Special Category Status

ఏపీ కోసం తెలంగాణ యువకుడు పోరాటం

Submitted by arun on Fri, 07/27/2018 - 16:46

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ ఢిల్లీలో ఓ యువకుడు టవరెక్కాడు. ఢిల్లీ మెట్రో భవన్ సమీపంలోని ఓ సెల్ టవర్ పై ఎక్కి నిరసనకు దిగాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్  చేస్తూ చేతిలో బ్యానర్  పట్టుకుని నినాదాలు చేస్తున్నాడు.  సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కిందికి దించే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం ఎక్కిన వ్యక్తి వరంగల్‌కు చెందిన ఉమేష్ రెడ్డిగా గుర్తించారు. అతనిని కిందికి దించేందుకు ఢిల్లీ పోలీసులు యత్నిస్తున్నారు. అయితే తాను కాంగ్రెస్ అభిమానిననీ..5 కోట్ల ఆంధ్రుల కోసం పోరాడుతున్నానని ఉహేష్ రెడ్డి చెబుతున్నాడు.

తొలి టర్మ్ లోనే ఎంపీగా జయదేవ్ కు అరుదైన అవకాశం

Submitted by arun on Fri, 07/20/2018 - 17:23

అశాస్త్రీయ, అప్రజాస్వామిక విభజనతో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పార్లమెంట్ సాక్షిగా ఎండగట్టారు. మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన తెలుగుదేశం పార్టీ తరపున జయదేవ్ చర్చను ప్రారంభించారు. రెండు జాతీయపార్టీలు కలసి ఏపీని నిలువునా ముంచాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని మోదీ ఆడిన మాట తప్పారంటూ దుయ్యబట్టారు.

ప్రత్యేక హోదా అంటే ఏమిటో నిర్వచించండి?

Submitted by arun on Fri, 07/20/2018 - 17:01

తెలంగాణ ప్రజలు బీజేపీని క్షమించరని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ అన్నారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా వినోద్ ఏపీలో కలిపిన ఏడు మండలాల గురించి ప్రస్తావించారు. మోడీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో విలీనం చేసిందని విమర్శించారు. ఏడు మండలాలను ఆంధ్ర ప్రదేశ్ లో కలపకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోనని చంద్రబాబు చెప్పారనీ ఆయన ఒత్తిడి వల్లే ప్రధాని మోడీ స్వయంగా చొరవ తీసుకుని ఆ ఏడు మండలాలను ఏపీలో విలీనం చేశారని గుర్తు చేశారు.

వైసీపీ ఎంపీల రాజీనామాలకు ఆమోదం...ఆసక్తికరంగా మారిన ఉపఎన్నికల అంశం

Submitted by arun on Fri, 06/22/2018 - 10:35

ఎట్టకేలకు వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. గత ఎప్రిల్‌లో చేసిన రాజీనామాలకు.. ఇప్పుడు రాజముద్ర పడింది. దీనికి సంబంధించిన బులిటెన్‌ను.. లోక్‌సభ స్పీకర్ కార్యాలయం విడుదల చేసింది. మరి వీరి రాజీనామాలతో ఖాళీ అయిన 5 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలకు అవకాశం ఉందా..? అసలు  ప్రజా ప్రాతినిద్య చట్టం ఏం చెబుతోంది..? 

బ్రేకింగ్ న్యూస్ః వైఎస్సార్‌సీపీ ఎంపీల రాజీనామాల ఆమోదం!

Submitted by arun on Wed, 06/06/2018 - 12:34

వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాల‌ను స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్ ఆమోదించారు. బుధ‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు స్పీక‌ర్ తో ఎంపీలు భేటీ అయ్యారు. రాజీనామాలు ఆమోదించాంటూ ఎంపీలు ప‌ట్టుబ‌ట్ట‌టంతో స్పీక‌ర్ రాజీనామాల‌ను ఆమోదించారు. స‌మావేశం త‌ర్వాత లోక్ స‌భ ఉన్న‌తాధికారుల‌తో స‌మావేశ‌మైన స్పీక‌ర్ త‌ర్వాత ఎంపీల రాజీనామాలు ఆమోదించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అదే విష‌యాన్ని ఐదుగురు ఎంపీల‌కు స‌మాచారం అందించిన‌ట్లు స‌మాచారం. మొత్తానికి వైసీపీ ఎంపిలు ప‌ట్టుబ‌ట్టి త‌మ రాజీనామాల‌ను స్పీక‌ర్ ద‌గ్గ‌ర ఆమోదింప‌చేసుకున్నారు. ఇందుకు అవ‌స‌ర‌మైన నోటిఫికేష‌న్ ను ఈరోజు సాయంత్రం పార్ల‌మెంటు ఉన్న‌తాధికారులు ప్ర‌క‌టించ‌నున్నారు.

