no-confidence motion

లావణ్య పదవి ఊడింది!

Submitted by arun on Tue, 07/24/2018 - 15:36

రెండు నెలలుగా అనేక మలుపులు తిరుగుతున్న భువనగిరి మున్సిపల్‌ రాజకీయానికి తెరపడింది. జిల్లాలోనే ఏకైక మున్సిపాలిటీ అయిన భువనగిరి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిని సుర్వి లావణ్య కోల్పోయింది. ఆమెకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టగా మొత్తం 30 మంది సభ్యుల్లో ఆమెకు వ్యతిరేకంగా 22 మంది కౌన్సిలర్‌లు ఓటేశారు. దీంతో ఆమె పదవిని కోల్పోవాల్సి వచ్చింది. తొలుత బీజేపీ నుంచి గెలిచిన లావణ్య అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి 4 ఏళ్లు చైర్‌పర్సన్‌గా పాలన కొనసాగారు. అయితే ఇటీవల ఆమె అనూహ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ సమక్షంలో బీజేపీలో చేరారు.

చంద్రబాబు మాకు మిత్రుడే: రాజ్‌నాథ్ సింగ్

Submitted by arun on Fri, 07/20/2018 - 17:51

రెండు ఎంపీ స్థానాల నుంచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థాయికి ఎదిగామన్నారు కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌. అతి విశ్వాసం ఎప్పుడు మంచిది కాదన్న ఆయన యూపీఎ ప్రభుత్వంపై తామెన్నడూ అవిశ్వాసం ప్రవేశపెట్టలేదన్నారు. భారత్ ఖ్యాతిని మోడీ ప్రపంచస్థాయికి తీసుకెళ్లారన్న ఆయన మోడీ పిలుపుతో లక్షలాది మంది గ్యాస్‌ సబ్సిడీని వదులుకున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వంపై ఎవరైనా అవిశ్వాసం పెట్టవచ్చన్న ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలు బలవంతంగా ఏకమయ్యాయని రాజ్‌నాథ్‌ సింగ్‌ విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు తమకు ఎప్పటికీ మిత్రుడే అన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.

తొలి టర్మ్ లోనే ఎంపీగా జయదేవ్ కు అరుదైన అవకాశం

Submitted by arun on Fri, 07/20/2018 - 17:23

అశాస్త్రీయ, అప్రజాస్వామిక విభజనతో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరపున జయదేవ్ చర్చను ప్రారంభించారు. రెండు జాతీయపార్టీలు కలసి ఏపీని నిలువునా ముంచాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఆడిన మాట తప్పారంటూ దుయ్యబట్టారు.

గల్లా జయదేవ్‌కు కౌంటర్‌ ఇచ్చిన రాకేష్ సింగ్

Submitted by arun on Fri, 07/20/2018 - 13:08

అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రాకేష్ సింగ్ తనదైన శైలిలో స్పందించారు. బీజేపీకి శాపం తగులుతుందని వ్యాఖ్యానించిన మీరు ఎప్పుడైతే మీరు కాంగ్రెస్ పక్కన కూర్చున్నారో, అప్పుడే మీకు శాపం తగిలినట్టు అని రాకేశ్ సింగ్ అన్నారు. ప్రజలు వెలేసేది బీజేపీని కాదని టీడీపీనేనని ఈ విషయం తొందర్లోనే తెలుస్తుందని రాకేశ్ సింగ్ అన్నారు.  కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ప్రారంభించిన కుమారస్వామి కన్నీళ్లు పెట్టుకున్న విషయాన్ని దేశమంతా చూశారని రాకేశ్ సింగ్ గుర్తుచేశారు. 

అవిశ్వాసం ఓటింగ్ తర్వాత జేసీ...టీడీపీకే గుడ్‌ బై చెబుతారా..?

Submitted by arun on Fri, 07/20/2018 - 11:08

అవిశ్వాసంపై ఓటింగ్‌కు దూరంగా ఉంటానని కలకలం రేపి జేసీ దివాకర్ రెడ్డి ఎట్టకేలకు అలక వీడారు. చంద్రబాబు ఫోన్ చేసిన తర్వాత మెత్తబడిన జేసీ నేడు లోక్‌సభకు హాజరౌతానని ప్రకటించారు. అనంతపురం గ్రూపు రాజకీయాల వల్లే జేసీ టీడీపీ హైకమాండ్‌కు ఝలక్ ఇచ్చినట్లు సమాచారం. అయితే అవి‌‌శ్వాసం ఓటింగ్ తర్వాత ఏం జరుగుతుందో చూడండంటూ జేసీ సస్పెన్స్ మిగిల్చారు.

