International

3800 మంది సిక్కుల‌కు పాక్‌ వీసాలు...

Submitted by chandram on Wed, 11/21/2018 - 15:38

ఈ ఏడాది అంగరంగ వైభవంగా లాహోర్‌లోని నాన్‌క‌నా సాహిబ్‌లో 549వ గురునానక్ జయంతికి సర్వంసిద్దం అయిపోయింది. ఉత్సవాల్లో భాగంగా పాకిస్థాన్ సర్కార్ ఒకేసారి 3800 మంది భారతీయులకు వీసాలు జారిచేసింది. సిక్కు యాత్రికుల‌కు అధిక సంఖ్యలో వీసాలు జారీ చేయ‌డం ఇదే మొట్ట మొద‌టిసారి పాకిస్థాన్ హై క‌మీష‌న్ వెల్లడించింది. ప్రతిఏటా లాగానే సిక్కులకు వీసాలు జారీ చేస్తారు కాగా పెద్ద సంఖ్యలో వీసాలు ఇవ్వడం ప్రత్యేకమైందని పాక్ హై క‌మీష‌న‌ర్ వెల్లడించారు. పక్కదేశాల్లో ఉన్న సిక్కుల కూడా పాక్ సర్కార్ వీసాలు ఇచ్చింది.

పాకిస్థాన్ పై అమెరికా సంచలన నిర్ణయం...

Submitted by chandram on Wed, 11/21/2018 - 13:55

పాకిస్థాన్ కు అగ్రరాజ్యం అమెరికా భారీ షాక్ ఇచ్చింది. ఉగ్రవాదుల ఏరివేతలో పాకిస్థాన్ సరిగా పనిచేయడంలేదంటూ ఇకపై ఆర్ధిక సాయం చేయలేమని రూ. 9,260 కోట్ల ఆర్థికసాయాన్ని బంద్ చేసింది. ఒసామా బిన్ లాడెన్ కు అబోటాబాద్ లో దొంగసాటుంగా స్ధావరం కల్పించిందని అమెరికా మండిపడింది. ఉగ్రవాదాన్ని రూపుమాపుతాం అని మాయా మాటలు చెప్పింది కాని కఠికమైన చర్చలు మాత్రం తీసుకోలేదని, కాగా ఇందువల్ల పాక్ పొరుగు దేశాలు తీవ్రంగా నష్టపోతున్నాయనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

అమెరికాను కాల్చేస్తున్న కార్చిచ్చు.. ఇప్పటికే 71 మంది మృతి

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 08:48

అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చు కాల్చేస్తోంది.  భీకరమైన మంటల కారణంగా ఇప్పటివరకు 71 మంది మరణించగా. 1000 మందికి పైగా ఆచూకీ లభించలేదు. వందలాదామంది గాయపడ్డారు. అయితే కాలిఫోర్నియా చరిత్రలోనే ఈ ప్రమాదం అతిపెద్దదని అధికారులు తేల్చారు. ఇప్పటివరకు 6వేల 5వందల నివాస ప్రాంతాలు బుగ్గిపాలయ్యాయి. దాదాపు 90వేల ఎకరాల భూమి కాలిబూడిదైంది.

అమెరికన్ కాంగ్రెస్‌లో H-4 ఎంప్లాయిమెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు

Submitted by nanireddy on Sun, 11/18/2018 - 08:10

కొద్దిరోజులక్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H-4 వీసాపై ఉన్న పని అనుమతిని తొలగించనున్నట్లుగా జీవో జారీ చేశారు.. అయితే  H-4 వీసాదారులను కాపాడాలంటూ ఇద్దరు సెనేట్సభ్యులు అమెరికన్ కాంగ్రెస్ లో బిల్లు ప్రవేశపెట్టారు. H-4 వీసా పొందినవారికి అమెరికాలో పనిచేసే అనుమతి లభిస్తోంది. H1b వీసాదారుల జీవిత భాగస్వామికి అమెరికాలో H-4 వీసాలను ఇస్తున్నారు. ఈ క్రమంలో పని అనుమతి తీసివేయడం వల్ల వారి కుటుంబాలు విడిపోయే ప్రమాదం ఉంది. అలాగే వేలాదిమంది ప్రతిభావంతులు అమెరికాను విడిచివెళ్లే అవకాశం ఉందని శాసనకర్తలు అన్నాజీ ఎషో, జోయ్ లాఫ్ గ్రెన్ లు ఈ బిల్లులో పేర్కొన్నారు.

ఫేస్‌బుక్‌ సీఈఓకు మళ్ళీ తలనొప్పి

Submitted by nanireddy on Sat, 11/17/2018 - 19:26

ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌కు సంబంధించిన ఓ వార్త తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ రాజీనామా చేయాలంటూ పెద్ద ఎత్తున ఒత్తిళ్లు వస్తున్నట్లు సమాచారం. సీఈఓ పదవి నుంచి జుకర్ బర్గ్ తప్పుకోవాలని సంస్థ పెట్టుబడిదారులు కోరుతున్నారని తెలుస్తోంది. రిపబ్లికన్‌ పార్టీకి చెందిన పొలిటికల్‌ కన్సల్టింగ్‌ సంస్థ, పబ్లిక్‌ అఫైర్స్‌తో ఫేస్‌బుక్ ఒప్పందం కుదుర్చుకున్నారన్న వార్తలు ఇందుకు కారణంగా భావిస్తున్నారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పెట్టుబడిదారులు జుకర్‌బర్గ్‌ తప్పుకోవాలని పట్టుబడుతున్నారని ప్రచారం జరుగుతోంది.

