sridevi dead body

దుబాయ్ హోట‌ల్లో శ్రీదేవి ఎందుకు మ‌ర‌ణించిందంటే

Submitted by lakshman on Mon, 03/12/2018 - 00:23

అతిలోక సుందరి శ్రీదేవి హఠాన్మరణానికి కారణం ఏంటి.? కనిపించడానికి అత్యంత అందంగా.. అత్యంత ఆరోగ్యంగా ఉన్న శ్రీదేవి ఎలా చనిపోయింది..? ఎందుకు చనిపోవాల్సి వచ్చింది..? ఇలాంటి ప్ర‌శ్న‌ల‌న్నీ ఆమె మ‌ర‌ణించిన త‌రువాత ఉత్ప‌న్న‌మ‌య్యాయి. అంతేకాదు ఆమె అందం కోసం తీసుకున్న అతి జాగ్ర‌త్త‌ల వ‌ల్ల ప్రాణాలు పోయాయ‌ని వార్త‌లు వ‌చ్చాయి. 

రామేశ్వరంలో కలిసిపోనున్న శ్రీదేవి…!

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:50

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయినా.. ఆమె అందం మాత్రం ఇంకా మనల్ని విడిచిపెట్టడం లేదు. శ్రీదేవి బతికే ఉందేమో.. నిన్నటివరకూ జరిగింది కలేనేమో .. అని అనుకునే వాళ్లు కూడా ఇంకా ఉన్నారంటే.. ఎంత మాత్రం అతిశయోక్తి కానేకాదు. అంతగా తన అందంతో సమ్మోహనం చేసిన శ్రీదేవి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా జరిపించిన కుటుంబం.. ఇప్పుడు అస్తికలను కూడా సంప్రదాయం ప్రకారం రామేశ్వరంలో కలిపేందుకు ఆమె కుటుంబం నిర్ణయించింది.

విల‌పిస్తున్న ముంబై న‌గ‌రం

Submitted by lakshman on Wed, 02/28/2018 - 01:16

లేడి సూప‌ర్ స్టార్ శ్రీదేవి మ‌ర‌ణంపై మిస్ట‌రీ వీడింది. 70గంట‌ల పాటు జ‌రిగిన క్ష‌ణ క్ష‌ణం ఉత్కంఠ‌త‌లో శ్రీదేవి బాత్ ట‌బ్ లో ప‌డిపోవ‌డం వ‌ల్ల మృతి చెందార‌ని ఫారెన్సిక్ రిపోర్టును ప్రాసిక్యూష‌న్ ఏకీభ‌వించింది. బాత్ ట‌బ్ లో చ‌నిపోవ‌డంలో శ్రీదేవి మ‌ర‌ణించింద‌ని తేల్చి చెప్పింది .దీంతో అనుమానాలకు తెరదించుతూ శ్రీదేవి భౌతిక కాయాన్ని ఆమె బంధువ‌ల‌కు అప్ప‌గించారు. 

దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌కి శ్రీదేవి భౌతికకాయం

Submitted by arun on Tue, 02/27/2018 - 17:14

శ్రీదేవి మృతదేహానికి ఎంబామింగ్ ప్రక్రియ ముగిసింది. అనంతరం ఆమె భౌతికకాయంతో బోనీ కపూర్‌, ఇతర కుటుంబీకులు దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. ఎయిర్‌పోర్ట్‌లో ఇతర ప్రక్రియలు పూర్తైన అనంతరం విమానం బయలుదేరుతుంది. ప్రత్యేక ఛార్టర్డ్‌ విమానంలో భౌతికకాయాన్ని ముంబయికి తరలించనున్నారు. రాత్రి 9 గంటల  తర్వాత శ్రీదేవి భౌతికకాయం ముంబై చేరుకునే అవకాశం ఉంది. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు ముంబైలో శ్రీదేవి అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది. అభిమానుల సందర్శనార్థం ఉదయం 11 గంటల వరకు.. శ్రీదేవి స్వగృహం భాగ్యబంగ్లాలో ఆమె భౌతికకాయాన్ని ఉంచనున్నారు.
 

ఎంబామింగ్ అంటే ఏమిటి అది ఎలా చేస్తారు?!

Submitted by arun on Tue, 02/27/2018 - 16:23

ఆత్మీయులు మరణించినప్పుడు వారి మృతదేహాన్ని కడసారి చూసిన రూపం చిరకాలం గుర్తుండిపోతుంది. ఆ తుది జ్ఞాపకం ఇబ్బందికరంగా కాకుండా, ఎప్పట్లా ఆత్మీయంగానే  ఉండాలని చాలామంది కోరుకుంటారు. ఈ కోరికను తీర్చేదే ఎంబామింగ్‌. ఏంటి ఎంబామింగ్‌.? ఎలా చేస్తారు? ఎందుకు చేస్తారు? ఎంబామింగ్‌ వాడే కెమికల్‌ ఏంటి? ఎంబామింగ్‌ ప్రక్రియ పూర్తయ్యాక ఎన్నాళ్లు బాడీని ఎన్నాళ్లు కాపాడుకోవచ్చు? హావ్‌ ఏ లుక్‌..