budget selfie smart phones

బడ్జెట్ ధరకే లాంచ్ అవుతున్న సెల్ఫీ ఫోన్స్

Submitted by lakshman on Sun, 09/17/2017 - 21:17

చైనీస్ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో తన సరికొత్త ఫోన్లను లాంచ్ చేసేందుకు రెడీ అయింది. వివో వీ7, వీ 7 ప్లస్ పేర్లతో వస్తున్న ఈ ఫోన్ల లాంచింగ్ వేదికను ముంబైలో సెట్ చేసింది. 6జిబి ర్యామ్‌తో వస్తున్న ఈ ఫోన్ల ధరను కూడా కంపెనీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. వీ7 ధర రూ. 19,999 అలాగే వీ7 ప్లస్ ధరను 21,990గా ఉండొచ్చని అంచనా. కంపెనీ తన ఫేస్ బుక్ పేజీలో దీనిపై సమాచారాన్ని ఇచ్చింది.