మాల్దీవులు కొత్త అధ్యక్షునిగా ఇబ్రహీం మహ్మద్ సోలీ

Submitted by chandram on Sat, 11/17/2018 - 18:23

మాల్దీవులు కొత్త అధ్యక్షునిగా ఇబ్రహీం మహ్మద్ సోలీ  ప్రమాణ స్వీకారం కార్యక్రమం అత్యంత వైభంగా జరిగింది. పలు దేశాల అధ్యక్షులు పాల్గొన్న ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో భారత ప్రధాని మోడీ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. చైనా కబంద హస్తాల నుంచి మాల్దీవులను విముక్తి చేసేందుకు ఇబ్రహీం మహ్మద్ సోలీ సుముఖత వ్యక్తం చేయడంతో భారత్, అమెరికాలు స్నేహ హస్తాన్ని అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఫోక్స్‌వాగన్‌కు 100 కోట్ల జరిమానా!

Submitted by chandram on Fri, 11/16/2018 - 18:42

జర్మన్ దేశానికి చెందిన కార్లకంపెనీ అయిన ఫోక్స్ వాగన్ ను ఉన్నపలంగా  రూ. 100 కోట్లు సీపీసీబీ వద్ద కట్టాల్సిందిగా నేషనల్ గ్రీన్ ట్రీబ్యునల్ ఆదేశాలు జారిచేసింది. ఫ్రోక్స్ వాగన్ కంపెనీ డీజిల్ కార్ల ఉద్గార టెస్ట్ ల సమయంలో మోసపూరిత పరికరాన్ని సంస్థ వాడిందన్న కేసులో నేషనల్ ట్రిబ్యునల్ సంస్థ ఉన్నపలంగా ఉత్తర్వులు జారిచేసింది. ఈ పరికరం వల్ల పర్యావరణానికి ఎంత నష్టం కలిగిందో  తెలియజేయడాని పర్యవరణశాఖ, భారీ పరిశ్రమల శాఖ, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌లతో కమిషన్‌ను ఎన్‌జీటీ చైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ ఏర్పాటుపరిచారు.

కజ్కిస్తాన్‌లో భారతి విద్యార్థి హత్య - యునివర్శిటి నిర్లక్ష్యం

Submitted by admin on Thu, 11/15/2018 - 16:07

వైద్య విద్యకోసం దేశం కాని దేశం వెళ్లిన ఒక విద్యార్థి నిండు ప్రాణాన్ని కొందరు దుండగులు బలి తీసుకున్నారు.రాజస్తాన్‌కు చెందిన విద్యార్థి హేమంత్‍ వైద్య విద్య కోసం రెండేళ్ల క్రితం వెళ్లాడు.ప్రస్థుతం మూడు సంవత్సరం చదువున్న హేమంత్‌ను కజకిస్తాన్‌కి చెందిన కొందరు హత్య చేశారు.కాగా ఇక్కడి అధికారుల మరియు కజక్ మెడికల్ యునివర్శిటి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగినట్టు ఇక్కడి విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

కువైట్‌లో మూడు రోజులుగా భారీ వర్షం

Submitted by arun on Thu, 11/15/2018 - 12:08

కువైట్‌ దేశాన్ని భారీవర్షాలు అతలాకుతలం చేశాయి. మూడు రోజులుగా బారీ వర్షం కురుస్తుండగా, మరో రెండు రోజులు వర్షాలు ఉంటాయని అక్కడి వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. అంతేకాకుండా ఇంట్లో నుండి బయటికి రావొద్దని అని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే సహయకచర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం రక్షణ దళాలను రంగంలోకి దించింది. ఎప్పటికప్పుడు ప్రమాద పరిస్థితులు తెలుసుకోనేందుకు టోల్ ఫ్రీ నెంబర్లు ఏర్పాటు చేసింది. ఎటువంటి విపత్కర పరిస్థితులు సంబంధించిన వెంటనే  టోల్ ప్రీం నంబర్లకు సమాచారం ఇవ్వాలని సూచించింది.  

24గంటల్లో 149మంది చనిపోయారు

Submitted by chandram on Mon, 11/12/2018 - 14:32

యెమెన్‌లోని హోదైడా నగరంలో సౌదీ అరేబియా నేతృత్వంలోని బలగాలు ప్రభుత్వానికి మద్దతుగా ఆదివారం తిరుగుబాటుదారులపై చెలరేగిపొయారు. ప్రభుత్వ వర్గాలకు, తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన ఘర్షణలో తీవ్రపాణానష్టం వాటిల్లింది. దాదాపు 24గంటలు జరిగిన హోరాహోరా కాల్పుల్లో 149 మంది చనిపోయారని డాక్టర్లు, మిలిటరీ అధికారులు తెలిపారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలకై అధికారులు దర్యాప్తు చేపట్టారు. అయితే హోదైడా వ్యాప్తంగా 110 మంది తిరుగుబాటుదారులు,32 మంది ప్రభుత్వవర్గీయులు చనిపోయారని వైద్యులు వెల్లడించారు.తిరుగుబాటుదారుల గుప్పిట్లో ఉన్న హొదైడా నగరాన్ని ఎలగైనా చేజిక్కించుకోవాలని ప్రభుత్వ బలగాలు ఈ హింసాత్మకతకు దిగాయి.