Amaravati

ఏపీకి మరో ఐటీ కంపెనీ

Submitted by arun on Mon, 10/08/2018 - 10:50

నవ్యాంధ్రకు మరో ప్రతిష్ఠాత్మక ఐటీ కంపెనీ వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలకు ఐటీ సేవలు అందిస్తున్న దిగ్గజ సంస్థ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ గన్నవరం సమీపంలోని కేసరపల్లిలో మొదటి పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఐటీ మంత్రి నారా లోకేశ్ ఈ మధ్యహ్నం మూడు గంటలకు భూమి పూజ నిర్వహించనున్నారు. హెచ్‌సీఎల్ అధినేత శివ్‌నాడార్ కుమార్తె, సంస్థ సీఈవో రోషిని నాడార్‌ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

తిరుమల సంప్రోక్షణ వివాదంపై స్పందించిన సీఎం చంద్రబాబు

Submitted by arun on Tue, 07/17/2018 - 10:04

తిరుమల పుణ్యక్షేత్రంలో మహా సంప్రోక్షణ వివాదంపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఆగమ శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు నిర్వహించాలని టీటీడీ, సీఎంవో అధికారులను సీఎం ఆదేశించారు. సంప్రోక్షణ సమయంలోనూ భక్తులకు దర్శనానికి అనుమతి ఇవ్వాలని, గతంలో మహా సంప్రోక్షణ సమయంలో పాటించిన నిబంధనలను అనుసరించాలని ఆయన సూచించారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా, పూజాది కార్యక్రమాలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 

నేడు ఏపీ కేబినెట్ భేటీ...10లక్షల మందికి నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్లాన్

Submitted by arun on Fri, 07/06/2018 - 10:34

విభజన హామీల అమలుపై కేంద్రం తీరును నిరసిస్తూ ఈరోజు ఏపీ కేబినెట్‌ తీర్మానం చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వలేమంటూ సుప్రీంలో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్‌‌కు కౌంటర్‌ వేయడంపై కీలకం నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న నిరుద్యోగ భృతి విధివిధానాలకు ఆమోదముద్ర వేయనున్నారు. అలాగే విశాఖ మెట్రోరైల్‌, అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం, గ్రామదర్శి ప్రోగ్రామ్‌పై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. 

ఎంపీ మాటలను కట్ అండ్ పేస్ట్ చేశారు: చంద్రబాబు

Submitted by arun on Fri, 06/29/2018 - 12:43

టీడీపీ ఎంపీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు పడితే వారు.. ఏది పడితే అది మాట్లాడకూడదని హెచ్చరించారు. ధర్మపోరాటంపై కుట్రలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని.. కొందరు తప్పుడు వీడియో క్లిప్పింగులు తీస్తున్నారని చెప్పారు. టీడీపీ ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడిన చంద్రబాబు.. సరదాగా కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్నారు. వీడియోను ఎవరు తీశారు.. ఎందుకు ప్రసారం చేశారన్న దానిపై విచారణ చేయిస్తామన్నారు. 

ఐకానిక్‌ టవర్‌ నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన

Submitted by arun on Fri, 06/22/2018 - 12:30

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో అత్యంత కీలకంగా భావిస్తున్న ఐకానిక్ టవర్ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్ధాపన చేశారు. ఏపీ ఎన్‌ఆర్టీ సొసైటీ ఆధ్వర్యంలో  ఐదు ఎకరాల విస్తీర్ణంలో 36 అంతస్తుల భవనాలను 500 కోట్ల వ్యయంతో 158 మీటర్ల మేర నిర్మించనున్నారు.  రాయపూడిలోని ప్రభుత్వ భవనాల సముదాయానికి చేరువలో ఐకానిక్‌ టవర్‌ నిర్మాణం ద్వారా ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుంది.    ఈ టవర్‌ను ఏ ఆకారంలో  అత్యాధునికమైన సౌకర్యాలతో  ఆహ్లాదకరమైన వసతులతో నిర్మించనున్నారు. భూగోళం రూపంలో తిరిగే రెస్టారెంట్‌  ఐకానిక్‌ టవర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఖరారు

Submitted by arun on Thu, 05/31/2018 - 11:26

రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో  వాటిని ఖరారు చేస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే ఉన్నాయి. దీంతో కొత్తగా రాష్ట్ర చిహ్నాలను ప్రకటించింది ఏపీ సర్కార్. 

