lavanya tripati

‘ఇంటిలిజెంట్’ టాక్: తేజూ మళ్లీ దెబ్బకొట్టాడు!

Submitted by arun on Fri, 02/09/2018 - 12:50

హిట్టు కోసం చకోర పక్షిలా ఎదురుచూస్తున్నాడు సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్. వరుస ప్లాపులతో డీలా పడిపోయిన ఈ మెగా హీరో ఇంటెలిజెంట్ సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. వివి వినాయక్ డైరెక్షన్ లో సాయిధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఇంటిలిజెంట్ సినిమా ఈరోజు రిలీజ్ అయ్యింది.

జవాన్ ప్లాప్ తర్వాత సాయిధరమ్ తేజ్ ఇంటిలిజెంట్ పై చాలా హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఈసారి కూడా సుప్రీమ్ హీరో సోసో అనిపించాడు. యాక్టింగ్ లో బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినప్పటికీ..సన్నివేశాల్లో యాక్షన్ డోస్ మరీ ఎక్కువయ్యింది. లావణ్య త్రిపాఠి గ్లామర్ సినిమాకి హైలెట్ గా నిలుస్తుంది. 

విజ‌య్ దేవ‌ర‌కొండతో క‌న్న‌డ న‌టి

Submitted by nanireddy on Wed, 09/06/2017 - 19:36

'పెళ్లిచూపులు'తో సోలో హీరోగా తొలి విజ‌యం అందుకున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. తాజాగా విడుద‌లైన 'అర్జున్ రెడ్డి'తో సంచ‌ల‌న విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్నాడు. వివాదాల న‌డుమ విడుద‌లైన‌ప్ప‌టికీ.. సినిమాలోని బోల్డ్ కంటెంట్ యూత్‌ని బాగా  ఎట్రాక్ట్ చేసింది. త‌మిళంలోనూ, హిందీలోనూ ఈ సినిమా రీమేక్ అయ్యే అవ‌కాశం ఉంది.

లావ‌ణ్య‌కి ఈ సారైనా..

Submitted by nanireddy on Wed, 09/06/2017 - 10:35

లావ‌ణ్య త్రిపాఠికి ఈ ఏడాది ప్ర‌థ‌మార్థం అంత‌గా క‌లిసి రాలేదు. ఈ సంవ‌త్స‌రం ఆరంభంలో ఈ ముద్దుగుమ్మ న‌టించిన 'మిస్ట‌ర్‌', 'రాధ' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా ప‌డ్డాయి. ఈ రెండు చిత్రాల్లోనూ మ‌రో హీరోయిన్‌తో షేర్ స్క్రీన్ చేసుకున్న లావ‌ణ్య‌.. వారం గ్యాప్‌లో రానున్న రెండు కొత్త చిత్రాల్లో మాత్రం సోలో హీరోయిన్‌గా సంద‌డి చేయ‌నుంది. ఈ నెల 8న నాగ‌చైత‌న్య‌తో లావ‌ణ్య జోడీక‌ట్టిన 'యుద్ధం శ‌ర‌ణం' విడుద‌ల కానుండ‌గా.. 15న సందీప్ కిష‌న్‌కి జంట‌గా న‌టించిన 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఇద్ద‌రు హీరోయిన్స్‌లో ఒక‌రిగా న‌టించిన సంద‌ర్భంలో లావ‌ణ్య‌కి ద‌క్క‌ని విజ‌యం.. సోలో హీరోయిన్‌గానైనా ద‌క్కుతుందా?