Actor Sridevi

సంచలనం సృష్టిస్తున్న వర్మ లెటర్

Submitted by arun on Wed, 02/28/2018 - 11:51

అందాల నటి శ్రీదేవి మరణవార్త విన్నప్పటి నుంచి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఆవేదనను ట్వీట్స్, ఫేస్‌బుక్ పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. శ్రీదేవి మ‌ర‌ణం వ‌ర్మని ఎంత‌గా క‌లిచి వేస్తుందో అవి కళ్లకు కడుతున్నాయి. తాజాగా, ‘శ్రీదేవి అభిమానులకు నా ప్రేమలేఖ’ పేరిట ఫేస్ బుక్‌‌లో వర్మ ఓ సంచలన పోస్ట్ చేశాడు. అందులో శ్రీదేవి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు రహస్యాలను ప్రస్తావించాడు. ఈ లేఖను బయటపెట్టాలా? వద్దా? అని తనలో తాను ఎంతో మధనపడ్డానని, ఎందుకంటే, కొన్ని పేర్లను బయటపెట్టాల్సి వస్తోందని వర్మ తెలిపాడు.