Rangamma Mangamma Song

కొత్త రికార్డు సొంతం చేసుకున్న ‘రంగస్థలం’!

Submitted by arun on Mon, 09/17/2018 - 13:04

రామ్ చరణ్, సమంతల కాంబినేషన్లో తెర‌కెక్కించిన‌ 'రంగస్థలం' చిత్రం అఖండ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. దర్శకుడు సుకుమార్ 1985 నాటి బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. తాజాగా ఈ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. గోదావరి యాసతో 'రంగమ్మా, మంగమ్మా... ఏం పిల్లడూ.. ' అనే పాట సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్ ను దాటేసి రికార్డు పుటల్లోకి ఎక్కింది. 100మిలియన్లు సాధించిన రెండో తెలుగు పాటగా రంగమ్మా.. మంగమ్మా నిలిచింది.

‘రంగస్థలం’ వివాదంపై స్పందించిన సుకుమార్‌

Submitted by arun on Fri, 03/16/2018 - 11:14

‘రంగస్థలం’లోని ‘రంగమ్మ మంగమ్మ’ పాటలో యాదవ మహిళలకు కించపరిచేలా పదాలు ఉన్నాయని యాదవ హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షుడు రాములు యాదవ్ అభ్యంతరం తెలిపిన సంగతి తెలిసిందే. ఆ పాటలోని ‘గొల్లభామ వచ్చి నా గోరు గిల్లుతుంటే’ అనే లైన్‌ను తొలగించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరించారు. అయితే దీనిపై ఆ సినిమా దర్శకుడు స్పష్టత ఇచ్చారు. గొల్లభామ అనే పదాన్ని మనుషులను ఉద్దేశించి వాడలేదని అదొక పురుగులాంటింద‌ని, ఇది అందరికీ తెలిసే ఉంటుందని సుకుమార్ ఓ ప్రెస్ మీట్‌లో తెలిపాడు. మ‌రి సుకుమార్ స‌మాధానంతో యాద‌వ్ హ‌క్కులు పోరాట స‌మితి సంతృప్తి చెందుతుందో చూడాలి.