boney kapoor

శ్రీదేవి మరణం.. వాళ్లను ఒక్కటి చేసింది

Submitted by arun on Sat, 03/17/2018 - 11:25

కొన్ని విషాదాలు.. కొన్ని మార్పులకు కారణం అవుతాయంటారు. అతిలోక సుందరి శ్రీదేవి మరణం.. ఈ విషయాన్ని అక్షర సత్యం అని నిరూపించింది. శ్రీదేవి భర్త బోనీకపూర్ విషయంలో ఇది నిరూపితమైంది. శ్రీదేవిని బోనీ కపూర్ రెండో వివాహం చేసుకున్నాడనీ.. మొదటి భార్యతో అర్జున్ కపూర్, అన్షులాను సంతానంగా పొందాడనీ అందరికీ తెలిసిందే. కానీ.. శ్రీదేవిని పెళ్లి చేసుకున్న తర్వాత నుంచి.. అర్జున్, అన్షులా.. బోనీకి దూరమయ్యారు. ఒంటరిగానే గడుపుతున్నారు. చివరికి శ్రీదేవి మరణం తర్వాత అర్జున్ లో చాలా మార్పు కనిపించింది.

అతిలోక సుందరి గురించి ఎవరికి తెలియని విషయాలతో...

Submitted by arun on Fri, 03/09/2018 - 11:30

అతిలోకసుందరి మరణించి రెండు వారాలవుతోంది అయినప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో ఆమె స్థానం పదిలంగానే ఉంది. సినిమాల్లోని ఆమె నటనను జనం మరచిపోలేకపోతున్నారు. అయితే శ్రీదేవి గురించి ఎవరికి తెలియని విషయాలతో డాక్యుమెంటరీ తెరకెక్కించాలని బోనీ కపూర్‌ ప్లాన్‌ చేస్తున్నారు.

రామేశ్వరంలో కలిసిపోనున్న శ్రీదేవి…!

Submitted by lakshman on Sat, 03/03/2018 - 19:50

అతిలోక సుందరి శ్రీదేవి చనిపోయినా.. ఆమె అందం మాత్రం ఇంకా మనల్ని విడిచిపెట్టడం లేదు. శ్రీదేవి బతికే ఉందేమో.. నిన్నటివరకూ జరిగింది కలేనేమో .. అని అనుకునే వాళ్లు కూడా ఇంకా ఉన్నారంటే.. ఎంత మాత్రం అతిశయోక్తి కానేకాదు. అంతగా తన అందంతో సమ్మోహనం చేసిన శ్రీదేవి.. తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె అంత్యక్రియలను శాస్త్రోక్తంగా జరిపించిన కుటుంబం.. ఇప్పుడు అస్తికలను కూడా సంప్రదాయం ప్రకారం రామేశ్వరంలో కలిపేందుకు ఆమె కుటుంబం నిర్ణయించింది.

ప్రపంచానికి చాందిని.. నాకు స్నేహితురాలు..

Submitted by arun on Thu, 03/01/2018 - 09:41

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది సినీ అభిమానుల ఆరాధ్య దేవత శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఆమె మరణవార్తతో ఎందరో షాకయ్యారు. తమ సొంత మనిషే చనిపోయిందన్నంత బాధపడ్డారు. ఎన్నో ఏళ్లు ప్రేమించి పెళ్లాడిన ఆమె భర్త బోనీకపూర్ పసిపిల్లాడిలా విలపించారు. శ్రీదేవి లేని తను, తన ఇద్దరు కూతుళ్లు ఎప్పటికీ అంతకు ముందున్నట్టు జీవించలేమని చెప్పారు. శ్రీదేవి అంత్యక్రియల అనంతరం విడుదల చేసిన ఓ ప్రకటనలో తమ వ్యక్తిగత జీవితాన్ని గౌరవించాలని కోరారు. 

శ్రీదేవి అంటే ఎంతో గౌరవం: అర్జున్ క‌పూర్

Submitted by arun on Wed, 02/28/2018 - 11:37

ప్రముఖ నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ మొదటి భార్య మోనా సౌరీ‌కపూర్ కుమారుడుకి, శ్రీదేవికి మధ్య చాలాకాలంగా వివాదాలు ఉన్నాయని ఎంతో కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే శ్రీదేవి దుబాయ్‌లోని ఓ హోటల్‌లో బాత్‌టబ్‌లో పడి కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బోనీ కపూర్‌ మొదటి భార్య కుమారుడు అర్జున్‌కపూర్‌.. శ్రీదేవితో తనకున్న అనుబంధాన్ని వెల్లడించాడు.

శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు

Submitted by arun on Tue, 02/27/2018 - 12:07

లెజండరీ నటి, లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి మృతిపై ట్విస్టుల మీద ట్విస్టులు తిరుగుతున్నాయ్. గుండెపోటుతో మృతి చెందారని బోనీకపూర్‌ తమ్ముడు సంజయ్ కపూర్‌ చెబితే ప్రమాదవశాత్తు బాత్‌ టబ్‌లో మృతి చెందారని దుబాయ్‌ ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌లో సంచలన అంశాలు బయటపడ్డాయ్. మరణం నుంచి ఫోరెన్సిక్‌ రిపోర్ట్ వరకు అన్ని మలుపులే. 

బోనులో బోనీ?

Submitted by arun on Tue, 02/27/2018 - 11:03

శ్రీదేవి కేసులో ప్రధాన సాక్షి ఆమె భర్త బోనీ కపూర్. హోటల్ గదిలో శ్రీదేవి చనిపోయేముందు ఏం జరిగింది? అనే అంశంపై కచ్చితమైన సమాధానం ఇవ్వగలిగినవాడు ఆయనొక్కరే. కానీ దుబాయ్ పోలీసు అధికారులకు బోనీ ఇచ్చిన స్టేట్మెంట్ సంతృప్తి కలిగించడం లేదు. పొంతని కుదరని బోనీ మాటలు ఆయనపై సందేహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇప్పటికే బోనీకపూర్ స్టేట్మెంట్ రికార్డు చేసిన పోలీసులు ఆయనను త్వరలో ఇంటరాగేట్ చేయనున్నారు. పాస్ పోర్టు స్వాధీనం చేసుకోవడం, ఆయన కుటుంబ సభ్యులు కూడా దేశం విడిచి వెళ్లొద్దని చెప్పడం చూస్తే బోనీ కపూర్ ఈ కేసులో కార్నర్ అవుతున్నట్టుగా కనిపిస్తోంది.

శ్రీదేవి మృతికి ముందు ఏం జరిగింది?

Submitted by arun on Tue, 02/27/2018 - 10:50

శ్రీదేవి మృతికి కారణం ఇంకా తేలకపోవడంతో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. శ్రీదేవి మృతికి ముందు ఏం జరిగింది? అనే అంశంపై భిన్నవాదనలు తలెత్తుతున్నాయి. శ్రీదేవి 2 రోజులుగా గదిలోంచి బైటకు రాలేదనే బోనీ తిరిగి దుబాయ్ వెళ్లారా? ఆ రెండు రోజులూ శ్రీదేవి ఫోన్ లో పదే పదే ఎవరెవరితో మాట్లాడారు? మార్వా పెళ్లిలో బోనీ తొలి భార్య బంధువులతో గొడవ జరిగిందా? 

ఆస్తి గొడవలే శ్రీదేవిని దెబ్బతీశాయా?

Submitted by arun on Tue, 02/27/2018 - 10:12

క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు శ్రీదేవిది సహజ మరణం కాదని స్పష్టం చేస్తున్నాయి. అయితే దీనికి బీజం మోహిత్‌ మార్వా పెళ్లిలోనే పడింది. ఆ పెళ్లిలో శ్రీదేవి నవ్వుతూ తిరుగుతున్నది, ఆమె నృత్యం, ఎంజాయ్‌ చేసిన బోనీ కపూర్‌ల దృశ్యాలే ప్రపంచానికి తెలుసు. కానీ ఆ సంతోషాల మాటునే బోనీ-శ్రీదేవి మనసులో బడబాగ్ని దాగిందా? దానికి ఆస్తి గొడవలే కారణమా?

బోనీకపూర్‌‌ను శ్రీదేవి ఎందుకు వివాహం చేసుకుందంటే...

Submitted by arun on Sun, 02/25/2018 - 11:41

శ్రీదేవి తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్‌గా అగ్రస్థానం నిలబెట్టుకుంది. అయితే ఆమె వ్యక్తిగత జీవితం అంతసాఫీగా సాగలేదనే చెబుతుంటారు. సినీ అవకాశాలు తగ్గిపోతున్న సమయంలో ఆమె నిర్మాత బోనీకపూర్‌ను వివాహం చేసుకుంది. దీనిని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. అప్పటికే పెళ్లయి పిల్లలున్న బోనీ కపూర్‌ను శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై బోనీకపూర్ మొదటి భార్య మోనా కపూర్ అప్పట్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివాహానికి ముందే బోనీ కపూర్‌కు శ్రీదేవితో వివాహేతర సంబంధం ఉందని ఆమె ఆరోపించారు. బోనీకపూర్ కారణంగా శ్రీదేవి గర్భవతి అయ్యారని, అందుకే బోనీకపూర్...