no confidence motion

అవిశ్వాసంలో విజయం...పంతం నెగ్గించుకున్న సోమారపు

Submitted by arun on Thu, 08/02/2018 - 13:20

తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ రేపిన రామగుండం అవిశ్వాస తీర్మానంలో ఎమ్మెల్యే  సోమారపు సత్యనారాయణ తన పంతం నెగ్గించుకున్నారు. మేయర్‌, డిప్యూటి మేయర్‌లకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మూడో వంతు ఓట్లు వచ్చాయి. దీంతో మేయర్, డిప్యూటి మేయర్లు తమ పదవులు కోల్పోయారు.  కాంగ్రెస్ జారీ చేసిన విప్ ధిక్కరించిన 17 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు.  కోరంకు సరిపడా సభ్యులు హాజరు కాకుండా చూసేందుకు చివరి వరకు ప్రయత్నించిన మేయర్ కొంకటి లక్ష్మి నారాయణ సాధ్యం కాకపోవడంతో  సమావేశానికి దూరంగా ఉన్నారు.  

ఢిల్లీ వేదికగా కేంద్రంపై చంద్రబాబు దాడి

Submitted by arun on Sat, 07/21/2018 - 14:50

ప్రస్తుతం జరుగుతున్న పోరాటం బీజేపీ, టీడీపీ మధ్య కాదని మెజార్టీకి, నైతికతకు మధ్య జరుగుతున్న పోరాటమని చంద్రబాబు అన్నారు. విభజన చట్టాలన్నింటినీ అమలు చేస్తామని అమరావతి శంకుస్థాపన సందర్భంగా మోడీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 30 ఏళ్ల తర్వాత పూర్తి మెజార్టీ వచ్చిందని లోక్ సభలో మోడీ చెప్పారని ప్రజా తీర్పును తాము కూడా గౌరవిస్తామని చెప్పారు. 15 ఏళ్ల తర్వాత కేంద్రంపై అవిశ్వాసం పెట్టింది తామేనని చంద్రబాబు అన్నారు. 

బీజేపీతో పొత్తుపై తేల్చేసిన జనసేనాని!

Submitted by arun on Sat, 07/21/2018 - 13:47

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే పవన్‌ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై జనసేనాని గట్టిగా బదులిచ్చారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు వచ్చే లాభమేంటని జనసేనాని ప్రశ్నించారు? ప్యాకేజీకి ఒప్పుకొని మళ్లీ యూ టర్న్ తీసుకున్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని ట్విట్టర్ లోనే కౌంటర్ ఎటాక్ చేశారు .

తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసిన అవిశ్వాస తీర్మానం

Submitted by arun on Sat, 07/21/2018 - 12:39

కేంద్రంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు రాజేసింది. చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీలు ప్రస్తావించిన అంశాలపై టీఆర్ఎస్ సభ్యులు భగ్గుమన్నారు.  విభజనకు ముందు మద్ధతిచ్చిన చంద్రబాబు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారంటూ మండిపడ్డారు. విభజన సమస్యలను ప్రస్తావిస్తూ ప్రధాని చేసిన వ్యాఖలు కూడా ఇరు పార్టీల మధ్య  వివాదాన్ని స్పష్టించాయి.  

ఈ వయసులో నాకిలాంటివెందుకు రాహుల్‌?

Submitted by arun on Fri, 07/20/2018 - 17:44

ఇన్నాళ్లూ రాహుల్ అంటే అంతా లైట్ తీసుకునేవారు. కానీ ఇప్పుడు రాహుల్ అంటే లైట్ కాదు ఫైట్ అని నిరూపించారు. రాహుల్ అంటే సిల్లీ పొలిటీషియన్ కాదు సీరియస్ లీడర్ అనుకునేలా చేశారు. అవిశ్వాసంపై చర్చలో భాగంగా.. రాహుల్ గాంధీ స్పీచ్ చూస్తే.. ఎవరికైనా ఇదే అర్థమవుతుంది. అందుకే.. ఇండియా ఇప్పుడు రాహుల్‌ గురించి చర్చిస్తోంది.

