bathtub of hotel room

శ్రీదేవి మ‌ర‌ణంలో కొత్త‌కోణం

Submitted by lakshman on Tue, 02/27/2018 - 07:49

శ్రీదేవి భౌతికకాయం ఈరోజు కూడా ఇండియాకు రావ‌డం క‌ష్ట‌మేన‌ని ప్రాసిక్యూష‌న్ చెబుతోంది. శ్రీదేవి మ‌ర‌ణంపై విచార‌ణ చేప‌ట్టిన ప్రాసిక్యూష‌న్ బోనీక‌పూర్ తో స‌హా ముగ్గురు వాంగ్మూలం తీసుకుంది. ఆ వాంగ్మూలలో బోనీ క‌పూర్, అత‌ని కుటుంబ‌స‌భ్యులు , హోట‌ల్ సిబ్బంది  చెప్పిన స‌మాధానాలకు పొంత‌న‌లేక‌పోవ‌డంతో కేసును లోతుగా విచారించాల‌ని స్ప‌ష్టం చేసింది. దీంతో బోనీ పాస్ పోర్టును , ఫోన్ కాల్ డేటా ను స్వాధీనం చేసుకున్న పోలీసులు ప‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. శ్రీదేవి మ‌ర‌ణానికి ముందు ఆమె ఎవ‌రికో ఎక్కువ సార్లు ఫోన్ చేసిన‌ట్లు తేలింది.