paisa vasool

కుంభ‌కోణం షెడ్యూల్ పూర్తిచేసిన బాల‌య్య‌

Submitted by nanireddy on Mon, 09/25/2017 - 17:33

'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' చిత్రంతో వంద చిత్రాల మైలురాయికి చేరుకున్నారు నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఆ త‌రువాత‌ 'పైసావ‌సూల్‌'తో మ‌రోసారి అభిమానుల ముందుకొచ్చారాయ‌న‌. ఇటీవ‌లే విడుద‌లైన ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బాల‌య్య త‌న 102వ చిత్రంతో బిజీగా ఉన్నారు. సీనియ‌ర్ త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నెల‌ రోజులుగా కుంభ‌కోణంలో షూటింగ్ జ‌రుపుకుంటోంది. నేటితో ఆ భారీ షెడ్యూల్ పూర్త‌య్యింది.

పైసా వ‌సూల్ రివ్యూ

Submitted by lakshman on Sun, 09/17/2017 - 20:14
నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో 100 సినిమాలు పూర్తి చేసి శతచిత్ర నటుడయ్యాడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన 'గౌతమిపుత్ర శాతకర్ణి' నటుడిగా బాలకృష్ణకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా తర్వాత 101వ చిత్రంగా పూరి జగన్నాథ్‌ తెరకెక్కించిన...

తార‌క్ కి ఓకే.. బాల‌య్య‌కి నాట్ ఓకే..

Submitted by nanireddy on Mon, 09/04/2017 - 11:42

ఒక‌రికి వ‌ర్క‌వుట్ అయ్యే విష‌యాలు మ‌రొక‌రికి క‌లిసి రాక‌పోవ‌చ్చు. అచ్చంగా ఇలాగే.. అబ్బాయ్‌ ఎన్టీఆర్‌కి క‌లిసొచ్చిన ఓ విష‌యం.. బాబాయ్ బాల‌కృష్ణ‌కి అంత‌గా క‌లిసి రాలేదు. అదేమిటంటే.. విడుద‌ల తేది. గ‌తేడాది తార‌క్ హీరోగా వ‌చ్చిన 'జ‌న‌తా గ్యారేజ్' సెప్టెంబ‌ర్ 1న రిలీజైంది. మొద‌ట ఈ సినిమాకి మిశ్ర‌మ స్పంద‌న వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఆఖ‌రికి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల జాబితాలోకి చేరింది. క‌ట్ చేస్తే.. మ‌ళ్లీ అదే సెప్టెంబ‌ర్ 1న ఈ సంవ‌త్స‌రం బాల‌కృష్ణ న‌టించిన 'పైసా వ‌సూల్' సినిమా రిలీజైంది. ఈ సినిమాకి కూడా డివైడ్ టాక్ వ‌చ్చింది. అయితే 'జ‌న‌తా గ్యారేజ్‌'లా బాక్సాఫీస్ వ‌ద్ద మ్యాజిక్ చేయ‌లేక‌పోయింది.

'పైసావ‌సూల్‌'తో బ్రేక్ ప‌డుతుందా?

Submitted by nanireddy on Thu, 08/31/2017 - 19:49

మ‌హాన‌టుడు స్వ‌ర్గీయ ఎన్టీఆర్ సినిమా టైటిల్స్‌ని మ‌రోసారి త‌న సినిమాల‌కు వాడుకుని, అలాగే ఆ మ‌హాన‌టుడి సినిమాల‌ను రీమేక్ చేసి కూడా బాల‌య్య‌ చెప్పుకోద‌గ్గ విజ‌యాలు అందుకున్న సంద‌ర్భాలున్నాయి. అయితే ఎటొచ్చి.. ఆయ‌న‌ పాట‌ల‌ను రీమిక్స్ చేసి విజ‌యం అందుకున్న సంద‌ర్భాలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు లేవు బాల‌య్య‌కి.