moon

చంద్రునిపై నీరు

Submitted by arun on Thu, 08/23/2018 - 16:03

భూమి మీది నీరు ఎన్నో జీవులకి ప్రాణాధారం, అయితే చంద్రుడి పైన కూడా నీరు వుందా లేదా అనే విషయాన్ని కనిపెట్టింది కూడా భారత దేశ టెక్నోలజి మాత్రమే. సెప్టెంబరు 2009 లో భారతదేశం యొక్క ఇస్రో చంద్రయాన్ -1 దాని మూన్ మినరలాజి మాపెర్ ను ఉపయోగించి మొదటిసారిగా చంద్రునిపై నీరు వుంది అనే విషయాన్ని కనిపెట్టింది. శ్రీ.కో.
 

Tags

చంద్రుడిపై స్థలం కొన్న హీరో.. ఎకరం రూ.2,300 మాత్రమే

Submitted by arun on Fri, 06/29/2018 - 13:09

భూమిపై స్థలాల ధరలకు రెక్కాలొచ్చాయి. కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. నిత్యావసర వస్తువులు కొండెక్కి కూర్చోంటున్నాయి. ఒకవేళ తక్కువ రేట్లకు స్థలాలు దొరికితే కొనేవాళ్ళ క్యూ  చాలా ఉంటుంది. కాగా ఓచోట కేవలం రూ. 2,300 వేలతో ఎకరం భూమి లభిస్తోంది. ఏంటీ రూ.2,300లకే ఎకరం స్థలమా.. అని ఆశ్చర్యపోతున్నారు కదూ. ఇది నిజం...కానీ పై రేటుకే ఎకరం జాగా లభిస్తోంది. ఎక్కడో తెలుసా.. చంద్రునిపై...ఓ యంగ్ హీరో. ఈ రికార్డును కైవసం చేసుకున్న ఆ హీరో ‘ ఎంఎస్. ధోని’ సినిమా ఫేం సుశాంత్ సింగ్ రాజ్‌పుత్. అక్కడ మూడు ఎకరాల స్థలం కొన్నాడు. లూనా సొసైటీ ఇంటర్నేషనల్‌ సంస్థ ద్వారా స్థలం కొన్నట్లు స్వయంగా తెలిపాడు.

చంద్రుడిపై 4జీ నెట్ వర్క్

Submitted by arun on Thu, 03/01/2018 - 11:55

చందమామ కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయోగాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఒకవైపు మనదేశం చంద్రయాన్-2 పేరుతో చంద్రునిపై రోవర్ ను దించే పనిలో ఉంటే.. మరోవైపు ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఏకంగా అక్కడ 4జీ నెట్వర్క్ ఏర్పాటు చేసేందుకు రెడీ అయింది.

చంద్రుడిపై తొలిసారిగా 4జీ నెట్వర్క్ ఏర్పాటుకానుంది. వొడాఫోన్ - నోకియా భాగస్వామ్యంతో జరుగుతున్న ఈ బృహత్ కార్యంలో ఆడి సంస్థ కూడా చేయి కలుపుతోంది. ఈ ప్రయోగం విజయవంతం అయితే అద్భుతాలే సృష్టించవచ్చంటున్నారు అంతరిక్ష నిపుణులు.