Federal System

దేశాభివృద్ధికి ఎజెండా

Submitted by arun on Sat, 03/10/2018 - 10:11

దేశాభివృద్ధికి అవసరమైన అజెండా రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. ప్రగతి భవన్‌లో పలువురు ప్రముఖులు, విశ్రాంత అధికారులు, సీనియర్ అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. దేశంలో ఇంకా ప్రజల ప్రాథమిక అవసరాలు తీరడం లేదని.. తాగు, సాగు నీరు, విద్యుత్, మౌలిక సదుపాయాల కల్పన జరగడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ర్టాల మధ్య జలవివాదాలు అపరిష్కృతంగా ఉన్నాయని కేసీఆర్ చెప్పారు. సమాఖ్య వ్యవస్థ స్పూర్తి పూర్తిస్థాయిలో ప్రతిబింబించడం లేదని.. కేంద్ర-రాష్ర్టాల మధ్య సమస్యల పరిష్కారానికి ఏర్పాటైన కమిషన్లు, నిపుణుల కమిటీల సూచనలు,  సంస్కరణలేవి అమలు కావడం లేదన్నారు.