Sridevi death

శ్రీదేవి మరణం.. వాళ్లను ఒక్కటి చేసింది

Submitted by arun on Sat, 03/17/2018 - 11:25

కొన్ని విషాదాలు.. కొన్ని మార్పులకు కారణం అవుతాయంటారు. అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఈ విషయాన్ని అక్షర సత్యం అని నిరూపించింది. శ్రీదేవి భర్త బోనీకపూర్ విషయంలో ఇది నిరూపితమైంది. శ్రీదేవిని బోనీ కపూర్ రెండో వివాహం చేసుకున్నాడనీ.. మొదటి భార్యతో అర్జున్ కపూర్, అన్షులాను సంతానంగా పొందాడనీ అందరికీ తెలిసిందే. కానీ.. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి.. అర్జున్, అన్షులా.. బోనీకి దూరమయ్యారు. ఒంటరిగానే గడుపుతున్నారు. చివరికి శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ లో చాలా మార్పు కనిపించింది.

శ్రీదేవి కోసం కంగనా ఏం చేసిందో తెలుసా?

Submitted by arun on Mon, 03/05/2018 - 17:51

అతిలోక సుందరి శ్రీదేవిని ఇష్టపడని వారు.. ఆరాధించని వారు.. ఆమె చనిపోయిందంటే ఏదో కోల్పోయామని బాధ పడేవారు ఎవరు కాదు చెప్పండి? అందులో ఒకరే.. మన వెర్సటైల్ హీరోయిన్ కంగనా రనౌత్. ఆమె కూడా చిన్నపుడు శ్రీదేవిని విపరీతంగా ఆరాధించేదట. అప్పుడు ఓ ట్యూబ్ లైట్ ప్రకటనలో వచ్చే శ్రీదేవిని చూసేందు కోసం కంగనా చాలా ఆరాటపడేదట.

శ్రీదేవి అంత్యక్రియల్లో నవ్వులా ?

Submitted by arun on Fri, 03/02/2018 - 12:08

అందాలనటి శ్రీదేవి మ‌ర‌ణ వార్త బాలీవుడ్‌నే కాదు.. యావ‌త్ దేశాన్ని కుదిపేసింది. సామాన్యుల‌తోపాటు సినీ సెల‌బ్రిటీలు సైతం శ్రీదేవి మ‌ర‌ణ‌వార్త‌ను జీర్ణించుకోలేక‌పోయారు. శ్రీదేవి మృత‌దేహం భార‌త్‌కు రాగానే నివాళుల‌ర్పించేందుకు బాలీవుడ్‌, టాలీవుడ్‌, కోలీవుడ్‌, శాండ‌ల్‌వుడ్ నుంచి ఎంతో మంది సినీ ప్ర‌ముఖులు ముంబై త‌ర‌లి వెళ్లారు. సుస్మితాసేన్‌, అమితాబ్‌, శ్ర‌ద్ధా క‌పూర్ వంటి నటులు శ్రీదేవి భౌతిక కాయాన్ని చూసి విల‌పించారు. అయితే శ్రీదేవికి నివాళుల‌ర్పించ‌డానికి వ‌చ్చిన ఓ హీరోయిన్ మాత్రం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. దానికి అక్క‌డ ఆమె వ్య‌వ‌హ‌రించిన తీరే కార‌ణం.

శ్రీదేవి డెత్ సీక్రెట్స్

Submitted by lakshman on Wed, 02/28/2018 - 02:54

కేసు క్లోజ్ అని తేల్చారు. ఇన్వెస్టిగేష‌న్ ఎండ్ చేశారు. డెత్ స‌ర్టిఫికెట్ లోను ఆమె ప్ర‌మాద‌వ‌శాత్తు వ‌ల్ల ప్రాణాలు కోల్పోయారు అని రిపోర్టు ఇచ్చారు. కానీ అనుమానాలు మాత్రం మిగిలే ఉన్నాయి. సరిగ్గా ఒక్క‌రోజు ముందే శ్రీదేవి మ‌ర‌ణంపై ఫోరెన్సిక్ రిపోర్టును విడుద‌ల చేసింది. అయితే కేసు లో జాప్యం జ‌రుగుతున్న నేప‌థ్యంలో విచార‌ణ చేప‌ట్టిన దుబాయ్ పబ్లిక్ ప్రాసిక్యూష‌న్ ఫోరెన్సిక్ ను కొట్టిపారేసింది. బాత్ ట‌బ్ లో ప‌డి చనిపోవ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించింది.  ఇలా దుబాయ్ పోలీసుల‌కు  చెప్పాల్సిన ప్ర‌శ్న‌లు చాలానే ఉన్నాయి. 
- అస‌లు రూంనెంబ‌ర్ 2201లో ఏంజ‌రిగింది. 

శ్రీదేవి మరణం వెనుక దావూద్..

Submitted by arun on Tue, 02/27/2018 - 14:48

శ్రీదేవి మరణంపై సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి. ఆమెది సహజ మరణం కాదని, హత్యేనని అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు డెత్ మిస్టరీ వెనక మాఫియా డాన్‌ దావూద్ ఇబ్రహీం ఉండొచ్చన్నారు స్వామి. బాలీవుడ్‌ తారలతో దావూద్‌కు సంబంధాలున్నాయని గుర్తు చేసిన సుబ్రమణ్య స్వామి, ఈ కోణంలో తప్పకుండా విచారణ చేయాలని కోరారు.