కాక రేపుతున్న అవిశ్వాస తీర్మానం

Submitted by arun on Fri, 07/20/2018 - 11:00

ఇప్పుడు దేశం మొత్తం చూపు అవిశ్వాసంపైనే. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నేడు చర్చకు రానున్న నేపథ్యంలో ఢిల్లీలో రాజకీయ వేడి పెరిగింది. అధికార, ప్రతిపక్షాలు వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నమయ్యాయి. అవిశ్వాసానికి మద్దతు కూడగట్టే యత్నాల్లో తలమునకలైన టీడీపీ చర్చ కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

లోక్‌సభ లెక్కలు...వీళ్లే ఫ్రైడే ఫైట్‌లో కీలకం

Submitted by arun on Wed, 07/18/2018 - 17:28

శుక్రవారం జరగబోయే నో కాన్ఫిడెన్స్ ఫైట్‌కు పార్టీలు రెడీ అయ్యాయి. పార్టీల బలబలాలను ఓసారి పరిశీలిస్తే లోక్‌సభలో ఖాళీ అయిన 8 స్థానాలు పోగా.. ప్రస్తుతం 535 మంది ఎంపీలున్నారు. వీరిలో అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 268 మంది మద్దతు కావాలి. 535 సభ్యుల్లో ఎన్డీయే కూటమికి 311 మంది సభ్యుల బలం ఉంది. 

అవిశ్వాసం ఏమౌతుంది?: పార్టీల బలబలాలివే

Submitted by arun on Wed, 07/18/2018 - 16:34

శుక్రవారం జరగబోయే నో కాన్ఫిడెన్స్ ఫైట్‌కు పార్టీలు రెడీ అయ్యాయి. పార్టీల బలబలాలను ఓసారి పరిశీలిస్తే లోక్‌సభలో ఇప్పుడు 543 మంది ఎంపీలున్నారు. వీరిలో అవిశ్వాస తీర్మానం పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 272 మంది మద్దతు కావాలి. 543 సభ్యుల్లో ఎన్డీయే కూటమికి 314 మంది సభ్యుల బలం ఉంది. యూపీఏ కూటమికి 66 మంది సభ్యుల బలం ఉంది. 

అవిశ్వాస సమరానికి ముహూర్తం ఖరారు

Submitted by arun on Wed, 07/18/2018 - 16:12

లోక్ సభలో అవిశ్వాస సమరానికి ముహూర్తం ఖరారైంది. మోడీ సర్కారుపై టీడీపీ ప్రవే పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఎల్లుండి చర్చ జరగబోతోంది. ఏపీకి జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని పార్లమెంట్  సమావేశాల మొదటి రోజే  అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ  తీర్మానానికి కాంగ్రెస్  పార్టీ మద్దతు తెలిపింది. ఈ తీర్మానాన్ని స్పీకర్  సుమిత్రా మహాజన్ సభలో చదవి వినిపిస్తుండగా టీడీపీ నేతలు, కాంగ్రెస్  పార్టీ నేతలు రాహుల్  గాంధీ, సోనియా గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలు లేచి నిలబడి మద్దతు తెలిపారు.

లోక్‌సభ : అవిశ్వాస తీర్మానంపై చర్చకు అనుమతించిన స్పీకర్‌ మహాజన్‌

Submitted by arun on Wed, 07/18/2018 - 12:31

కేంద్ర ప్రభుత్వంపై టీడీపీ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం అందిందని లోక్ సభ స్పీకర్ సుమిత్రామహాజన్ తెలిపారు. టీడీపీ సహా పలు పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానాలు అందాయని చెప్పారు. అవిశ్వాసంపై చర్చకు సంబంధించిన తేదీ, సమయాన్ని 10 రోజుల్లో ప్రకటిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా అవిశ్వాసానికి ఎంతమంది ఎంపీలు మద్దతు పలుకుతున్నారని స్పీకర్ ప్రశ్నించగా... టీడీపీ, కాంగ్రెస్ సహా పలు విపక్ష సభ్యులు లేచి నిలబడ్డారు. నిలబడ్డవారి సంఖ్య 50కి పైగా ఉండటంతో, అవిశ్వాసంపై చర్చ జరుపుతామని తెలిపారు. నియమనిబంధనలను అనుసరించి, చర్చను చేపడదామని చెప్పారు.