N Chandrababu Naidu

ఏపీకి షాకిచ్చిన గడ్కరి

Submitted by arun on Thu, 07/12/2018 - 10:36

పోలవరం ప్రాజెక్టు డీపీఆర్‌పై కేంద్రమంత్రి గడ్కరి రాష్ట్రప్రభుత్వానికి షాకిచ్చారు. అసలు ప్రాజెక్టు వ్యయం ఎందుకు పెరిగిందో డీపీఆర్ ఎందుకు మార్చాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని కోరారు. ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన పనుల పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సరైన పత్రాలను సమర్పిస్తేనే నిధుల విషయంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలుపుతుందన్న ఆయన గడువులోగా ప్రాజెక్టును పూర్తి చేయడానికి కట్టుబడి ఉన్నామన్నారు. 

ఢిల్లీ వేదికగా చంద్రబాబు హోదా పోరు

Submitted by arun on Mon, 04/02/2018 - 11:10

ఢిల్లీ వేదికగా చంద్రబాబే స్వయంగా హోదా పోరు మొదలుపెట్టనున్నారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేడమే లక్ష్యంగా హస్తిన బాటపడుతున్నారు. ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు రేపు, ఎల్లుండి ఆయా పార్టీల నేతలను కలవనున్నారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్లో వివిధ పార్టీల సభాపక్ష నేతలను కలిసి ఆంధ్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయాన్ని వివరించనున్నారు. 

టీఆర్‌ఎస్‌తో పొత్తుకు చంద్రబాబు సంకేతాలు

Submitted by arun on Thu, 03/01/2018 - 10:34

తెలంగాణ టీడీపీ భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై నేతలుకు దిశానిర్దేశం చేసిన బాబు తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేద్దామన్నారు. అయితే తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలంటే పొత్తు అనివార్యమన్న చంద్రబాబు సమయం వచ్చినప్పుడు పొత్తుల గురించి ఆలోచిద్దామన్నారు. అంతేకాదు కార్యకర్తల అభిప్రాయం మేరకే పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని నేతలకు స్పష్టంచేశారు. అయితే తెలంగాణలో టీడీపీతో పొత్తు బీజేపీ వద్దనుకుందన్న చంద్రబాబు ఉన్న పార్టీల్లో ఏదో ఒకదానితో వెళ్దామంటూ సంకేతాలు ఇచ్చారు. మరోవైపు మోత్కుపల్లి విలీనం వ్యాఖ్యలపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.