etela rajender

బస్సు దారి తప్పిందా...బస్సు మార్గంపై విచారణ జరిపిస్తామన్న మంత్రి ఈటల

Submitted by arun on Tue, 09/11/2018 - 14:07

కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 32 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఘ‌ట‌నాస్థలంలోనే అత్య‌వ‌స‌ర చికిత్స అందించేందుకు వైద్య సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రులను వెంటాడిన తేనెటీగలు

Submitted by arun on Thu, 06/07/2018 - 15:15

జగన్ ప్రజా సంకల్పయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కానూరు క్రాస్ రోడ్డు దగ్గర  పాదయాత్రగా వెళుతుండగా తేనేటీగలు దాడి చేశాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ...టవాళ్లు అడ్డం పెట్టి యాత్ర కొనసాగించారు. తేనేటీగల దాడిలో పది మందికి గాయాలయ్యాయి.

గతంలో తెలంగాణలోనూ తేనెటీగల దాడికి మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ కూడా పరుగులు పెట్టారు. కరీంనగర్‌లో జిల్లాలో కురిసిన వడగండ్ల వానకు నాశనమైన పంట నష్టాన్ని పరిశీలించేందుకు కేటీఆర్, ఈటల స్థానిక నేతలతో పంట పొలాలకు వెళ్లారు. అక్కడ ఒక్కసారిగా దాడి చేసిన తేనెటీగలు అందరినీ పరుగులు తీయించాయి. 

దేశరాజకీయాలకు ప్లీనరీ వేదిక : ఈటెల

Submitted by arun on Wed, 04/25/2018 - 16:28

దేశ రాజకీయాలకు టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక కాబోతుందని.. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కొంపల్లిలో ప్లీనరీ కోసం జరుగుతున్న ఏర్పాట్లను పర్యవేక్షించిన ఆయన.. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు.. అన్ని రాష్ట్రాల్లో అమలు కావాలనదే కేసీఆర్ ఆకాంక్ష అని అన్నారు ఈటల. ఎన్నో అవమానాలు భరించి గమ్యాన్ని ముద్దాడిన పార్టీ టీఆర్‌ఎస్ పార్టీ అన్నారు. కేసీఆర్ దీక్షా దక్షతలను గుర్తించే తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నరు. అనుభవమున్న పార్టీల కంటే తెలంగాణలో టీఆర్‌ఎస్ పాలన బాగుందన్నారు. అతి తక్కువ కాలంలో ఎక్కువ అభివృద్ధి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు.
 

తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ లోని ముఖ్యాంశాలు

Submitted by lakshman on Thu, 03/15/2018 - 12:40


తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాల్లో  2018-19 రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను రూ. 1,74,453 కోట్లతో  మంత్రి ఆర్ధిక మంత్రి  ఈటల రాజేంద‌ర్ ప్ర‌వేశ‌పెట్టారు. ఈ బ‌డ్జెట్ లో సంక్షేమ పథ‌కాల్ని పోత్స‌హించేలా ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక ఏం సంక్షేమ ప‌థ‌కానికి ఎంత కేటాయించారు అనే దానిపై విశ్లేషిస్తే   మ‌హిళా, శిశు సంక్షేమానికి రూ.1799 కోట్లు
ఎంబీసీ సంక్షేమం కోసం రూ.1000కోట్లు
ర‌జ‌కుల ఫెడ‌రేష‌న్‌కు రూ.200 కోట్లు
మైనార్టీ శాఖ‌కు రూ.2 వేల కోట్లు
గ‌ర్భిణీ సంక్షేమానికి రూ.561 కోట్లు
నాయీబ్రాహ్మ‌ణ ఫెడ‌రేష‌న్‌కు రూ.250 కోట్లు
కుల్‌గుర్బా భ‌వ‌న నిర్మాణం కోసం రూ.20 కోట్లు