Jacqueline fernandez

శ్రీదేవి అంత్యక్రియల్లో నవ్వులా ?

Submitted by arun on Fri, 03/02/2018 - 12:08

అందాలనటి శ్రీదేవి మ‌ర‌ణ వార్త బాలీవుడ్‌నే కాదు.. యావ‌త్ దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల‌తోపాటు సినీ సెల‌బ్రిటీలు సైతం శ్రీదేవి మ‌ర‌ణ‌వార్త‌ను జీర్ణించుకోలేక‌పోయారు. శ్రీదేవి మృత‌దేహం భార‌త్‌కు రాగానే నివాళుల‌ర్పించేందుకు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్ నుంచి ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు ముంబై త‌ర‌లి వెళ్లారు. సుస్మితాసేన్‌, అమితాబ్‌, శ్ర‌ద్ధా క‌పూర్ వంటి నటులు శ్రీదేవి భౌతిక కాయాన్ని చూసి విల‌పించారు. అయితే శ్రీదేవికి నివాళుల‌ర్పించ‌డానికి వ‌చ్చిన ఓ హీరోయిన్ మాత్రం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. దానికి అక్క‌డ ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరే కార‌ణం.