Telangana Bhavan

టీఆర్‌ఎస్‌లో సీట్ల లొల్లి...తెలంగాణ భవన్‌ ఎదుట నిరసనల హోరు

Submitted by arun on Mon, 11/12/2018 - 15:09

ఆందోళనలు.. నిరసనలు..  నినాదాలు.. గొడవలు.. ఎన్నికల వేళ తెలంగాణలో ఏ పార్టీ కార్యాలయం చూసినా.. ఇవే సీన్లు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీల వరకు.. అన్ని ఆఫీస్‌లు తాళాలతో దర్శనమిస్తున్నాయి. ఆశావహుల హంగామాతో సినిమా సీన్లు కనిపిస్తున్నాయి. కూటమి పార్టీలింకా అభ్యర్థులను ప్రకటించకున్నా.. తమకెక్కడ టిక్కెట్‌ రాదో అని నిరసనలతో హోరెత్తిస్తున్నారు. తమకే టిక్కెట్‌ కేటాయించాలంటూ ఆందోళనలతో తామేంటో చూపిస్తున్నారు. టీఆర్ఎస్‌ లో కూడా అసమ్మతి జ్వాల రేగింది. తెలంగాణ భవన్‌ ముందు ఆశావహులు.. ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు.

కాసేపట్లో టీఆర్ఎస్‌ పాక్షిక మేనిఫెస్టో..

Submitted by arun on Tue, 10/16/2018 - 17:08

ఎన్నికల మేనిఫెస్టోపై టీఆర్ఎస్‌ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలు దఫాలు సమావేశమైన కమిటీ కేసీఆర్‌ సమక్షంలో మరోసారి భేటీ అయ్యింది. తెలంగాణభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో ఎన్నికల ప్రణాళికకు తుదిమెరుగులు దిద్దుతున్నారు. సమావేశం అనంతరం పాక్షిక మ్యానిఫెస్టోను కేసీఆర్‌ స్వయంగా ప్రకటించనున్నారు. ఇప్పటివరకు ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలు, విజ్ఞప్తులపై మేనిఫెస్టో కమిటీ సమావేశంలో చర్చించారు. ఇప్పటికే ప్రచారంలో దూసుకెళ్తున్న టీఆర్ఎస్‌ అభ్యర్థులు, టీఆర్‌ఎస్ హామీలను వెంటనే ప్రజల్లోకితీసుకువెళ్లాలని నాయకత్వం యోచిస్తున్నది.

కాసేపట్లో అభ్యర్థుల తొలి జాబితా

Submitted by arun on Thu, 09/06/2018 - 14:50

తెలంగాణ తొలి అసెంబ్లీ రద్దు అయిన నేపథ్యంలో మరికాసేపట్లో తెలంగాణ భవన్‌లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియా సమావేశం నిర్వహించనున్నారు. గన్ పార్క్ వద్ద అమరులకు నివాళులు అర్పించిన అనంతరం.. తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ జరిగే ప్రెస్ మీట్‌లో అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించనున్నట్టు సమాచారం. ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌కు రావాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. తెలంగాణ భవన్‌లో మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమై తదుపరి వ్యూహంపై చర్చిస్తున్నారు.

టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ప్రారంభం

Submitted by arun on Mon, 08/13/2018 - 17:12

వచ్చే ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసే లక్ష్యంగా కేసీఆర్‌ పార్టీ రాష్ట్రకార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నారు. కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగుతోంది. పార్టీ నిర్వహించిన సర్వే ఫలితాల ఆధారంగా ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేయడంతో పాటు పార్టీ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాల నిర్వహణ, విస్తృత స్థాయి ప్రచారం లక్ష్యంగా ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ముందస్తు అయినా, గడువు మేరకు అయినా ఎన్నికలెప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ నేతలకు కేసీఆర్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

ప్రోఫెసర్ జయశంకర్ సేవలను స్మరించుకున్న టీఆర్ఎస్ నేతలు

Submitted by arun on Thu, 06/21/2018 - 14:02

బంగారు తెలంగాణ కల సాకరమవుతున్న సమయంలో  ప్రోఫెసర్ జయశంకర్ లేకపోవడం  బాధకరమన్నారు మంత్రి కేటీఆర్‌. జయశంకర్ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్‌లో నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు.  జయశంకర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా  ఉద్యమ సమయంలో జరిగిన పరిణామాలను గుర్తు చేసుకున్నారు.    నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్న కేటీఆర్‌ .. శరవేగంగా ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్లు అందిస్తున్నామన్నారు.  ఉపాధి అవకాశాలు, నియమాకాలు తెలంగాణ ప్రజలకే దక్కుతున్నాయన్నారు.  

‘తెలంగాణ భవన్ ను పేల్చేస్తాం’

Submitted by lakshman on Sat, 03/03/2018 - 20:18

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ను పేల్చేస్తామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. సరదాగానో.. లేదంటే టీఆర్ఎస్ పై కోపంతోనో తెలియదు కానీ.. అతడు కాస్త సీరియస్ గానే వార్నింగ్ ఇచ్చినట్టున్నాడు. దీంతో.. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. భద్రతా సిబ్బంది.. తెలంగాణ భవన్ కు దారి తీసే అన్ని మార్గాల్లోనే భద్రత కట్టుదిట్టం చేశారు.