Union Minister Piyush Goyal

టీడీపీని డిఫెన్స్ లో ప‌డేసిన పియూష్ గోయోల్ వ్యాఖ్య‌లు

Submitted by lakshman on Fri, 03/16/2018 - 14:39

హ‌స్తిన కేంద్రంగా రాజ‌కీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మ‌ధ్య హోరాహోరీగా న‌డుస్తోంది. ఆధిప‌త్యం కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. టీడీపీ ఎంపీలు పార్ల‌మెంట్ ప్రాంగ‌ణంలో ధ‌ర్నాలు నిర్వ‌హిస్తుంటే, వైసీపీ ఎంపీ ఏకంగా పార్ల‌మెంట్ భ‌వ‌నం పై కిఎక్కి నిర‌స‌న‌లు తెలిపారు. ఇలా పోటాపోటీగా ఆందోళ‌న‌లు సాగిస్తున్నారు. అదే స‌మ‌యంలో బీజేపీ విష‌యంలో మాత్రం భిన్నంగా స్పందిస్తున్నాయి. టీడీపీ త‌న‌కు అన్యాయం చేసిన మిత్రుడి గురించి అల్లాడిపోతోంది. బీజేపీ తీరు మీద తీవ్రంగా మండిప‌డుతోంది. నేరుగా కాక‌క‌పోయినా ప‌రోక్షంగానైనా ఘాటు వ్యాఖ్య‌లు సంధిస్తోంది. స‌మ‌రానికి సిద్ధం అవుతోంది.