వెనక్కు తగ్గేది లేదు...

Submitted by arun on Tue, 05/29/2018 - 12:54

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ను కలువనున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు స్పీకర్‌ను కలిసి తమ రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని కోరనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కంటే పదవులు ముఖ్యం కాదని వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఇప్పటికే స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా ఏప్రిల్‌ 6న స్పీకర్‌ ఫార్మాట్‌లో ఎంపీలు రాజీనామాలు చేశారు.

మరికొన్ని గంటల్లో తేలిపోనున్న వైసీపీ ఎంపీల రాజీనామాల వ్యవహారం

Submitted by arun on Tue, 05/29/2018 - 11:05

రాజీనామాల విషయంలో.. వైసీపీ ఎంపీలకు లోక్‌సభ స్పీకర్ ఆఫీస్ నుంచి పిలుపొచ్చింది. స్పీకర్ సుమిత్ర మహాజన్‌.. ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తారా.. లేదా.. అన్నది నేడు సాయంత్రానికి తేలిపోతుంది. మరి.. వైసీపీ ఎంపీలు రాజీనామాలను ఆమోదించాలని స్పీకర్‌పై  ఒత్తిడి తెస్తారా.. సైలెంట్‌గానే ఉంటారా.. అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

వైసీపీ ఎంపీల వ్యవహారం ఇప్పుడు తెరపైకి ఎందుకొచ్చింది?

Submitted by arun on Wed, 05/23/2018 - 10:15

కర్ణాటక రాజకీయ పరిణామాల తో వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారం మరో మారు తెర పైకి వచ్చింది. ఇద్దరు కర్ణాటక బీజేపీ ఎంపీల రాజీనామాలను వెంటనే ఆమోదించిన స్పీకర్... వైసీపీ ఎంపీల రాజీనామాలపై తాత్సారం చేస్తున్నారు. నెల రోజుల తర్వాత స్పీకర్ కార్యాలయం నుంచి  వైసీపీ ఎంపీలకు పిలుపు వచ్చింది. తమ రాజీనామాలపై వైసీపీ ఎంపీలు నిజంగానే సీరియస్ గా ఉన్నారా, స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోనున్నారు అనే దానిపై స్పెషల్ స్టోరీ.  

హోదా కోసం బాబు ధర్మ పోరాటం

Submitted by arun on Fri, 04/20/2018 - 10:40

ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తోందంటూ సీఎం చంద్రబాబు దీక్షకు దిగారు. తన పుట్టిన రోజున ధర్మపోరాట దీక్ష పేరిట నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో ధర్మపోరాట దీక్ష నిర్వహిస్తున్నారు.

హోదా పోరులో వైసీపీ దూకుడు...మరో సంచలన నిర్ణయం దిశగా జగన్‌‌

Submitted by arun on Thu, 04/19/2018 - 10:41

చంద్రబాబు దీక్ష నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. కృష్ణా జిల్లా పాదయాత్రలో ఉన్న వైఎస్ జగన్ పార్టీ ఎంపీలతో ఇవాళ భేటీ అయ్యారు. ఆగిరిపల్లి మండలం ఈదరలో జగన్‌తో పార్టీ ఎంపీలు సమావేశమయ్యారు. సీఎం దీక్షతో ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎంపీల రాజీనామాతో రాజకీయంగా కలిసొచ్చిందని భావిస్తున్న వైసీపీ.. ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే మరింత మైలేజ్ వస్తుందన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. 2019 ఎన్నికలలో హోదా అంశాన్నే ఎన్నికల ప్రచారాస్త్రంగా మలుచుకోవాలని వైసీపీ భావిస్తోంది.