంటూ కౌన్సిలింగ్ ఇచ్చి పంపారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.  


 

భర్తకు ప్రియుడితో చేసిన పాడుపని వీడియోలు..

Submitted by arun on Fri, 03/16/2018 - 16:06

కట్టుకున్న భర్తను కాదని మరో యువకుడిని పెళ్లి చేసుకుంది ఓ యువతి. అంతేకాకుండా ప్రియుడితో కలిసి పెళ్లి దృశ్యాలను ఏకంగా భర్త మొబైల్‌కే వాట్సాప్‌లో పంపించి మానసికంగా వేధించింది. తీవ్రమనస్తాపానికి లోనైన భర్త.. పురుగుల మందు తాగి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రియుడితో కలిసి భర్తకు పంపిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలోనే జగిత్యాల మండలం ఖానాపూర్‌కు చెందిన నాగలక్ష్మితో ధర్మారావు పేటకు చెందిన ధర్మరాజు (27)కు పెళ్లయింది. కానీ, ఆ పెళ్లికి ముందే ఆమె తన పుట్టింటికి దగ్గర్లోని వెల్గటూరుకు చెందిన మంత్రి మహేశ్ అనే యువకుడితో ప్రేమాయాణం సాగించింది.