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ను మరిపించావ్‌ రాహుల్‌

Submitted by arun on Fri, 07/20/2018 - 17:35

కొంచెం ఆవేశం.. కొంచెం ఆక్రోశం.. కాస్త ఉద్వేగం.. కొంత కోపం... కొన్ని ఆరోపణలు.. మరెన్నో విమర్శలు.. ప్రశ్నించారు.. నిలదీశారు.. అడగాల్సినవన్నీ అడిగేశారు.. కొన్ని అంశాలపై కడిగేశారు.. ఒక్క రాహుల్.. పది వేరియేషన్స్. భారత పార్లమెంటులో నేటి రాహుల్‌ను చూసిన దేశం.. అవాక్కైంది.

ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించండి?

Submitted by arun on Fri, 07/20/2018 - 17:01

తెలంగాణ ప్రజలు బీజేపీని క్షమించరని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వినోద్ ఏపీలో కలిపిన ఏడు మండలాల గురించి ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిందని విమర్శించారు. ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పారనీ ఆయన ఒత్తిడి వల్లే ప్రధాని మోడీ స్వయంగా చొరవ తీసుకుని ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు.

మోదీని అంత మాట అంటావా? గల్లాపై మండిపడిన నిర్మలా సీతారామన్

Submitted by arun on Fri, 07/20/2018 - 14:09

అవిశ్వాస తీర్మానంపై చర్చ జరుగుతుండగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్  ప్రధాని మోడీ పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. రికార్డుల నుంచి జయదేవ్ వ్యాఖ్యలు తొలగించాలన్నారు రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీని ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ‘మోసగాడు’ అనే పదాన్ని ఉపయోగించారని, ఆ పదాన్ని రికార్డుల నుంచి తొలగించాలని బీజేపీ ఎంపీలు సభలో ఆందోళన చేశారు. రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానిని అలా అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ పదాన్ని వెంటనే రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

గల్లా జయదేవ్ వ్యాఖ్యలను ఖండించిన జితేందర్ రెడ్డి

Submitted by arun on Fri, 07/20/2018 - 13:19

ఆంధ్రప్రదేశ్ ని అడ్డగోలుగా విభజించారంటూ లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ చేసిన వ్యాఖ్యలను టీఆర్ఎస్ ఖండించింది. ఆ పార్టీ ఎంపీ జితేందర్ రెడ్డి గల్లా జయదేవ్‌పై మండిపడ్డారు. రాజ్యాంగ విరుద్ధంగా, అశాస్త్రీయంగా రాష్ట్ర విభజన జరిగిందని చేసిన వ్యాఖ్యలను ఖండించారు. లోక్ సభ, రాజ్యసభలలో రాష్ట్ర విభజన బిల్లు ఆమోదం పొందిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతో మంది ఆత్మాబలిదానాలకు పాల్పడ్డారని ఈ నేపథ్యంలో రాష్ట్ర ఏర్పాటు కోసం కాంగ్రెస్ పార్టీని, బీజేపీని తాము ఒప్పించామని తదనంతరం పార్లమెంటు ఉభయసభల్లో బిల్లు పాస్ అయిందని చెప్పారు.

పార్లమెంట్‌లో ‘భరత్ అనే నేను’ సినిమాను ప్రస్తావించిన గల్లా జయదేవ్!

Submitted by arun on Fri, 07/20/2018 - 11:54

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ గల్లాజయదేవ్ భరత్ అనే నేను సినిమా ప్రస్తావించారు. ముందుగా అవిశ్వాసంపై సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు, అవిశ్వాసానికి మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ సహా ఇతర పార్టీలకు కృతజ్ఞతలు తెపిన  జయదేవ్ భరత్ అనే సినిమా సన్నివేశాన్ని వివరించారు. అమెరికా నుంచి ఇండియాకు వచ్చిన ఓ ఎన్‌ఆర్‌ఐ కథే ‘భరత్ అనే నేను’ అని స్పీకర్‌కు గల్లా వివరించారు. ఆ సినిమాలో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని హీరో తల్లి చెప్పిన మాటకు కట్టుబడి సీఎంగా సేవలందిస్తాడని గల్లా చెప్పుకొచ్చారు.