‘శ్రీదేవిని హత్య చేశారు’

Submitted by arun on Tue, 02/27/2018 - 11:32

ప్రముఖ నటి శ్రీదేవి ఆకస్మిక మరణం,  దీనిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న సమయంలో బీజేపీ సీనియర్‌నేత, ప్రముఖ న్యాయవాది కూడా అయిన సుబ్రహ్యణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

బోనులో బోనీ?

Submitted by arun on Tue, 02/27/2018 - 11:03

శ్రీదేవి కేసులో ప్రధాన సాక్షి ఆమె భర్త బోనీ కపూర్. హోటల్ గదిలో శ్రీదేవి చనిపోయేముందు ఏం జరిగింది? అనే అంశంపై కచ్చితమైన సమాధానం ఇవ్వగలిగినవాడు ఆయనొక్కరే. కానీ దుబాయ్ పోలీసు అధికారులకు బోనీ ఇచ్చిన స్టేట్మెంట్ సంతృప్తి కలిగించడం లేదు. పొంతని కుదరని బోనీ మాటలు ఆయనపై సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే బోనీకపూర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆయనను త్వరలో ఇంటరాగేట్ చేయనున్నారు. పాస్ పోర్టు స్వాధీనం చేసుకోవడం, ఆయన కుటుంబ సభ్యులు కూడా దేశం విడిచి వెళ్లొద్దని చెప్పడం చూస్తే బోనీ కపూర్ ఈ కేసులో కార్నర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

శ్రీదేవి డెడ్‌బాడీ తరలింపుపై సస్పెన్స్‌

Submitted by arun on Tue, 02/27/2018 - 10:41

శ్రీదేవి మృతిదేహం...భారత్‌కు తరలింపుపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన వెంటనే డెడ్‌బాడీని తరలించేందుకు  క్లియరెన్స్‌ వచ్చిందని యుఏఈ రాయబారి నవదీప్‌ సూరి తెలిపారు. అయితే అంతలోనే సీన్‌ మారిపోయింది. శ్రీదేవి నటమునిగి చనిపోయారని తెలియడంతో కేసును పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కు బదిలీ చేశారని ఈ కారణంగా మృతదేహం తరలింపు మరింత ఆలస్యమవుతుందని నవదీప్‌ సూరి వెల్లడించారు. వీలైనంత త్వరగా డెడ్‌బాడీని ఇండియాకు తరలించేందుకు అధికారులు నిరంతరం చర్చలు జరుపుతున్నారు. 

బోనీ క‌పూర్ పై అనుమానం

Submitted by lakshman on Tue, 02/27/2018 - 07:23

అందాల తార శ్రీదేవి డెత్ మిస్టరీగా మారింది. ఆమె చ‌నిపోయి 40గంట‌లు దాటిన డెడ్ బాడిని ఇండియాకి తిరిగి తెచ్చే ప్ర‌య‌త్నాలు ఇంకా కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో ఈమె మ‌ర‌ణంపై అనేక అనుమానాల్ని తావిచ్చేలా ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఆమె బాత్ ట‌బ్ లో ప‌డి చ‌నిపోయార‌ని వ‌చ్చింది . దీంతో మ‌రిన్ని అనుమానాలు ప్ర‌స్పుట‌మ‌వుతున్నాయి. బాత్ టబ్ లో ప‌డి శ్రీదేవి ఎలా చనిపోతుంది అని. ఇదే విష‌యంపై దుబాయ్ ప్రాసిక్యూష‌న్ కూడా అనుమానం వ్య‌క్తం చేసింది. ఆమె బాత్ ట‌బ్ లో ప‌డి చ‌నిపోయింద‌ని నిర్ధారించ‌లేమ‌ని, కేసును మ‌రింత లోతుగా ద‌ర్యాప్తు చేప‌ట్టాల్సి వ‌స్తుంద‌ని చెప్పుకొచ్చింది.

షాకింగ్‌ ట్విస్ట్‌.. శ్రీదేవికి గుండెపోటు కాదు..

Submitted by arun on Mon, 02/26/2018 - 17:13

అందాలతార శ్రీదేవి మృతి వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది. పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు బయటపడ్డాయి. శ్రీదేవి ప్రమాదవశాత్తూ బాత్ టబ్‌లో పడి చనిపోయినట్లు తేలింది. పెళ్ళి ఫంక్షన్‌కు రెడీ అవడానికి ముందు బాత్‌ రూంకి వెళ్ళిన శ్రీదేవి పక్కనే ఉన్న టబ్‌లో మునిగి చనిపోయినట్లు దుబాయ్ ఆరోగ్య శాఖ నివేదిక తెలిపింది. దుబాయ్ జువైరా ఎమిరేట్స్ టవర్స్ హోటల్‌‌లో ఉన్ని శ్రీదేవి శనివారం రాత్రి డిన్నర్‌కు వెళ్ళడానికి ముందు బాత్ రూంకు వెళ్ళారు. బాత్ రూంలో ఆమె రెడీ అవుతున్న సమయంలో ఆమె ప్రమాదవశాత్తూ టబ్‌లో పడిపోయారు. ఏదైనా పట్టుకుని నిలబడదామని శ్రీదేవి యత్నించింది. అయితే అది సాధ్యం కాలేదు.