International

నవాజ్ షరీఫ్‌కు జైలు శిక్ష రద్దు : పాక్‌ కోర్టు తీర్పు

Submitted by arun on Wed, 09/19/2018 - 17:31

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు అవెన్‌ ఫీల్డ్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో అకౌంటబులిటీ కోర్టు విధించిన జైలు శిక్షను ఇస్లామాబాద్ హైకోర్టు రద్దు చేసింది. నవాజ్ షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం నవాజ్‌ను జైలు నుంచి విడుదల చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. అవెన్‌ ఫీల్డ్ ప్రాపర్టీ కేసులో షరీఫ్‌కు 11 ఏళ్ల జైలు శిక్ష పడగా ఆయన కూతురు మరియంకు 8 ఏళ్ల శిక్ష పడింది. ఇస్లామాబాద్ హైకోర్టు తీర్పుతో అడియాలా జైలులో ఉన్న నవాజ్ షరీఫ్‌ విడుదల కానున్నారు. 5 లక్షల బాండ్ పూచీకత్తుపై కేసులో శిక్షను అనుభవిస్తున్న వారిని  రిలీజ్ చేయాలంటూ ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది.

ఆపరేషన్‌ థియేటర్‌లో నల్లపిల్లి హల్‌చల్‌...(వీడియో)

Submitted by arun on Wed, 09/19/2018 - 12:50

 పాకిస్తాన్‌ లాహోర్‌లోని ఓ ఆస్పత్రిలో నల్లపిల్లి న్యూసెన్స్‌ చేసింది. ఓ పేషెంట్‌కు అర్జెంట్‌గా ఆపరేషన్‌ చేసేందుకు అంతా రెడీ చేసుకున్న తర్వాత ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆపరేషన్‌ థియేటర్‌లోకి దూరింది. ఆపరేషన్‌కు ఉపయోగించే మిషన్‌పై ఎక్కి  రాయల్‌గా కూర్చొంది. పిల్లి అరుపులు గమనించిన వైద్యులు ఏం చేయాలో తెలియక తికమకపడ్డారు. ఆపరేషన్‌ చేస్తుండగా సడెన్‌గా కిందకు దూకితే పెషెంట్‌ పరిస్థితి ఏంటని ఆలోచించారు. అరుస్తున్న పిల్లిని అతికష్టం మీద బయటకు పంపించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 

ఈదురుగాలులు, భారీ వర్షాలు.. ఇప్పటికే 64 మంది మృతి

Submitted by nanireddy on Mon, 09/17/2018 - 09:18

ఫిలిప్పీన్స్‌, హాంకాంగ్‌ ప్రాంతాలను తీవ్రమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ఈదురుగాలుల ప్రభావంతో  64 మంది మృతి చెందగా వందలమంది గాయపడ్డారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు 25 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈదురుగాలులు, వర్షాల ధాటికి 400 విమానాల రాకపోకలను రద్దు చేశారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు నీటిలో చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. ఈ ఉపద్రవంతో అప్రమత్తమైన ప్రభుత్వం వేల సంఖ్యలో సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది. అందులో లక్షలాది మంది తలదాచుకుంటున్నారు. 

మాజీ ప్రధాని భార్య కన్నుమూత.. జైల్లో భర్త, కూతురు

Submitted by nanireddy on Tue, 09/11/2018 - 19:27

పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్(68) కన్నుమూశారు. గతకొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆమె లండన్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సోమవారం కుల్సుమ్‌ ఆరోగ్యం క్షీణించడంతో కృత్రిమ శ్వాసను అందించారు. ఊపరితిత్తుల సమస్య కూడా తలెత్తడంతో చివరకు హ్యార్లీ స్ట్రీట్ ఆసుపత్రిలో మంగళవారం కన్నుమూశారు. పాక్ సాధారణ ఎన్నికల ముందు భార్య కుల్సుమ్ ను లండన్ ఆసుపత్రిలో కలిశారు నవాజ్ షరీఫ్. అనంతరం పాకిస్థాన్ కు తిరిగి వస్తుండగా నవాజ్ షరీఫ్, కుమర్తె మర్యమ్‌లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు సంస్థ అదుపులోకి తీసుకుంది. ప్రస్తుతం వారు పాక్ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు.

షాకింగ్‌ యాక్సిడెంట్‌...

Submitted by arun on Tue, 09/11/2018 - 09:17

ఉక్రెయిన్‌ దేశంలో జరిగిన ఓ ప్రమాదం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అత్యంత వేగంగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్నప్పటికీ అందులో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఉక్రెయిన్‌లో భారీ ప్రమాదం జరిగింది.  ఎదురుగా వస్తున్న వ్యాన్‌ను ఓ లారీ ఢీకొట్టింది. అతి వేగంగా ఢీకొట్టడంతో వ్యాన్‌ ముందుభాగం నుజ్జునుజ్జయింది. అంత భారీ ప్రమాదం జరిగినా అందులోని వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ అతివేగంగా ఢీకొట్టినా.. అందులోని వ్యక్తికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఉక్రెయిన్ ప్రమాదపు వీడియో ప్రపంచ వ్యాప్తంగా చక్కెర్లు కొడుతోంది.

బాల్కనీలో వేలాడిన పసిప్రాణం..

Submitted by nanireddy on Mon, 09/10/2018 - 18:38

తల్లిదండ్రుల నిర్లక్ష్యం కారణంగా ఓ పాప ప్రాణాపాయంనుంచి తప్పించుకుంది. మూడంతస్థుల  భవంతిలో ఇరుక్కుని అల్లాడిపోయింది. చైనాలో ఇటీవల ఈ ఘటన జరిగింది. ఓ బిల్డింగ్ లో నివాసముంటోంది చింగ్ ఉం.. కుటుంబం అతనికి రెండేళ్ల చిన్నారి ఉంది. ఆ చిన్నారి ఇంట్లో నిద్ర పోతున్న సమయం చూసి బయటికి వెళ్ళాడు. ఇంతలో ఆ చిన్నారి నిద్రలేచి.. తండ్రికోసం బాల్కనీలో తొంగి చూసింది. ఇంతలో ప్రమాదవశాత్తు కిందపడబోయి.. బాల్కానీకున్న ఫెన్సింగ్ లో తల ఇరుక్కుంది. అప్పుడే బిల్డింగ్ పరిసర ప్రాంతానికి చేరుకున్న కొరియర్ బాయ్ పాప పరిస్థితి చూసి. అత్యంత చాకచక్యంగా పాప ప్రాణాలు కాపాడాడు.

అమెరికాలో కాల్పులు.. తెలుగు యువకుడు మృతి

Submitted by arun on Fri, 09/07/2018 - 10:49

అమెరికాలో మరోమారు కాల్పుల మోత మోగింది. ఒహాయో రాష్ట్రంలోని సిన్సినాటి లోని ఓ బ్యాంక్‌లో గుర్తుతెలియని  వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. దుండగుడు జరిపిన ఫైరింగ్ లో నలుగురు వ్యక్తులు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. కాల్పుల్లో గాయపడిన వారిని దగ్గర్లోనిఆస్పత్రికి తరలించారు. మృతుల్లో ఒకరు గుంటూరు జిల్లా  తెనాలికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కాల్పులుకు పాల్పడిన ఒమర్‌ పెరాజ్‌ను పోలీసులు మట్టుపెట్టారు. 

పదేళ్లలో మునిగిపోనున్న బ్యాంకాక్

Submitted by admin on Tue, 09/04/2018 - 12:44

బ్యాంకాక్ గురించి అక్కడి అందమైన బీచ్‌ల గురించి వినని వారు ఉండరు.ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది వివిధ దేశాల నుండి అక్కడకు పర్యటనకు వస్తారు.ఒక రకంగా చెప్పాలంటే బ్యాంకాక్ లో ఎక్కువ మంది తమ జీవనాన్ని సాగించేది పర్యాటకం మీదనే.అటువంటి బ్యాంకాక్ కేవలం పదంటే పదేళ్లలో 40 శాతం వరకు సముద్రగర్భంలో కలిసిపోతుందని దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదు అని తేల్చి చెబుతున్నారు శాస్త్రవేత్తలు.

పాక్ ప్రధానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్

Submitted by nanireddy on Sun, 09/02/2018 - 20:55

పాక్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి నెలరోజులు కూడా గడవవకముందే అమెరికా అధ్యక్షుడి నోటా షాకింగ్ మాట విన్నారు ఇమ్రాన్ ఖాన్. పాక్‌కు సహాయంగా ఇవ్వాల్సిన 500 మిలియన్‌ డాలర్ల నిధులకు ఇటీవల యూఎస్‌ కాంగ్రెస్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఆ షాక్‌ నుంచి 

డోనాల్డ్ ట్రంప్ కు మళ్ళీ చిర్రెత్తుకొచ్చింది.

Submitted by nanireddy on Sat, 09/01/2018 - 08:21

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు మళ్ళి చిర్రెత్తుకొచ్చింది. అమెరికా పట్ల WTO (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజషన్)అనైతికంగా వ్యవహరిస్తోందని.. WTO తన రూల్స్‌ను మార్చకపోతే ఆ సంస్థ నుంచి వైదొలుగుతామని వార్నింగ్ ఇచ్చారు. ట్రంప్‌ వరుసగా ప్రకటిస్తున్న రక్షణాత్మక విధానాలు వాణిజ్య పోరుకు తెరతీస్తున్న నేపథ్యంలో వాణిజ్య వివాదాల పరిష్కారానికి WTO కృషి చేస్తోంది.. ప్రస్తుతం  అమెరికా సహాయ నిరాకరణతో ఈ సంస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. WTOలో ఇటీవల పదవీ విరమణ చేసిన ఒక న్యాయమూర్తిని మళ్ళీ  నియమించడంతో వివాదం ముదిరింది. దీంతో  WTO వాణిజ్య వివాదాల పరిష్కార సామర్ధ్యాన్ని కోల్పోతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.