Swamy Goud

స్వామిగౌడ్ ఇంటికి వెళ్లారు.. మరి కాంగ్రెస్ నేతలు?

Submitted by lakshman on Thu, 03/15/2018 - 22:04

తెలంగాణ రాజకీయంలో కొత్త వివాద కేంద్రం అయిన మండలి చైర్మన్ స్వామి గౌడ్.. సరోజినీ దేవి హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్లారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా.. గవర్నర్ ప్రసంగ సమయంలో.. కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి మైక్ విసరడంతో.. గాయపడి హాస్పిటల్ లో చేరిన స్వామిగౌడ్.. ఇవాల్టికి డిశ్చార్జ్ అయ్యారు. మరో నాలుగు రోజులు కనీసం ఆయన రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో తొలిరోజు రచ్చ

Submitted by arun on Mon, 03/12/2018 - 15:20

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజే కాంగ్రెస్ రచ్చకు దిగింది. రైతు ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని ముందే హెచ్చరించిన కాంగ్రెస్.. చెప్పినట్టుగానే తీవ్ర ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ చేపట్టిన ఆందోళన హద్దులు దాటింది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి విసిరిన మైక్ మండలి చైర్మన్ స్వామిగౌడ్‌కు తగలడంతో తొలిరోజు బడ్జెట్ సమావేశాలు రసాబాసాగా మారాయి.

హెడ్‌ఫోన్ విసిరితే నా కంటికి తాకింది: స్వామిగౌడ్

Submitted by arun on Mon, 03/12/2018 - 12:26

తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి దురుసుగా ప్రవర్తించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో మూడుసార్లు మైక్, ఒకసారి హెడ్ ఫోన్స్‌ను విసిరారు. మైక్ గాంధీ ఫోటోను తాకి స్వామి గౌడ్ కంటికి తగిలింది. దీంతో ఆయనను వెంటనే కంటి ఆస్పత్రికి తరలించారు. అనంతరం స్వామిగౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సభ్యులు విసిరిన మైక్‌ నేరుగా తన కంటికి తగిలిందని తెలిపారు. బాధ కలుగుతున్నప్పటికీ ఓర్చుకుంటూ గవర్నర్‌ ప్రసంగం పూర్తయ్యేవరకు ఓర్చుకున్నానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సూచన మేరకు సరోజిని కంటి ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని..