nagababu

పవన్‌పై జగన్ వ్యాఖ్యల పట్ల స్పందించిన నాగబాబు

Submitted by arun on Fri, 07/27/2018 - 15:52

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయడంపై నాగబాబు ఓ టీవీ ఇంటర్వ్యూలో స్పందించారు. ఓ పార్టీ అధినేతగా కొంత సంయమనం పాటించాల్సి ఉంటుందని అన్నారు. పార్టీలో మిగతా వారు నోటికి వచ్చినట్లు మాట్లాడినా, అర్థం లేకుండా మాట్లాడినా ఇబ్బంది లేదని, కానీ పార్టీ అధినేత నోరు జారవద్దని, జాగ్రత్తగా ఉండాలని (జాగ్రత్తగా మాట్లాడాలని) అన్నారు. జగన్ మాట జారారని చెప్పారు. సరైన అవగాహన లేకుండా మాట్లాడారన్నారు. రాజకీయంగా తన సోదరుడిని ఎదుర్కొనే దమ్ము లేకపోవడంతోనే  వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆయన ఆరోపించారు.

నాగబాబుకి కత్తిమహేష్ సీరియస్ వార్నింగ్...మీ ఫ్యామిలీ గురించి నేను మాట్లాడితే తట్టుకోలేరు

Submitted by arun on Fri, 07/06/2018 - 10:44

సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ శ్రీ రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసి కేసులను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే కత్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కొందరు డిమాండ్‌ చేశారు. వారిలో మెగా బ్రదర్‌ నాగబాబు ఒకరు. దీంతో నాగబాబు, మెగా ఫ్యామిలీపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కత్తి మహేశ్‌ ఓ వీడియో పోస్ట్‌ చేశారు. తన ఫేస్ బుక్ ఖాతాలో ఈ మేరకు ఓ వీడియోను పోస్టు చేసిన కత్తి, నాగబాబును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించాడు. తన పేరు చెప్పకుండా, తనను నీచుడిగా సంబోధించిన వీడియోను తాను చూశానని, దాన్ని చూసిన తరువాత తనకు జాలి కలిగిందని అన్నాడు. తాను ఎందుకు నీచుడినో చెప్పాలని ప్రశ్నించాడు.

జానారెడ్డి, నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన కత్తి మహేశ్‌

Submitted by arun on Wed, 07/04/2018 - 15:12

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, మెగా హీరో నాగబాబు వ్యాఖ్యలపై కత్తి మహేశ్‌ స్పందించారు. హెచ్‌ఎంటీవీతో మాట్లాడిన కత్తి మహేశ్‌... రామాయణంపై తనకు తెలిసిన విశ్లేషణను, అభిప్రాయాన్ని మాత్రమే చెప్పానన్నారు. రాముడిని నమ్ముతున్న వారిని కించర్చే విధంగా తన వ్యాఖ్యలు లేవని హెచ్ఎంటీవీతో మాట్లాడిన కత్తి మహేశ్‌ స్పష్టం చేశారు.
 

కత్తి మహేష్ ను వదిలే ప్రసక్తే లేదు: నాగబాబు వార్నింగ్

Submitted by arun on Wed, 07/04/2018 - 12:37

రాముడి గురించి తప్పుగా మాట్లాడి హిందువుల మనోభావాలను దెబ్బతీసిన కత్తి మహేష్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని మెగా బ్రదర్ నాగబాబు డిమాండ్ చేశారు. మత విశ్వాసాలను కించపరిచేలా మట్లాడితే, హిందువులు ఊరుకోరని నాగబాబు హెచ్చరించారు. రామాయణం ఒక పుస్తకం కాదని, హిందువులు ఆరాధించే చరిత్ర అని తెలిపారు. క్రైస్తవులకు బైబిల్, ముస్లింలకు ఖురాన్ ఎలాగో హిందువులకు రామాయణం, మహాభారతం కూడా అలాంటివేనని పేర్కొన్నారు. నాస్తికత్వం పేరుతో మత విశ్వాసాలను తప్పుబడుతూ మాట్లాడితే ఊరుకోం. హిందూ మతవిశ్వాసాలపై ప్లాన్ ప్రకారం దాడి చేస్తున్నారు. మతపరమైన చర్యలను ఎవరూ ప్రోత్సహించకండి'' అంటూ సూచించారు.

ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర ఉద్రిక్తత

Submitted by arun on Fri, 04/20/2018 - 13:52

హైదరాబాద్‌ ఫిల్మ్‌నగర్‌లోని ఫిల్మ్‌ ఛాంబర్‌‌ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పవన్‌ పిలుపుతో పెద్దఎత్తున ఫిల్మ్‌ ఛాంబర్‌‌కి చేరుకున్న జనసేన కార్యకర్తలు, మెగా పవన్‌‌ అభిమానులు ఆందోళనకు దిగారు. పవన్‌‌కి మద్దతుగా ఫిల్మ్‌ ఛాంబర్‌‌ను ముట్టడించిన ఫ్యాన్స్‌‌ వర్మకి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. పవన్‌ కోసం ప్రాణాలైనా అర్పిస్తామంటున్న అభిమానులు వర్మకి తగిన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్‌ ఇచ్చారు.

త్వరలోనే వీళ్లందరి దూల పవన్‌ తీర్చుతాడు : నాగబాబు

Submitted by arun on Wed, 04/18/2018 - 13:05

సెలైంట్‌గా ఉన్నామ్‌ కదా అని.... ఏం మాట్లాడినా పడతామనుకోవద్దని వార్నింగ్‌ ఇచ్చారు నాగబాబు. తమ జోలికి రావొద్దంటూ ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. సాఫ్ట్‌ టార్గెట్‌ అనుకొని మెగా ఫ్యామిలీ మెంబర్స్‌పై రాళ్లు వేయొద్దన్న నాగబాబు తమ సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. ఇకపై ఎలా రియాక్ట్‌ అవుతామో తెలియదన్నారు. తమ సహనాన్ని ఓర్పుని చేతగానితనంగా తీసుకోవద్దన్నారు. తన హెచ్చరికల్ని అంత ఈజీగా తీసుకోవద్దన్నారు. తల్లిని అంటే ఎవరైనా భరిస్తారా? అంటూ ఆవేదన వ్యక్తంచేసిన నాగబాబు ఆడపిల్ల కాబట్టే వదిలేశామన్నారు.

శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టింది: నాగబాబు

Submitted by arun on Wed, 04/18/2018 - 12:03

సినీనటి శ్రీరెడ్డి పోరాట విషయం పక్కదారి పట్టిందని సినీనటుడు నాగబాబు అన్నారు. ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… కొద్ది రోజులుగా శ్రీరెడ్డి వ్యవహారాన్ని పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే శ్రీరెడ్డి పోరాటం పక్కదారి పట్టిందని ఆయన అన్నారు. పేమెంట్స్‌, ఇతర విషయాల్లో సమస్యలు వస్తే పరిష్కరిస్తుందే తప్ప... సినిమాల్లో అందరికీ 'మా' అవకాశాలు ఇప్పించలేదని వివరించారు. 'మా' సభ్యత్వం కావాలంటే రూ. లక్ష చెల్లించాల్సిందే అని స్పష్టం చేశారు. సీనియర్‌ నటులకు మాత్రమే గౌరవ సభ్యత్వం ఇస్తామని చెప్పుకొచ్చారు.

నాగ‌బాబు రుణం తీర్చుకున్నాడు

Submitted by lakshman on Fri, 03/02/2018 - 10:39

మెగా కంపౌండ్ నుంచి ఓ వార్త సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తుంది. . త‌న త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు నాగ‌బాబుకు ఉన్న అప్పును తీర్చిన‌ట్లు తెలుస్తోంది.  గ‌తంలో నాగ‌బాబు నిర్మాత‌గా  రాంచ‌రణ్ - జెనీలియా హీరోహీరోయిన్లుగా తెర‌కెక్కిన చిత్రం ఆరెంజ్. ఈ చిత్రం చ‌క్క‌టి రొమాంటిక్ ల‌వ్ అండ్ ఎంట‌ర్ టైన్మెంట్ గా తెర‌కెక్కింది. అయితే  బాక్సాఫిస్ వ‌ద్ద అనుకున్నంత విజ‌యాన్ని అందుకోలేక‌పోయింది.