no confidence motion

ఎంపీ గల్లా ప్రసంగంపై టీఆర్ఎస్ ఎంపీల అభ్యంతరం

Submitted by arun on Fri, 07/20/2018 - 11:38

అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ ప్రారంభమైంది. టీడీపీ ఎంపీ కేశినేని నాని సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మరో ఎంపీ గల్లా జయదేవ్‌ చర్చను ప్రారంభించారు. ఎన్డీయే నుంచి బయటకు రాగానే టీడీపీపై కేంద్రం యుద్ధం ప్రకటించిందని ఈ సందర్భంగా గల్లా వ్యాఖ్యానించారు. అయితే గల్లా మాట్లాడుతున్న సమయంలోనే సభలో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అప్రజాస్వామికంగా ఏపీని విభజించారంటూ ఎంపీ గల్లా జయదేవ్ వ్యాఖ్యలపై టీఆర్ఎస్ ఎంపీలు అభ్యంతరం తెలిపారు. విభజన తర్వాత కొత్త రాష్ట్రం ఏపీనే అని అన్నారు. రాజధాని లేదు ఆదాయంలో లోటు ఉందని, ఏపీ అనిశ్చతిలో ఉందని గల్లా పేర్కొన్నారు.

టీడీపీ అవిశ్వాసంపై ప్రధాని మోదీ ట్వీట్!

Submitted by arun on Fri, 07/20/2018 - 10:40

పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో నేడు చాలా ముఖ్యమైన రోజు అన్నారు ప్రధాని నరేంద్రమోడీ. లోక్‌సభలో ఈరోజు నిర్మాణాత్మకమైన, అంతరాయం లేని చర్చ జరగాలని ఆంకాక్షిస్తున్నానన్నారు.  యావత్‌ భారతదేశం‌ మనల్ని చాలా నిశితంగా చూస్తోందని ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు.

కేశినేనికి షాక్.. గల్లాకు చాన్స్..!

Submitted by arun on Thu, 07/19/2018 - 16:37

పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీ ఎంపీలు పట్టుబట్టడంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ బుధవారం నాడు ఓకే చెప్పారు. దీంతో మద్దతు కోసం అటు ఎన్డీఏ.. ఇటు టీడీపీ.. పార్టీల అధినేతలు, ఎంపీలను ఒప్పించి మద్దతు కూడగట్టు పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో శుక్రవారం నాడు పార్లమెంట్‌లో ఎవరితో మాట్లాడించాలి..? ఎవరైతే అందుకు సూటబుల్? అనే విషయాలపై సీఎం చంద్రబాబు ఓ ప్రణాళికను తయారు చేశారు. పార్లమెంట్‌లో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చను ఎంపీ గల్లా జయదేవ్‌ ప్రారంభించనున్నారు. బుధవారం నాడు ఎంపీ కేశినేని నాని తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Submitted by arun on Thu, 07/19/2018 - 15:44

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఫోర్త్ జెండర్ అని...ఆడ, మగ, నపుంసక కాని మరో జీవి అని వ్యాఖ్యానించారు. ఫోర్త్ జెండర్ అంటే ప్రకృతి కార్యంలో కూడా డ్యుయల్ రోల్ ప్లే చేసే వ్యక్తి అని, చంద్రబాబు ఏపీకి సీఎంగా ఉంటూ ఫోర్త్ జెండర్‌గా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాలానికి తగ్గట్లుగా చంద్రబాబు రంగులు మార్చుతారని ఎంపీ విమర్శించారు. చంద్రబాబు ఓవైపు బీజేపీతో రహస్య ఒప్పందం కొనసాగిస్తూనే.. మరోవైపు అవిశ్వాస తీర్మానాన్ని పెడుతున్నారని మండిపడ్డారు.

అవిశ్వాస తీర్మానం.. మేం మద్దతివ్వం..

Submitted by arun on Thu, 07/19/2018 - 13:37

గత పార్లమెంటు సమావేశాల్లో అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టకుండా కావేరీ జలాల పేరుతో అన్నా డీఎంకే అనుక్షణం సభను అడ్డుకున్న సంగతి తెలిసిందే. బీజేపీ కనుసన్నల్లో మెలుగుతూ అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా విజయవంతంగా తన పాత్రను పోషించిందనే ప్రచారం కూడా జరిగింది. ఎన్‌డీఏ ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాస తీర్మానం శుక్రవారం చర్చకు రానుంది. టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వడం లేదని తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి స్పష్టం చేశారు. కావేరి జలాలపై మా పార్టీ చేసిన పోరాటానికి ఏ పార్టీ మద్దతివ్వలేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేశారు.

మోడీపై అవిశ్వాసం... చంద్రబాబుకు కేసీఆర్ ఝలక్

Submitted by arun on Wed, 07/18/2018 - 14:55

ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వంపై ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఝలక్ ఇచ్చారు. లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వలేదు. బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు.
 

ఫలించిన టీడీపీ ప్రయత్నం.. అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారు

Submitted by arun on Wed, 07/18/2018 - 14:06

టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై చర్చకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న చర్చించాలని బీఏసీ సమావేశంలో స్పీకర్ సుమిత్ర మహాజన్ నిర్ణయించారు. అదే రోజు ప్రశ్నోత్తరాలను రద్దు చేసి సాయంత్రం వరకూ చర్చ జరపనున్నారు. కేంద్రంపై అవిశ్వాస తీర్మానాన్ని కాంగ్రెస్, టీడీపీ ప్రవేశపెట్టాయి. అయితే, టీడీపీ ముందుగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో నిబంధనల ప్రకారం ఆ తీర్మానాన్ని స్వీకరించినట్టు స్పీకర్ ప్రకటించారు. 50 మందికి పైగా సభ్యులు టీడీపీ అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలిపడంతో చర్చకు కేంద్రం సై అంది. మరోవైపు ఏపీ విభజన చట్టంపై రాజ్యసభలో సోమవారం స్వల్పకాలిక చర్చ జరగనుంది. 

టీడీపీకి సోనియా గాంధీ మద్దతు

Submitted by arun on Wed, 07/18/2018 - 13:21

లోక్‌సభలో టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. బుధవారం ఉదయం టీడీపీ ఎంపీలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆమోదం తెలిపారు. ప్రశ్నోత్తరాల తర్వాత టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, తోట నర్సింహం, కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన నోటీసులు అందాయని స్పీకర్ తెలిపారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ ఓటింగ్ నిర్వహించారు. అవిశ్వాసానికి మద్దతిస్తున్నవారు లేచి నిల్చోవాలని కోరారు. టీడీపీ ఎంపీలంతా తమ తమ స్థానాలలో లేచి నిలబడ్డారు. వారికి మద్దతుగా నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కూడా నిల్చున్నారు.

టీఆర్ఎస్ ఎంపీ ఇంటికెళ్లిన టీడీపీ ఎంపీలు

Submitted by arun on Mon, 07/16/2018 - 10:40

కేంద్రంపై మరోసారి అవిశ్వాస అస్త్రం ప్రయోగించేందుకు టీడీపీ రెడీ అయ్యింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ సమావేశాల్లో నరేంద్రమోడీ ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టనుంది. మద్దతు కోసం బీజేపీ, కాంగ్రెసేతర పార్టీలకు చంద్రబాబు 8 పేజీల లేఖ రాశారు. మద్దతు కూడగట్టే ప్రయత్నంలో టీడీపీ ఎంపీలు టీఆర్ఎస్ ఎంపీలను కలిసి తమకు సపోర్ట్ చేయాలని కోరారు.