మరో పోరాటానికి తెరతీసిన టీడీపీ

Submitted by arun on Fri, 04/06/2018 - 14:52

తెలుగు ప్రజలతో పెట్టుకుంటే ఖబడ్దార్ అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీని బలహీన పరచడానికి కేంద్రం ప్రయత్నిస్తోందని బాబు ఆరోపించారు. బీజేపీ ప్రయత్నాలు ఎప్పటికి సఫలం కావన్ని ప్రధాని మోడీకి పరోక్షంగా సైకిల్ తొక్కి వార్నింగ్ ఇచ్చారు. విభజన ద్వారా ఏపీకి తీవ్రనష్టం కలిగించిన కాంగ్రెస్‌ పార్టీ నేడు రాష్ట్రంలో నామరూపాలు లేకుండా పోయిందని గుర్తు చేశారు. బీజేపీకి అదే పరిస్థితి తప్పదని హెచ్చరించారు. 

మాల్యాకు ఓ న్యాయం..విజయసాయికి మరో న్యాయమా..?: చంద్రబాబు

Submitted by arun on Sun, 03/25/2018 - 17:11

కేంద్రంపై చంద్రబాబు నాయుడు ధిక్కార స్వరాన్ని మరింత పెంచారు. అన్ని వ్యవస్థలను కేంద్రం భ్రష్టు పట్టించిందని ఘాటు విమర్శలు చేశారు. తనపై, తన ప్రభుత్వంపై కేసులు పెట్టే ముందు అమిత్‌ షా కొడుకు జయ్ షా అవినీతి సంగతి తేల్చాలని డిమాండ్‌ చేశారు. అక్కడితో ఆగని చంద్రబాబు విజయ్ మాల్యాకు ఓ న్యాయం విజయసాయిరెడ్డికి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. 

ముగిసిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ

Submitted by arun on Fri, 03/02/2018 - 16:42

అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విభజన హామీల సాధన డిమాండ్‌తో పార్లమెంటును స్తంభింపచేయాలని నిర్ణయించారు. విభజన హామీలు అమలయ్యే వరకు ఆందోళన కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. పోరు ఉధృతం చేయాలని నిర్ణయించారు. పైగ పార్లమెంటులో దశల వారీగా పోరు ముమ్మరం చేయాలని ఇందుకు ఇతర పార్టీల సాయం తీసుకోవాలని కూడా నిర్ణయించినట్లు ఎంపీ కొనకళ్ళ నారాయణ చెప్పారు. ఏపీకి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. అటు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటామని ఎంపీ కేశినేని నాని తెలిపారు.  

ఎక్కడా రాజీ పడే ప్రసక్తే లేదు: బుట్టా రేణుక

Submitted by arun on Fri, 03/02/2018 - 14:26

ప్రత్యేక హోదాతో సమానమైన ప్యాకేజీ ఇస్తామని గతంలో కేంద్రమే చెప్పిందని ఎంపీ బుట్టా రేణుక అన్నారు. అదే హామీని ఇప్పుడు అమలు చేయాలని కోరుతున్నామని, రాష్ట్ర హక్కుల సాధన విషయంలో రాజీ పడే ప్రసక్తేలేదని ఆమె స్పష్టం చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందనే ఆశతో గత నాలుగేళ్లుగా ఎదురు చూశామని కానీ, ఏమీ రాలేదని అన్నారు. అన్నీ ఇస్తామని కేంద్ర ఆర్థకమంత్రి జైట్లీ ప్రకటన చేశారని ఆ తర్వాత మొండి చేయి చూపించారని మండిపడ్డారు. చివరి బడ్జెట్ లో కూడా ఏపీకి సంబంధించి ఎలాంటి ప్రత్యేక ప్రకటన రాకపోవడంతో ఆందోళన చేస్తున్నామని చెప్పారు.