ysr biopic

రాజకీయాల్లోకి అనసూయ

Submitted by arun on Tue, 11/13/2018 - 12:45

యాంకర్ గా తన కంటు ఓ స్థానం సంపాధించుకున్న అనసూయ అతి తక్కువ కాలంలోనే  అశేష అభిమానులను సంపాదించుకుంది. అనసూయ ఏ ప్రోగ్రామ్ చేసిన అది టాప్ రేటింగ్ లో వుండాలసిందే ఒక వైపు టీవీ షోలు చేస్తునే మరో వైపు సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తుంది రంగస్థలం సినిమా తర్వాత అనసూయ చేస్తున్న మరో సినిమా యాత్ర..వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాలో అనసూయ రాజకీయ నాయకురాలి పాత్ర పోసించబోతుంది. రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి నటిస్తున్నారు. రాజశేఖర్ రెడ్డిగా ఆయన లుక్ ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది.అయితే ఇందులో ఓ ముఖ్య మైన మహిళా నాయకురాలిగా అనసూయ కనిపించబోతుంది.

‘యాత్ర’ ఫస్ట్ సాంగ్...

Submitted by arun on Sun, 09/02/2018 - 12:06

దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా ఆయన జీవితచరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘యాత్ర’ నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. వైఎస్ఆర్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి కనిపించ‌నుండ‌గా, వైఎస్ విజయమ్మ పాత్ర కోసం బాహుబలి ఫేం ఆశ్రితని సెలక్ట్ చేసారు. అయితే ఈ రోజు వైఎస్ఆర్ 9వ వ‌ర్ధంతి సంద‌ర్భంగా స‌మ‌రశంఖం అనే సాంగ్ విడుద‌ల చేసింది చిత్ర బృందం.

వైఎస్‌ జగన్‌ పాత్రలో ఆ హీరోనా?

Submitted by arun on Wed, 07/25/2018 - 14:49

టాలీవుడ్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మకంగా రూపొందుతున్న బ‌యోపిక్స్‌లో యాత్ర ఒకటి. ఆనందోబ్రహ్మ చిత్రం ఫేమ్ మహీ రాఘవ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని 70 ఎంఎం ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. 30 కోట్ల బడ్జెట్ తో ఈ ప్రాజెక్ట్ రూపొందుతుంది. జూన్ 20న చిత్ర షూటింగ్ ప్రారంభం కాగా, వైఎస్ ఆర్ పాత్ర పోషిస్తున్న మ‌మ్ముట్టికి సంబంధించిన సన్నివేశాల‌ని చిత్రీక‌రించారు. యాత్ర సినిమా కోసం మహి వి రాఘవ ముఖ్య పాత్రలని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది.

వైఎస్సార్ బయోపిక్‌లో అనసూయ.. ఏ పాత్రలోనంటే..

Submitted by arun on Sat, 06/30/2018 - 10:36

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ 'యాత్ర' పేరిట మహి వి. రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజా సమాచారం. రాజశేఖర రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు రాజకీయ నాయకురాలి పాత్రను అనసూయ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించిన ఏ ఒక్క ముఖ్య సన్నివేశాన్నీ మహి మిస్ చేయడం లేదట. చిన్న రోల్ కోసం అనసూయ లాంటి పాపులర్ ఫిగర్‌ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ గ్రాండ్‌గా కనిపించాలని..

వైఎస్ఆర్ బయోపిక్ .. సబితగా సుహాసిని!

Submitted by arun on Fri, 06/15/2018 - 12:17

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథను యాత్ర' పేరుతో తెరపై ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. వైఎస్ఆర్ పాత్రలో ప్రముఖ మలయాళ హీరో మమ్ముట్టి కనిపించనున్నారు. ఆయన సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో ‘బాహుబలి’ ఫేం అశ్రితా వేముగంటి నటించనున్నారు. ఇక వైఎస్ వ్యక్తిగత సహాయకుడు సూరీడు పాత్రకు పోసాని కృష్ణమురళీని ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఈ బయోపిక్‌లోకి సీనియర్ నటి, దర్శకుడు మణిరత్నం భార్య సుహాసిని ప్రవేశించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి మహిళా హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాత్రను ఆమె పోషించనున్నారు.

వైఎస్ఆర్ బ‌యోపిక్‌లో భూమిక‌..!

Submitted by arun on Wed, 05/23/2018 - 13:39

ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌ర‌స‌న ఖుషీ చిత్రంలో న‌టించి మెప్పించిన అందాల హీరోయిన్ భూమిక‌. పెళ్లి త‌ర్వాత సినిమాల‌కి కాస్త దూర‌మైన భూమిక ఈ మ‌ధ్య రీ ఎంట్రీ ఇచ్చింది. నాని హీరోగా తెర‌కెక్కిన‌ ఎంసీఏ చిత్రంలో వ‌దిన పాత్ర‌లో న‌టించి అల‌రించింది. స‌మంత‌- ఆది పినిశెట్టి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న యూట‌ర్న్ చిత్రంలో న‌టిస్తుంది. అంతే కాదు దివంగ‌త సీఎం YSR బ‌యోపిక్‌లోను భూమిక న‌టిస్తోందనిస‌మాచారం. వైఎస్‌ కుమార్తె షర్మిళ పాత్రలో భూమిక నటించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి.
 

కేసీఆర్ , వైఎస్సార్ పై బయోపిక్ లు..వారి పాత్రల్ని పోషిస్తున్న నటులెవరు..?

Submitted by arun on Sat, 03/31/2018 - 14:08

వైఎస్ రాజశేఖర్ రెడ్డి, సీఎం కేసీఆర్...ఇద్దరూ రాజకీయ ఉద్దండులే. పొలిటికల్ లీడర్స్ గా...తెలుగు రాష్ట్రాలపై చేరగని ముద్ర వేశారు. కోట్లాది అభిమానులను సంపాదించుకున్నారు. ఇప్పడీ రియల్ పొలిటీషియన్స్ జీవిత కథ ఆధారంగా సినిమాలు రానున్నాయి. కేసీఆర్ బయోపిక్ కోసం..బాహుబలి రచయిత విజయేంద్ర ప్రసాద్...స్టోరీ రచిస్తున్నాడు.

వైఎస్సార్ బయోపిక్‌పై దర్శకుడు క్లారిటీ

Submitted by arun on Fri, 03/09/2018 - 11:02

‘ఆనందో బ్రహ్మా’ చిత్ర ద్వారా కమర్షియల్ హిట్ అందుకున్న దర్శకుడు మహి వి రాఘవ్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ తెరకెక్కనుందన్న విషయం తెలిసిందే. అలాగే ఈ సినిమాలో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించబోతున్నారని, అలాగే నయనతార మరో కీలక పాత్రలో నటిస్తున్నారని ఇటీవల వార్తలు హల్చల్ చేసిన విషయం తెలిసిందే.